తిధులు - Thidulu, thidi

P Madhav Kumar

 


తిధులు : 15

1. పాడ్యమి 
   6. షష్ఠి 
 11. ఏకాదశి 
 2. విదియ 
   7. సప్తమి 
 12. ద్వాదశి 
 3. తదియ 
   8. అష్టమి 
 13. త్రయోదశి 
 4. చవితి 
   9. నవమి 
 14. ద్వాదశి 
 5. పంచమి 
 10. దశమి 
 15.పూర్ణిమ లేక అమావాస్య 
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15, మరల కృష్ణపక్షంలో పాడ్యమినుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య, 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతాయి. చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారతాయి.

ఉత్తమ తిధులు: 

11. శుక్ల ఏకాదశి,12. శుక్ల ద్వాదశి,13. శుక్ల త్రయోదశి,14. శుక్ల చతుర్దశి,15. పూర్ణిమ,  1. కృష్ణ పాడ్యమి,2. కృష్ణ విదియ,3. కృష్ణ తదియ,4. కృష్ణ చవితి,5. కృష్ణ పంచమి.
మద్యమ తిధులు:- 6. శుక్ల షష్ఠి,7. శుక్ల సప్తమి,8. శుక్ల అష్టమి,9. శుక్ల నవమి,10. శుక్ల దశమి, 6. కృష్ణ షష్ఠి7. కృష్ణ సప్తమి,8. కృష్ణ అష్టమి,9. కృష్ణ నవమి,10. కృష్ణ దశమి.

అధమ తిధులు: 

12. శుక్ల ద్వాదశి,3.శుక్ల తదియ,4.శుక్ల చవితి,5.శుక్ల పంచమి.11.కృష్ణ ఏకాదశి,12.కృష్ణ ద్వాదశి,13.కృష్ణ త్రయోదశి,14.కృష్ణ చతుర్ధశి,15.అమావాస్య.

సంకల్పతిధి; 

ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏ తిధి ఉన్నదో ఆ తిధినే ఆ రోజంతా సంకల్పానికి చెప్పాలి.ఒక రోజు సూర్యోదయానికి ఒక తిధి ఉండి మరుసటి రోజు సూర్యోదయం లోపల ఇంకొక తిధి వస్తే మొదటి తిధి ‘ఉపరి’రెండవ తిధి అని చెప్పాలి.

తిధి సంధి: 

పంచమి,షష్ఠి లయొక్కయు,దశమి,ఏకాదశి ల యొక్కయు 4 ఘడియలు తిధిసంధి అనబడును.ఈ సంధిన జననమైన యెడల పితృగండం.

గండతిధి: 

పూర్ణ తిధులలో చివరి 48 నిమిషాలు,నంధ తిదులలో మొదటి 48 నిమిషాలు తిధి గండాతాలు అవుతాయి.శుభకార్యాలు చేయరాదు.

పంచ పర్వతిధులు : 

అష్టమి, చతుర్ధశి, అమావాస్య, పౌర్ణమి, సూర్య సంక్రమణం ఉన్న తిధి పంచపర్వ తిధులు అంటారు.ఇవి శుభకార్యాలకు పనికిరావు.

పక్ష రంధ్ర తిధులు: 

చవితి మొదటి 8 ఘడియలు,షష్ఠి మొదటి 9 ఘడియలు,అష్టమి మొదటి 14 ఘడియలు,నవమి మొదటి 25 ఘడియలు,ద్వాదశి మొదటి 10 ఘడియలు,చతుర్ధశి మొదటి 5 ఘడియలు.ఈ ఘడియలలో వివాహం చేయరాదు.మిగిలిన ఘడియలు శుభప్రధములు.

పితృకార్యములకు తిధి: 

అహఃప్రమాణమును (పగటి ప్రమాణం)ను ఐదు భాగాలుగా చేస్తే అందులో మొదటిభాగం ప్రాతఃకాలం,రెండవ భాగం సంగమ కాలం,మూడవ భాగం మధ్యాన్నం,నాల్గవ భాగం అపరాహ్నం,ఐదోభాగం సాయంకాలం .ఏ తిధి మద్యాన్నం మించి అపరాహ్నం వరకు వ్యాపించి ఉన్నదో ఆ తిధి పితృకార్యములకు మంచిది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat