హిందువులు చెట్టు, పుట్ట, నేల, నింగి, సూర్య అలా అన్నింటికి మ్రోక్కడంలో ఆంతర్యం | Why Hindus are enamored with all things like trees, flowers, soil, sun, etc

P Madhav Kumar

 ఇటువంటి ఆక్షేపణలలో అర్ధం లేదు. మన జీవితానికి ఆధారభూతమై ఎల్లప్పుడు సహకరించే వాటిని మనం దైవంగానే భావిస్తాము. నమస్కరించడం మన సంస్కృతి నేర్పిన సంస్కారం. మనం జీవించ దానికి ఆధారం ప్రాణవాయువు. ఈ లోకంలో ఒకరోజు గడిచిందని చెప్పడానికి కాలప్రమాణం సూర్యుడు. కారు చీకటిలో ఆహ్లాదకరమైన చల్లని వెలుగునిచ్చేది చంద్రుడు. మనకు ఆహారాన్ని అందించేది భూమి. ఈ భూమి పాడి పంటలతో సస్యశ్యామలం కావాలంటే వర్షమే ఆధారం. ఆ వర్షాన్నే వరుణుడుగా పూజిస్తాం. జీవుల దేహంలో ఉండవలసిన అగ్ని (ఉష్ణోగ్రత) లేకపోతే ఆ జీవులు మరణించినట్లే! “ఈశావాస్యమిదంసర్వం” కంటికి కనబడని భగవంతుడు ఇన్ని రూపాలుగా వ్యక్తమవుతున్నాడు. మన దేహంలోని ప్రతి అవయవాన్ని మనం ప్రేమిస్తాం. దేనినీ చులకనగా చూడం. అలానే పరమాత్ముని ప్రతిరూపమైన ఈ సృష్టిలో ప్రతి వస్తువుని పరమాత్మగానే భావించి నమస్కరించ మంటుంది యజుర్వేదంలో గల శ్రీరుద్రం. 

   మనకెవరైనా చిన్న ఉపకారం చేస్తే దానిని గుర్తుంచుకుని అభినందిస్తుంటాం, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే మనం తల్లిగర్భంలో ప్రవేశించిన నాటినుండి శ్వాస విడిచిపెట్టే వరకు నిరంతరం అన్నివిధాలా సహకరించే వీటినే భగవత్స్వరూపంగా భావించి కృతజ్ఞతా భావంతో ఆరాధించమంటుంది హిందూ సంస్కృతి. సంస్కృతిని అవగాహన చేసుకోలేకపోవడమే దౌర్భాగ్యం. కనుక మూఢత్వాన్ని వీడి హిందూ సంస్కృతిని అవగాహన చేసుకుంటే ఇది సార్వజనీనమైనదిగాను మహత్తరమైనదిగాను దర్శనమిస్తుంది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat