పురాణాల ప్రకారం శని సూర్య పుత్రుడు కదా. మరి శనిని శూద్ర గ్రహంగా ఎందుకు చెబుతారు?
జ్యోతిష శాస్త్రం ప్రకారం మాట్లాడాలి అంటే శని అనేవాడిని .. శూద్ర వర్ణానికి ప్రీతీకగా చెప్తారు .. పురాతన కాలం లో ఉన్న వ్యవస్థ లో పనులు నడవడానికి శూద్ర వర్ణం అనేది ఒక ముఖ్యమైన వర్ణంగా చూసేవారు .. కష్టపడే తత్వానికి, కృషికి, పనులకు ప్రీతీకగా శని గ్రహాన్ని చెప్తారు .. శని మహర్దశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు చాలా మంది భయపడతారు .. కానీ శని ఇచ్చే అనుభవాలు కానీ, కష్టపడితే ఇచ్చే ఫలితాలు కానీ ఏ దేవుడు ఇవ్వడు .. ఆయన్ని కర్మ ఫల దాత అని అంటారు ..మన ఖర్మ బట్టి, కష్టం బట్టి ఫలితాలను ఇస్తాడు .. అట్లాగే తప్పులు చేసిన కూడా " దండనాయకుడిగా" మారి వాటికి ఫలితాలను గట్టిగ ఇస్తాడు ..
శని అంతర్దశ నడుస్తున్నప్పుడు, లేదా ఏలనాటి శని నడుస్తున్నప్పుడు .. ఒక మనిషి తన తాహతను మించి కష్టపడి పని చేయాల్సి వస్తుంది .. పనులు అన్ని కూడా మందకొడిగా సాగుతాయి .. దాని వలన మనిషికి చిరాకుతో పాటు సహనం కూడా పెరుగుతుంది .. జీవితాన్ని ఓర్పుతో నేర్పుతో ఎదురుకునే ఒక లక్షణం పెరుగుతుంది .. కష్టే ఫలి అన్న సిద్ధాంతం ఆయన దశ లో తెలిసి వస్తుంది .. ఇవన్నీ శూద్ర వర్ణం లక్షణాలు .. ఇలాంటి ఫలితాలను ఇస్తాడు కాబట్టే .. శని ని శూద్ర వర్ణానికి ప్రతీకగా చూస్తారు..
రవి, కుజుడు ధైర్య సాహసాలకు, ఆత్మ విశ్వాసాలకు, రాజ్య పాలనకు ప్రతీక .. బృహస్పతి విద్యకు, శుక్రుడు విద్యకు, అందానికి, సంగీతానికి, లలిత కళలుప్రతీక, చంద్రుడు మనస్ కారకుడు, రాహు ప్రపంచ సుఖాలకు ప్రతీక, కేతు వైరాగ్యానికి ప్రతీక ..
ఒక్కో గ్రాహం ఒక్కో లక్షణానికి ప్రతీక .. అంతే కానీ ఈ దేవతలకు వర్ణాలు ఉన్నాయని కాదు .. దేవతలకు వర్ణాలు అంటవు .. అవి మనుషులకు ఉంటాయి, లేదా ఇతర జాతులకు ఉంటాయి .. ఇవన్నీ సనాతన ధర్మం లో నమ్మకాలు.. రామాయణ మహాభారతాల్లో సైతం గ్రహాల గురించి వారి దశల గురించిరాయటం జరిగింది ..
---నిశ్చలవిక్రమ