*10.భాగం*
తరువాత దేవలుడు
సిద్ధాంతులను బిలిపించి మంచి ముహూర్తము నేర్పటిపించి బ్రాహ్మణులను పిలిపించి
స్వస్యయనముచేయించి వారికి దక్షణలిచ్చి సంతోషపెట్టెను. తరువాతను
నేతకుపక్రమించుచు నాయంబ యిచ్చిన కంకణమును జేతికి ధరించెను.బుద్ధిశాలియగు నాదేవలుడు విలువగల వస్త్రములను నిర్మించెను.
ఇట్లు శ్రీ బ్రహాండపురాణములోని యుత్తరఖండములో బ్రహ్మనారదసంవాదములో నేతసామగ్రిని సంపాదించుట, చౌడేశ్వరియిచ్చిన వస్రాక్షయవర ప్రదానము నన్నది యేడవయధ్యాయము. యథార్థమెటిగినవాడవు గనుక మాసందియముల దీర్పవలయు నన సూతు
డిట్లనియె.సూతు మునులారా ! అనుబంధముగట్టుట దేవలునికి శంకరానుగ్రహమువలన సిద్ధించియున్నది. మఱియు నేతసామగ్రియంతయు నిర్మింప దేవలుడు శక్తిగలవాడే అయిననుదనచే సింహమునకును రాక్షసునకును శాపవిమోచనము చేయవలసియుండుటంజేసి సామగ్రిని సంపాదించునిపచే
మయునిదగ్గఱకు బోవలసివచ్చినది. బ్రహ్మతో సమానమయిన సామర్థ్యముగల
యాదేవలునకు మూడు లోకములయందును సాధ్యముగానిది యొకటియుండునా?
ఇట్లు యావత్సామగ్రియు సిద్ధముచేసికొని యాదేవలుడు భక్తితో జాడేశ్వరియను
పేరుగల చండికాదేవిని మనస్సులో దలంచెను. ఇట్లు దేవలుడు స్మరించినంతనే
యాదేవి దేవలునికి బ్రత్యక్షమయిప్రీతిపూర్వకముగా నిట్లనియె. వత్సా ! దేవలా !
నన్నెందులకు స్మరించితివి? అని యడుగగా నతడిట్లనియె. దేవేశీ !నీదరిసెనమువలన ధన్యుడ నయితిని. నీదయవలన నామనోరధము సఫలమయినది. నేను శివునియాజ్ఞవలన వస్త్రములు చేయుటకు గోరుచున్నాను. భక్తవత్సలురాలవగు నోదేవీ ! నీ కటాక్షము వలననే నేసినవస్త్రములక్షయములగుగాక, నేను
మూడులోకములవారికిని వస్త్రము లీయవలసియున్నది. వారివారి కోరిక ప్రకారము
వస్త్రములు సిద్ధముచేసి యీయవలెను. అట్లు చేసి కృతార్థుడను గావలయును కనుకనట్లు నాకు వరమీయవలయును. అని యిట్లతడు కోరుగానే యామె
ప్రేమపూర్వకముగా నిట్లనియె. రాజేంద్రా ! నీవు కోరినట్లే యగును. ఇదిగో
నేనిచ్చుకంకణమును జేతికి ధరించి నేర్చుకొలదిని నానావర్ణములు గల
వస్త్రములును నేయుము. ఒక్కొక్కరంగుగల నూలుతో నొక్కొక్క వస్త్రమునేయుము.
అవియన్నియు ఆక్షయములగును. నీవెట్టివస్త్రములునేసినను నవి యక్షయములేయగును. మచ్చునకుగా నొక్కొక్కటి మాత్రము నేయుము. అని చెప్పి కంకణమిచ్చి
రాజును సంతోషపఱచి యచ్చటినే యంతర్ధానమైనది. తరువాతను దేవలుడు
సిద్ధాంతులను బిలిపించి మంచి ముహూర్తము నేర్పటిపించి బ్రాహ్మణుల నుబిలిపించి
స్వస్యయనముచేయించి వారికి దక్షణలిచ్చి సంతోషపెట్టెను. తరువాతను
నేతకుపక్రమించుచు నాయంబ యిచ్చిన కంకణమును జేతికి ధరించెను.బుద్ధిశాలియగు నాదేవలుడు విలువగల వస్త్రములను నిర్మించెను.
*సశేషం........*