🌻 *లక్ష్మీదేవికై నారాయణుని అన్వేషణ* 🌻
🍃🌹మతి స్తిమితము లేనివానివలె శ్రీమన్నారాయణుడు తన ప్రియసతి లక్ష్మీదేవిని వెదకుచూ ఎక్కడనూ గానక బాధపడుచుండెను.
🍃🌹రెండు కన్నులను వేయి కన్నులుగా భావించుకొని చూడ ప్రదేశము లేకుండగ చూచుచుండెను. తిరుగనిచోటు లేకుండగ తిరుగుచుండెను. ఎన్నియో కొండలకు ఆయన పాదస్పర్శ లభించినది.
🍃🌹ఎన్నియోప్రదేశములు ఆయన ఆగమనముతో పవిత్రములయినవి. తలక్రిందుల జపము చేసినను స్వర్గమునకేగి నారాయణుని దర్శించుట కష్టమే, అట్టిది ఎందరికో ఆటవికులకు నారాయణుని అమోఘ దర్శన మగుచుండెను, కాని ఆయన నారాయణునిగ వారికి తెలియ స్థితిలో లేకుండెను.
🍃🌹లక్ష్మిని గూర్చి నారాయణుడు గూడ బాధపడవలసి వచ్చెను గదా. నడచి నడచి ఆయాసమును పొందుటయే శరీరము తూలిపోవుచుండగా నారాయణుడు శేషాద్రి దగ్గరకు వచ్చి కొండొక కొండ పై ఒక చింతచెట్టును చేరినాడు.
🍃🌹లక్ష్మిని గూర్చిన చింత తప్ప మరొక్క చింత అతనికి లేకుండెను. చింతచెట్టు చెంత జేరిన నారాయణుడు ఆ చెట్టు నీడలో గల ఒక పుట్టను చూచినాడు. యెటులైనను యెవ్వరికినీ కనిపించకుండా కొన్నినాళ్ళుండవలెనని యోచించిన వాడయి శ్రీమన్నారాయణుడు ఆ పుట్టలో ప్రవేశించి అక్కడ నుండ జొచ్చెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏