“శాకాహారి కాకుండా ఎవ్వరూ ఆత్మజ్ఞాని కాలేరు”… బ్రహ్మర్షి పత్రీజీ

P Madhav Kumar

 

శాకాహారి కావడమనేది చాలా మౌలికమైన సూత్రం.

“గ్రుడ్లు శాకాహారమా? లేక మాంసాహారమా?” అని అడుగుతారు. మొక్కల నుంచి వచ్చేదైతే అది శాకాహారం, జంతువుల నుంచి వచ్చేదైతే అది మాంసాహారం. కనుక గ్రుడ్లు సుతరామూ పనికిరావు. గ్రుడ్లు సాంతమూ – మాంసాహారమే.


ఏ జంతువూ మానవుల కోసం పుట్టలేదు. ప్రతి జంతువూ తన కోసమే, తన స్వంత కళ్యాణం కోసమే పుడ్తుంది. దాని కళ్యాణాన్ని పరిరక్షించడమే మానవుడి యొక్క అసలైన బాధ్యత. మానవులు బుద్ధిమంతులైనప్పుడు మరి తమ చిన్నతమ్ముళ్ళైన … పక్షి సామ్రాజ్యాన్నీ, మత్స్య సామ్రాజ్యాన్నీ … జంతు సామ్రాజ్యాన్నీ పరిరక్షించడమే మానవ సామ్రాజ్యం యొక్క ప్రధాన కర్తవ్యం. అంతేకానీ జంతుసామ్రాజ్యాన్ని భక్షించడం తగదు.


కూరగాయలను, పళ్ళ మొక్కలను బాగా పెంచుతూ, శాకాహారాన్నే స్వీకరిస్తూ జంతువులను పరిరక్షిస్తూ, జంతువులతో ఆడుకుంటూ మరి ఆ విధంగా వుండడమే మానవాళి యొక్క సౌభాగ్యానికీ, కళ్యాణానికీ మూలకారణం అవుతుంది.


–బ్రహ్మర్షి పత్రీజీ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat