🔰 *దేవాంగ పురాణము* 🔰12వ భాగం

P Madhav Kumar

 

 *12.భాగం* 


సూతు తరువాతను రాజర్షియగు దేవలుడు భూలోకమునకు వచ్చి

పృథుచక్రవర్తిచే బాలింపబడుచున్న జంబూద్వీపములోని వజ్రపట్టణములో

బ్రవేశించి పృథుచక్రవర్తికిని నచ్చటనుండువారికిని యధేష్టముగా వస్త్రములనిచ్చెను,

ఆ చక్రవర్తియు వస్తువాహనాదులచే దేవలుని సంతోషింపజేసెను. పిదప

బ్లక్షద్వీపము నకుబోయి శూరసేనుడను రాజనకును బట్టణములో నుండువారికిని

గోరిన ప్రకారము వస్త్రములిచ్చి వారిచే గౌరవింపబడి కుశద్వీపమునకుబోయెను.

అచ్చట రాజగు కుశియనువానికి వస్త్రములిచ్చి యాతనిచే నశ్వాదులచే

గౌరవింపబడెను.అచ్చటినుండి క్రౌంచద్వీపమునకుబోయి యమితౌజస్సుడగు

హేమాక్షుడను రాజునకును వాని ప్రజలకును నానావిధములయిన వస్త్రములనునిచ్చి వారందఱచేతను మౌక్తికములు, ఇంద్రనీలములు గుఱ్ఱములు గజములు

భూషణములు మొదలగువానిచే సత్కరింపబడి శాకద్వీపమునకుబోయెను.

అచ్చటి రాజగు నభిరామునకు గావలసిన వస్త్రములిచ్చి యాతడు రథములు

వాహనములు పల్లకీలు నగలు మొదలగువానిచే సత్కరింపగా సంతోషించి యాతనిదగ్గలు ననుజ్ఞాతుడై శాల్మలద్వీపమునకు బోయెను. దేవలు డాద్వీపాధిపతి

యగు శాలీ హోత్రునకు వస్త్రములిచ్చి కృతసత్కృతియై యచ్చటినుండి పుష్కల

ద్వీపమునకుబోయి యాద్వీపాధిపతియగు భానుమంతునకు సొగసయిన వస్త్రములిచ్చి యతనిచే గౌరవింపబడి మరల జంబూద్వీపమునకువచ్చెను. మఱియుజంబూద్వీపములోనున్న యంగవంగ కళింగాది యావద్రాజులకును వస్త్రములనిచ్చి

సంతోషపటిచెను. నానాదేశేశ్వరులగు రాజులచేతను సమర్పింపబడిన యేనుగులు,

గుఱ్ఱములు, రధములు, భూషణములు, పల్లకీలు, బంగారు, రత్నములు,

ముత్యములు, వస్త్రములు, గోవులు, ధనము, దాసీగణము,ఇతరదానములు,

 మొదలగు వానిచే సత్కరింపబడి రాజశేఖరుండగు నాదేవలుడు పరమానందభరితుడాయెను. వేయేల?ఈజంబూద్వీపములోనున్న నాలుగుజాతులవారికిని

గోరినవస్త్రము లిచ్చి సంతసిం పజేసెను.ఆయాప్రముఖులవలన నీయబడినరధములు మొదలయిన కానుకల సంఖ్యములయిపోయినవి. అయినం గొంతవఱకు

వాని సంఖ్య చెప్పెదనాలింపుడు. ఒక కోటి రధములు రెండుకోట్లు గోరధములు,(బండ్లు) రెండుకోట్లు మదపుటేనుగులు, నాలుగుకోట్లు గుఱ్ఱములు, ఒక్కకోటి లెక్కగల పల్లకీలు పదికోట్ల దాసీజనములు, ముప్పదియాఱులక్షలు దాసులు,నయియుండెను. వీరినందఱును క్రమముగా నామోద పట్టణమునకు బంపించి

తానుబాతాళలోకమునకు బోయెను. అది సర్పములపడగలయందలి రత్నములకాంతులచేతను నాగకన్యకలచేతను బ్రకాశించుచున్నది. పాతాళలోకమునకు రాజగు

వాసుకి యొద్దకుబోయి యతనికి నానావర్ణములుగల వస్త్రములిచ్చెను. చిత్రసేను

డనువానికి దివ్యములయిన వస్త్రములిచ్చెను. తక్షకునకు నెఱ్ఱనివస్త్రములను

నల్లనివస్త్రములను, ఐరావతుడనువానికి దెల్లనివస్త్రములను సౌరభేయుడనుసర్ప

మునకు బీతాంబరమును మఱియు నితరులగు నాగులకు వారివారి యిష్టమునకు వచ్చినవియు నగు వస్త్రములను నిచ్చెను. వాసుకి మొదలగు వారును అమూల్యములగు రత్నములను దేవలునకిచ్చిరి. మఱియు మిగిలిన నాగోత్తములందజబునుదమకు గలిగినమంచిమంచి రత్నములను దెచ్చి దేవలునికి సమర్పించిరి. తరువాతను శేషుడుండుచోటికి బోయి యతనికి నానావర్ణ విరాజమానములగు వస్త్రముల నిచ్చెను.

మఱియు దత్ స్త్రీలకును గోరిన ప్రకారముగానే వస్త్రముల నొసంగెను. ధృతరాష్ట్రుడు

మొదలగు శేషునిమంత్రులకును వారిభార్యలకును గావలసిన వస్త్రములను సమర్పించెను. ఇంకను నాగలోకములోనున్న నాగులకందఱకు ను యధేష్టముగా

వస్త్రదానముచేసి వారిచే బహుమాన పూర్వకముగా నీయబడిన యనేకములగు

మణులు భూషణములు మొదలగువానిచే గౌరవింపబడిన వాడై సంతోషించెను.తరువాతను శేషుడు దేవలుని యందు జాల గౌరవముగలిగి తనకూతును

జంద్రరేఖయనుదాని నిచ్చి వివాహముచేసెను. తరువాత నాదేవలుడు. శేషు

డిచ్చినరత్నములు మొదలగు కానుకలను స్వీకరించి యామించుబోడిని వెంటబెట్టు

కొని భూలోకమునకు వచ్చెను. ఇట్లు మూడులోకములలో నుండువారి మానమును

కాపాడి తనదేశములో నుండువారికి గూడా ననేకములగు వస్త్రముల నిచ్చెను.దేవలునిమంత్రులు బ్రాహ్మణులు రాజులు వైశ్యులు శూద్రులు మొదలగువారు

తమరాజిచ్చిన వస్త్రములనుకట్టుకొని అపరిమితసంతోషమును బొందిరి. ఇట్లు దేవాంగుడగు దేవలమహారాజు మూడులోకములవారికిని వస్త్రములనిచ్చి

మానమును గాపాడి సంతోషించుచు, గీర్తివంతుడై సుఖముగా నుండెను.


 *సశేషం......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat