శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 14 - ఆదుకున్న ఆవుదూడలు

P Madhav Kumar


🌻 *ఆదుకున్న ఆవుదూడలు* 🌻

🍃🌹అందము చిందే ఆవు రూపము ధరించాడు బ్రహ్మదేవుడు. సొగసులు మెరిపించే దూర రూపము ధరించాడు శంకరుడు. లక్ష్మీదేవి సరేసరి! అచ్చు గొల్లభామగా మారిపోయినది. చంద్రగిరిని చోళరాజు పాలిస్తుండేవాడు. ఆ చోళరాజు చెంతకు ఆ యావునూ దూడనూ తోలుకొని గొల్లభామ రూపము ధరించిన లక్ష్మీదేవి వెడలినది. 


🍃🌹చోళరాజునకూ, ఆయన భార్యకూ వానిని చూపించినది. సర్వశుభ లక్షణాలతో విలసిల్లి పుష్టిగా ఉత్సహంగానున్న యావుదూడలను చూచి చూడడముతోనే వారికి అవి నచ్చినవి. గొల్లభామ వద్ద వాటిని కొన్నారు. భలే ‘మంచి బేరము’ అనుట తోడనే గల్లభామ మెల్లమెల్లగా తన దారిన తాను వెడలిపోయినది. 


🍃🌹చోళరాజు భార్యకు ఒక క్రొత్త కోరిక చిగురించింది. భర్తతో అన్నది గదా! ‘‘నాథా మన ఆవులమందలో ననేకము లయిన ఆవులున్నవి. కాని ఈ ఆవుపాలే ప్రతిదినము పోయబడునట్లుగా మీరు చూడవలెను. చూడవలెనను మాట ఏల చేయవలెను’’ భర్త దాని కిష్టపడి పశువుల కాపరిని పిలచి ‘‘ఓయీ! నీవు ఈ గోవును కన్నులందు బెట్టుకొని కాపాడుచూ దీని పోషణ, రక్షణ మున్నగునవి చూచుచుండవలెను. 


🍃🌹జాగ్రత్తగా దీనిని పెంచడమే కాదు. ప్రతిదినము దీని పాలను జాగ్రత్తగా పితుకుతూ మాకిచ్చుచుండవలెను’’యనెను. సరేయని బుర్రనూపెను గోపాలుడు. తన మందకు నాటి నుండి దానిని జోడించి మేతకు తోలుకొనిపోవుట, తీసుకొని వచ్చుట చేయుచుండెను. అతడు ప్రతిదినము మందను శేషాచలమునకే తోలుకు వెళ్ళుచుండెడివాడు. 


🍃🌹మిగిలిన పశువులు మేతను మేయుచుండగా, క్రొత్తగా వచ్చిన ఆవు మేత మేయుచుండెడిది కాదు. నిజమునకది పశువు కాదు కదా! మందతో పాటు వెళ్ళినప్పటికిన్నీ, రహస్యముగా ఆ యావుపోయి శ్రీమహావిష్ణువు తలదాచుకొనిన పుట్టను చేరుచుండెడిది. చేరి ఆ పుట్టలో క్షీరధారలను కురిపించి, అప్పుడు మాత్రము తిరిగివచ్చి మందలో కలిసిపోయేది. 


🍃🌹దూడ దానికెంతో సంతోషించినది. దినదినమూ ఆ యావుదూడలు కలసి వెడలెడివి. పుట్టలో పోయబడిన పాలను ఆవురావుమంటూ యాకలితోనున్న శ్రీమహావిష్ణువు త్రాగుచుండెను, ఈ విధముగా రోజూ జరుగుచుండెను.


🍃🌹ఆ ఆవు పుట్టలో క్షీరధారలు తన పొదుగు నుండి అదుపులేకుండగా పోయుచునేయుండెను. కాని అందువలన చోళరాజుగారి బిడ్డకు పాలు కఱువగుచుండెను. ఇంటిలో పాలిచ్చిన గదా బిడ్డపోషణ. పాలు లభించని సంగతిని గ్రహించి చోళరాజు భార్య కోపాలు పెంచుకొని గోపాలుని పిలిపించింది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat