🔰 *దేవాంగ పురాణము* 🔰 14వ భాగం

P Madhav Kumar

 

 *14.భాగం* 

తరువాత దేవలుడు కైలాసపర్వతమునుండి బయలుదేటి యామోద

పట్టణమునకు వచ్చుచు దారిలో నొక సరస్సును జూచెను. అతడచ్చట శివపూజచేయు తలంపుతో స్నానముచేసెను. నిత్యకర్మములన్నియు బూర్తిచేసికొని పద్మాదులగు పుష్పములచే స్వామిని బూజించి యతిభక్తిగా ఆర్థించెను. దనపట్టణమునకు

బోవ నుద్యుక్తుడాయెను. ఇంతలో సర్వవిమోహినియగు రంభ సుందరుడగు దేవాంగుని బూర్వమునుండియు మోహించి యుండుటంజేసి సమయము కనుగొనుచుండెను. ఇన్నాళ్ళకు దానికంటి కేకాకిగా దేవలరాజగపడెను. సర్వాంగ సుందరియగు రంభ కొంచెము పయ్యెద చెంగు జార్చి స్తనములను జూపుచు హావభావవిలాసములచే |

మోహింప జేయుచు మందగమనముతో దేవాంగునియొద్దకు వచ్చినది. ఇట్లు వచ్చినరంభను జూచి దేవాంగు డిట్టనియె రంభా ! నీవెందులకు వచ్చితివో చెప్పుము.చెలికత్తెనైనను వెంటదీసికొనిరాకుండ నేకాకినివై వచ్చుటకు గారణమేమి ? అని

దేవలుడడుగగా రంభ మోమునంచుకొని చిఱునగవు ముఖము నలంకరింప

బాదాంగుష్టముచే భూమిని గీయుచు నిట్టనియె రాజేంద్రా ! దేవాంగమునీ ! నీవు

మన్మథునితో సమానమైన యాకారము గలవాడవు. పూర్వమే వెండికొండయందు

నిన్నుజూచి మోహించితిని. ఎంతమరల్చుకొంద మన్నను నామనస్సు మరలకుం

డనున్నది. కావున నోదేవా ! నీవు నామనోరథమును దీర్పకతప్పదు. జాగు సేయకుము. నేనిక మరుబారినిపై పజాలను అని యిట్లు చెప్పురంభమాటలువిని

చెవులు మూసికొని శివశివా ! యని ప్రాజ్ఞుడును జితేంద్రయుడును గనుక దానితో నిట్లనియె. రంభా ! నీవును గొంచెము గొప్ప ప్రాజ్ఞురాలవు. నీవంటిది వచ్చి

నన్నట్లనగూడునా ! ఎట్లుచూచినను మావంటివారి కిటువంటిపని యోగ్యమయినది

గాదు. కావున గామినీ ! నీకోరిక పూర్తి సేయుటకు సాధ్యపడదు. నేను విరాగినని యెఱుగవా ! అట్టి నన్నెందులకు గోరితివి ? దేవాదులు నీకోరికను బూర్తిచేయువారు

లేకపోయిరా ? కనుక వారి యొద్దకుబోయి సుఖమునుబొందుము. అంతియే కాని

మాబోట్లవలన నీకేపాటి సంతోషము గలిగిడిని ? ఇటువంటి పనిచేసినచో మావంటి వారికి దేజోహానియు, కర్మలోపమును గలుగును. అదిగాక వేశ్యలతోడి సహవాసము

సత్పురుషులకు బాపమును గలిగించునది యందురు. అందుఱుచేతను నిందితురా

లగు వేశ్య చెడుస్వభావముగల వారిచేతనేయనుభవింపదగియుండును. కామవశం

వదులై యుక్తాయుక్తములు తెలియక యోగ్యులును, అయోగ్యులునుగూడ భ్రాంతిచే వేశ్యలన నుభవింతురు. అట్లనుభవించిన వారందఱును బాపాత్ములే యగుదురు,ఏమోయగు గాక నీవు వేశ్యవుగనుక నిన్ను నేను విడిచితిని. నాచే నీకే విధమయిన ప్రయోజనమును లేదు కనుక నీయిష్టము వచ్చినచోటికి బొమ్ము. నేనును వేగముగా నామోదపట్టణము నకు బోవలసియున్నది. సుందరీ ! నావలన నీమనోరధము

నెఱవేఱుదు గావున నీవు తిన్నగా స్వర్గమునకు బొమ్ము.సూతు - ఇట్లు దేవాంగుడు చెప్పగానే యారంభ కోపము వినయమును దోప తలపంకించుచు నిట్లనియె. రాజేంద్రా ! ఏ మట్లంటివి ? బాగు బాగు !మంచిమాటయే చెప్పితివి. బుద్ధిమంతుడ నగునీ నిట్లనరాదు. నన్ను సాధరణ స్త్రీనిజూచినట్లు చూడదగదు. నేను రంభను. త్రిలోకసుందరిని, అట్టినేను నిన్ను మోహించి వచ్చితిని. అట్టినన్ను నీ విట్టిమాటలా అనబూనితివి ? మహామతీ ! నీవు గణికవు నిందితురాలవునని యేమేమో యంటివిగా ! యధావిధిగా యజ్ఞములు చేసినవారికి నాసంభోగమే ఫలమని పుణ్యాత్ములగు ఋషులు చెప్పగా వినవే ?మఱియు వేదములయందును జెప్పబడియేయున్నది. యదియైనను వినలేదా ?

అందును విశేషముగా బావనురాలునగునన్ను మాత్ర మనమానింపకుము. ముల్లోక

ములుయందును నాతో సమానురాలయిన యందకత్తె లేదుసుమా ! పరాశరుడు,

అత్రి మొదలగు మహామునులుగూడ నామొగము చూచి మోహగ్రస్తులై తమతమ

తపస్సులను బాడుచేసి కొనిరి. వేయేలా ? యెట్టిదృఢచిత్తులయినను నన్ను జూచి మోహమును బొందకపోరు.జితేంద్రియులమని పేరుపొందిన మహామహులనుయోగులను నిర్మలచిత్తులను నిర్మలజ్ఞానభూషణులను నేను నిరసించినదాననుజుమా! నన్ను జూచినవా రెట్టివారయిననువిట శేఖరులు కాకతీరదు. అట్టి

రూపవంతురాలను పవిత్రురాలను లోకసుందరిని నిన్ను గోరివచ్చినదాననుఅగునన్ను నీవేమి స్వీకరింపకున్నావు ? ఎంతో పుణ్యము చేసిననే కాని

నాసంభోగము లభింపదు అట్టియనన్యదుర్లభను నిందితురాలని తృణీకరింపజూచుచుంటివిగా, కోరివచ్చిన దాననని యవమానింపకుము. పురుషులలోజయంతుడు, రతిరాజు వసంతుడు, నలకూబరుడును స్త్రీలలో నేనును జక్కనివారలమని పరిగణింపబడియున్నాము. వారు నీలో బదియాఱువవంతై నను జక్కదనము గలవారు గారని నాకు దోచినది. కావుననే నిన్ను జూచినది మొదలు నామనస్సు

నీయందు జిక్కుకొన్నది. నాకు స్వాధీనము గాకుండనున్నది. ఎప్పుడు దేవాంగుని

జూచెదను ? ఎప్పుడతడు నామనోరధమును దీర్చును ? అని యెదురు

చూచుచుంటిని. రహస్యముగా నీముఖచంద్రు నెప్పుడు చూచెదను ? నా

 కట్టిసమయ మెప్పుడు సమకూడును ? అని యిట్లు నిన్నే చింతనచేయుచు నీమాటలే తలచుకొనుచు నెట్లో యింతకాలమును వెళ్ళించితిని. 


   *సశేషం..........*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat