🌻 *నారదుడు లక్ష్మీదేవిని సందర్శించుట* 🌻
🍃🌹కొల్లాపురమున లక్ష్మీదేవి భర్తయయిన శ్రీమహావిష్ణువును గూర్చి పదేపదే ఆలోచించుచూ కాలము గడుపుచున్నది. తాను కొల్లాపురమున నేకాకిగా నున్నందులకామె లోలోపల మిక్కిలి వెతపడుచున్నది.
🍃🌹ఈ విధముగా వుంటూండగా ఒకనాడు నారాయణ నామస్మరణచేస్తూ నారదుడు వచ్చివాడు. లక్ష్మీదేవి అతనికి తగిన గౌరవము చేసి లోక వృత్తాంత విశేషములు చెప్పుమని అడిగింది.
🍃🌹అడిగినదే తడవుగా నారదుడు సర్వలోక విశేష విషయాలూ లక్ష్మీదేవికి వివరించాడు. పద్మావతీ శ్రీనివాసుల సంగతి కూడా తెలిపినాడు. అందులకు ఆమె తనపట్ల శ్రీనివాసునకు ప్రేమాభిమానములు ఏమయినా తగ్గినవా? అని అడిగింది.
🍃🌹‘‘ఏమో! పద్మావతీదేవిని లాలించుటలో, పాలించుటలో నున్న శ్రద్ద నాపట్ల సున్నయగునేమో!’’ అని స్ర్తీ సహజ భావమును నారదుని యెదుట ప్రకటించినది. నారదుడు ‘‘శ్రీనివాసునకు నీపైగల అభిమానము చెక్కుచెదరలేదు.
🍃🌹అతడును ఈ మధ్య నిన్ను పలుమారులు తలచుకొనుట జరుగుచున్నది. ఆయన హృదయమును అర్ధము చేసుకొని నీవు ఆయనను చేరుటయే లోకకళ్యాణప్రద కార్యమగును.’’ అని బోధించి, తన దారిన వెడలెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏