🔰 *దేవాంగ పురాణము* 🔰 15వ భాగం

P Madhav Kumar


 *15.భాగం* 


పండుకొన్నపుడు గాని

నడుచుచుండునపుడుగాని కూర్చుండునపుడుగాని మాటలాడునపుడుగానిమణియేవిధమయినపనులు చేయునపుడుగాని నిన్ను మఱవలేదు. నిన్ను జూచినదేమొదలు మన్మథుడురాత్రింబవళ్ళు నన్ను మిక్కిలిని బాధించుచున్నాడు.వానిబాణములు పూవులను మాటమాత్రమే కాని యవి యగ్నిగుళికలనితోచుచున్నవి. అవి తగులుటయే మొదలు నాదేహ మంతయు జ్వంత మయి యున్నది.మహాప్రభూ ! నన్నామన్మథచండాలుని బాణములకు గుటి సేయకుము. నాయందు

దయయుంచి వెంటనే నాతాపమును జల్లార్చుము. నీయధరా మృతము ద్రావనిమ్ము.

నాయంతస్తాపము తీబను. నేనిట్లు యాచించుచుండగా నిరాకరించుట తగదు.

దయానిధీ ! స్త్రీనిబాధించుటయే మంచిదని యెంచితివా ? నందష్టాధరపల్లవముగ

గాఢాలింగనము దయచేయుము. ఆహా ! నీమనస్సు వజ్రముచే జేయబడినదియా ?

కావున నే నే నింతగా బ్రతిమాలుకొనుచున్నాను. గరుగకుండ నున్నది. మూకవలె మాటలాడవేమి ? త్రిలోకసుందరి యనిపించుకొన్న రంభ వచ్చి నిన్నింతగాబ్రతిమాలుటా ? అవుననికాని కాదని కాని పలుకరాదా ? అందునకును యోగ్యతలేదా ? పోనిమ్ము పొమ్మని చెప్పినచో బోవుదును. అని యిట్లు దీనదీనముగా

యాచించుచున్న రంభను జూచి నవ్వుచు దేవాంగు డిట్లనియె. సుందరీ ! నేనుమొదటనే చెప్పితిని. నే నీటువంటిపని చేయజాల నంటిని. ఈదేహము

మలమూత్రనిధానము. మిక్కిలి నిందిత మయినది. బహురోగపూరితము. ఇట్టిదేహమునకు స్థిరమయినసుఖ మెక్కడిది ? తెలివిగలవా డెవడయినను నిట్టితుచ్ఛభోగముల కాసించునా ? ఆసించునుపో! మఱింత పాపమే సంభవించును గాని

యేమిలాభమున్నది ? కావున దప్పక విడుచుకో దగినదియే కాని యంగీకరింపదగినది కాదు. ఏమూడుడు తన స్త్రీని విడిచి యితరస్త్రీలను గామించునో

వానిపుణ్యములన్నియు నశించును. అన్యస్త్రీలను గోరువాడు ఘోరములగు

నరకముల ననుభవించును. బుద్ధి తక్కువవాడై మతిచలనముచేతను పరస్త్రీలను

గౌంగిలించుకొన్నచో యమకింకరులచే మిక్కిలిగా బాధింపబడుచుండును.

అట్టివానిచే గాల్చిన యినుప ప్రతిమను గౌగిలింపజేతురు. మోహముచే నెనడు

పరస్త్రీహస్తమును స్వీకరించునో వానిని తేళ్ళగోతులో బడుద్రోయుదురు. పరస్త్రీలను

ముద్దు పెట్టుకొన్న దుర్మార్గునిచే విషపూర్ణములయిన పాములను ముద్దులాడింతురు.

కామమోహితుడయి యెవడు పరస్త్రీని జూచునో వానికన్నులు సూదులతో

 బొడుతురు. నేయేల ? పరస్త్రీ ప్రసంగము చేతను పాపము వృద్ధియగును.

అన్నిపాపములలోను పరస్త్రీ గమనము వలన గలిగిన పాపము గొప్పది.

దేనికయినను బ్రాయశ్చిత్త మున్నది. గాని పరస్త్రీగమనపాపమునకు బ్రాయశ్చిత్తమే లేదు. కావున నేనిటువంటిపాపుని కంగీకరింపను. నేనట్టిదానను, ఇట్టిదానను,నాభోగము నటువంటివారు. ఇటువంటివారు గోరుదురు. అని యేమేయో

వ్యాఖ్యానము చేయుచున్నావు. కాని యాలోచింపగా నది యంతబాగుగా లేదు.

ఏరీతిగా జూచినను జెడ్డదియే యగునీదేహమునకు మంచియనగా నేమున్నది ?

దేహమే నిత్యము గానప్పుడు నీవంటి దానిభోగముమాత్ర మెట్లు నిత్య మగును ? నీచే

భంగపడినవారితో నా కెట్లు సామ్యము చెప్పవచ్చును. ఎవరియిష్టము వారిది.

తాముతాము చేసికొన్నపుణ్యములో పాపములో తామే యనుభవింతురు. కావున

నొకరు చేసిరిగదాయని మఱివొకరు చేయరాదు. నీతో బెక్కుమాట లాడనేల ? నీ

వెంతగా జెప్పిసను నేను వినను. నీయిచ్చకు వచ్చినమచ్చున బొమ్ము. అని యిట్లుదే వాంగమహాముని నిరాకరించినతోడనే యారంభ కోపశోకపరీతచిత్తురాలై యతని నిందించుచు నిట్లనియె ఛీ ! మూడుడా ! ఇంతకఠినచిత్తుడ నని యనుకోనైతిని.

నీ నిత్యానిత్య వివేకము కాల్పనా ? విజ్ఞానమెందుల కుపయోగించును ? నీవు

నిజముగా బురుషుడవేనా ? ఇట్టి నీరసహృదయమునకు నావంటిదానిభోగ

మెట్లబ్బగలదు ? ఎంతో రసికశేఖరు డైననే కాని యెంతో పుణ్యము చేసిననే కాని

నాపొందు దొరకదు. నీవు వట్టిబుద్ధితక్కువవాడవనియు నీరసుడ వనియు నిపుడు

దెలిసికొంటిని. నే నింత దైన్యముగా బ్రతిమాలుకొన్నను నన్ను గ్రహింపకపోతివి

గదా! కావున నీవు శత్రువులచే జిక్కి దైన్యమును బొందెదవుగాక వారు నిన్ను

బంధింతురుగాక, దుర్బుద్దీ ! నే నిచ్చినశాపము నీ కమోఘ మగుగాక, నీపౌరుష

మంతయు నెందులకును బనికిరాకుండ బోవునుగాక నీవిటుపయి నయిదువేల

సంవత్సరములు శూద్రుడ వయిపోవుదుగాక. అటుపయిని మరల బ్రాహ్మణుడవగుదువు. అని యిట్లు శపించి రంభ యతనిని విడిచి పోయినది. తరువాత

దేవాంగుడును గొంతవఱకు జింతించి చేయునది లేక “యీశ్వరాష్ట్ర యిది" యని

నిశ్చయించుకొని తనపట్టణమువైపు బయలుదేతెను.


 *సశేషం........*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat