🔰 *శ్రీ గణేశ పురాణం*🔰16వ భాగం

P Madhav Kumar


 *16.భాగం* 


*ఉపాసనా ఖండము*

*మొదటి భాగము*

*దేవీ ప్రార్థనం*


పై కథ క్రమాన్ని భృగు మహర్షి చెప్పగా అత్యంత శ్రద్ధ భక్తులతో వింటున్న సోమకాంత మహారాజు ఇలా అన్నాడు ఓ ఋషీశ్వర గణేశుని దివ్య ఆవిర్భావము అనుగ్రహము గాధ వింటుంటే నాకెంతో సంతోషం కలిగింది నాకు ఈ మధురమైన దివ్య కథామృతాన్ని ఎంత విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది కానీ తనివి తీరటం లేదు ఆ రకంగా గణేశుని దివ్య వరాలను పొందిన బ్రహ్మ సృష్టిని ఎలా చేశాడు అలాగే తనని ప్రశ్నించిన వ్యాసమహర్షికి ఇంకా ఏమేమి విశేషాలు తెలియజేశాడు ఆ వివరం తెలియజేయి ఆ మాటలకు భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు...



ఓ సోమకాంత మహారాజా బ్రహ్మ సిద్ధ క్షేత్రం యొక్క మహత్యమును వ్యాసునికి తెలియజేశాడు అలాగే నీవడిగిన బ్రహ్మ చేసిన సృష్టిక్రమాన్ని కూడా తెలియజేస్తాను ఆ వివరాలు విను....


మొదట బ్రహ్మ తన యొక్క మన సంకల్ప శక్తితో ఏడుగురు మానస పుత్రులను సృష్టించి వారందరినీ కూడా తనతో సృష్టి కార్యక్రమంలో సహకరించమని ఆదేశించాడు ఆ మాటలు విన్న బ్రహ్మ మానస పుత్రులు తపస్సు చేయాలని నిశ్చయించుకొని అఖండ సపోదీక్షలో నిమగ్నులై బ్రహ్మీ భూతులైనారు. వాళ్లు అలా తపోమగ్నులు అవటం చూసి తన కార్యనిర్వహణకై బ్రహ్మ మరో ఏడుగురు పుత్రులని సృష్టించాడు వాళ్లు కూడా అత్యంత జ్ఞాన సంపన్నులై ఈ సృష్టిలోకి రావటానికి నిరాకరించారు ఇలా తన మానస పుత్రులంతా సృష్టికి విముఖుల అవటం చూసి చివరికి తానే సృష్టి చేయాలని ప్రారంభించాడు....



మొట్టమొదటగా బ్రాహ్మణులను అగ్నిని తన ముఖం నుండి సృష్టించాడు తన చేతుల నుండి ఊరువుల నుండి పాదముల నుండి వరుసగా క్షత్రియ వైశ్య శూద్రులనే ఇతర వర్ణాల వారిని ఆ తరువాత సృష్టి చేశాడు చంద్రుణ్ణి హృదయం నుండి నేత్రాల్లోంచి సూర్యుణ్ణి ముఖంలోంచి వాయువును ప్రాణాన్ని నాభిలోంచి అంతరిక్షాన్ని తలలోంచి వివిధ లోకాన్ని అలానే పాదాల్లోంచి భూమిని తన చెవులలోంచి దిక్కుల్ని సృష్టించాడు....



అలాగే సముద్రాలు పర్వతాలు నదీనదాలు అరణ్యాలు సకల వృక్ష లతా సమూహాలు వీటన్నింటిని కూడా ఆ చతుర్ముకుడు క్రమంగా సృష్టి చేశాడు ఈ సృష్టి రచన అంతా నిర్వహించాక బ్రహ్మదేవునికి ఒక గొప్ప విపత్తు కలిగింది అదేమిటంటే సమస్త జగత్ పాలకుడైన విష్ణువు యోగనిద్ర వశుడై ఉండగా ఆయన చెవి గులిమిలోంచి ఇద్దరూ మహా రాక్షసులు ఉద్భవించారు వారు భయంకర రూపులై భయం కొలిపేలా వికటాట్టహాసం చేస్తూ మహాబల పరాక్రమంతో గర్వోన్తులై సమస్త లోకాలకు ఒక పీడ లాగా దాపురించి జీవులందరినీ బాధించసాగారు భూసురులైన బ్రాహ్మణులను సురులైన దేవతలను సాధు సత్పురుషులను తపోదీక్షలో ఉండి తపమాచరించుకుంటున్న ఋషులను హింసిస్తూ వేద శాస్త్రాలను వేలాకోలం చేసి దూషిస్తూ పరిహసించసాగారు వారి భీకర గర్జనలకి ముల్లోకాలు భయంతో గడగడా వనికాయి ఆ మధు కైటభులిద్దరూ కూడ బ్రహ్మను అమాంతం మింగి వేయాలని ప్రయత్నించారు....



*బ్రహ్మ నిద్రాదేవిని స్తుతించడం*



ఆ క్రూర రాక్షసులు వికటాట్టహాసాలకు  బ్రహ్మ బీతి చెంది దిక్కుగానక ఇక తనను రక్షించగలవాడు లోకపాలకుడైన విష్ణువేనని పారిపోయి వైకుంఠాన్ని చేరుకున్నాడు అక్కడ చూస్తే ఆయన యోగ నిద్రలో నిమగ్నుడై ఉన్నాడు అప్పుడు తనకు గజాననుడు ఇచ్చిన వరం స్మరించుకుని ఆ గజాననుని ప్రేరణ చేత శ్రీమహావిష్ణువు నేత్రాలపై నాట్యం చేసే యోగమాయను ఆ రాక్షసులను సంహరింప చేయమని ఇలా స్తుతించ సాగాడు....



ఓ పరమ పావని స్వాహాస్వదా రూపాలను ధరించి యజ్ఞాలు చేసే వారిని అనుగ్రహిస్తున్న కరుణామయివి నీవే సృష్టి స్థితి లయాలను లీలగాను విలాసంగా చేస్తూ ఉండేది నీవే వేదములు కాలము సప్త స్వరాలు ఇవన్నీ నీ రూపమే సమస్త ప్రాణకోటియందు ప్రజ్ఞ రూపిని విగా త్రిసంధ్యాలలోనూ గాయత్రి సావిత్రి సరస్వతి రూపినివిగా ప్రాణులలో ప్రాణ శక్తి స్వరూపంగా ఉన్నది నీవే కరుణామయువైన ఓ మాత నీ యొక్క ప్రేరణ వల్లనే మహావిష్ణువు అవతారాల నెత్తి దుష్ట రాక్షసులను సంహరించి లోక పాలనను నిర్వహిస్తున్నాడు....



అట్టివాడు ప్రస్తుతం నీ ప్రభావానికి వశుడై యోగ నిద్రలో మునిగి ఉన్నాడు అమ్మ దురాత్మలైన ఈ రాక్షసులను సమ్మోహనపరిచి వారి వధకు మార్గాన్ని సుగమం చేయి వీరి ఇరువురు కూడా పూర్వం ఘోరమైన తపస్సును ఆచరించి నావల్ల అమోఘమైన వరాలను పొంది ఉన్నారు కనుక వీళ్లు నా చేత అవధ్యులు ( చంపబడని వారు) నీవే ఆ శ్రీమహావిష్ణువుకు తగిన ప్రేరణ నిచ్చి ఉద్యుక్తుణ్ణి చేసి అతడి చేతిలో వీరు అంతమయ్యేలా అనుగ్రహించు లోకకంఠకులైన ఈ దురాత్మల బారి నుంచి నన్ను కాపాడు అంటూ దీనంగా ప్రార్థించ సాగాడు...


ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని దేవి ప్రార్ధనం అనే  అధ్యాయం సంపూర్ణం...


 *సశేషం.......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat