🔰 *దేవాంగ పురాణము* 🔰 16 వ భాగం

P Madhav Kumar


 *16.భాగం* 


తరువాతను సూర్యుడు తన చెలియలిక వివాహము చేయ నిశ్చయించుకొన్న

వాడై బ్రహ్మయొద్దకు బోయి యిట్లనియె. దేవా ! దేవదత్త యను పేరుగల నా చెల్లెలిని

దేవాంగుని కిచ్చి వివాహము చేయ నిశ్చయించితిని. కావున నీ సిద్ధాంతప్రకారముగా

మంచి ముహూర్త మాలోచించి చెప్పుము. నీవు మాకు బ్రభువవుగదా ! అని చెప్పిన

సూర్యుని జూచి బ్రహ్మ యిట్లనియె. ఓ సూర్యుడా ! నేటి కెనిమిదవనాడు వైశాకశుక్ల

పంచమీదినము సోమవారమునాడు రాత్రి యేడుగడియలు దాటిన తరువాతను ధనుర్లగ్న మున వివాహము చేసినచో శుభావహమగును. అని బ్రహ్మ చెప్పగానే మంచిదేయని యంగీకరించి దేవరా ! తాము సపరివారముగ వివాహమునకు దప్పక

దయచేయవలయునని చెప్పి యచ్చటినుండి కైలాసమునకు బోయి శంకరునితో నిట్లనియె మహాదేవా !తమయనుమతిని శిరసావహించి మాచెల్లెలిని దేవాంగమహారాజున కిచ్చి పెండ్లిచేయ నిశ్చయించితిని. రాబోవు పంచమీదినమున వివాహము గనుక మీదంపతులు సపరివారముగా దయచేసి వివాహమహోత్సవము

యధావిధిగా జరిపించి వధూవరులను దీవించి నన్నానందింపజేయుదురుగాక.

అనగానే వారు మంచిదే యనిరి. తరువాత సూర్యుడు కుమారస్వామిని వీరభద్రుని

నందిని మఱియు మిగిలిన ప్రమధులను బ్రయత్నపూర్వకముగా బిలిచి యచ్చటి నుండి తిన్నగా శ్వేతద్వీపమునకు బోయెను. అట్లుపోయి విష్ణుమూర్తిని జూచి యిట్లనియె. నారాయణా ! రాబోవు పంచమీసోమవారమునాడు నా చెల్లెలు దేవదత్తను దేవాంగుని కిచ్చి వివాహము చేయుటకు పేద్దలచే నిర్ణయింపబడినది. గనుక

మీదంపతులు సపరివారముగా దయచేసి వివాహమహోత్సవము యథావిధిగా జరిపించి వధూవరుల నాశీర్వదించి నన్నానందింపజేయునది యనగానే యాయనయు నంగీకరించెను. తరువాతను లక్ష్మీదేవిని భూమిని పరివారమును వేఱువేఱుగా నాహ్వానించి యక్కడనుండి స్వర్గము ప్రవేశించి శచీసహితుడయిన

యింద్రుని మిగిలినదేవతలను బిలిచెను. జయంతుడు మొదలగువారిని మిగిలిన

దేవతులనుగూడ బ్రేమపూర్వకముగా వివాహమహోత్సవమునకు దప్పక రావలసిన

దని కోరెను. మఱియు నచ్చట నున్న బ్రహ్మర్షులను దేవర్షులను, ఆదిత్యులను,

రుద్రులను, గంధర్వులను మిగిలినదేవయోని విశేషులను బిలిచి తనలోకమునకు

వచ్చెను. నందుడు, ఉపనందుడున నువా రిద్దఱు సూర్యుని మంత్రులు గలరు. వారు సూర్యునియాజ్ఞవలన దిక్పతులు మొదలగు నందఱును బిలిచి యాసంగతి

సూర్యునితో జెప్పిరి. అంత నక్కడ దేవాంగుడు సుబుద్ధికార్యదక్షుడు ననుతన

మంత్రులను బిలిచి యిట్లనియె ఓ మంత్రులారా ! మీరిద్దఱలును సూర్యునియొద్దకు బోయి వివాహలగ్న మెప్పుడు నిర్ణయింపబడినదో తెలిసికొని వేగముగరండు అని

చెప్పగానే వారును సూర్యునిదగ్గఱకు బయలుదేఱిరి. త్రోవలో మంచిశకునములు

కనుబడినవి. వారు రాగానే సూర్యుడు తగురీతిని గౌరవించెను. వారు ముగ్గురును

వివాహమునుగూర్చి మాటలాడుకొనిరి. సూర్యుడు బ్రహ్మచేనిర్ణయింపబడినముహూర్తముసంగతియంతయు జెప్పెను. ఆమాటవిని మంత్రులు వేగముగా

దమరాజుతో నాసంగతి చెప్పుటకై యామోదపట్టణమువచ్చిరి. తాము వెళ్ళినపనియంతయు దమరాజుతో జెప్పిరి. తరువాత నక్కడ సూర్యుడు తమమంత్రిన

వీరమార్తాండునితో నిట్లనియె. ఓయీ వీరమార్తాండా ! నీవు శీఘ్రముగా నామోదపట్టణమునకు బోయి నేటికి మూడవనాడు పంచమీసోమవారము

వివాహముహూర్తమని దేవలునితో జెప్పి యతనిని సపరివారముగా దోడుకొని

రమ్ము. అనగానే మంత్రి చతురంగబలముతో గూడి యామోదపట్టణమునకు

బోయెను. సూర్యునిమంత్రి వచ్చి యున్నా డన్నసంగతి విని దేవాంగుడు

తనమంత్రులను బిలిచి యెదుర్కొనుటకు బంపెను. వారును వేగము గా

వాద్యఘోషపురస్సరముగాబోయి యెదుర్కొని వీరమార్తాండుని బట్టణములోనికి

దీసికొనివచ్చెను. క్రమముగ నతడు దేవాంగుని యంతఃపురములోనికి దగుసత్కారముతో బోయి దేవాంగునితో నిట్లనియె. రాజా ! నేటికి మూడవనాడు పంచమీ సోమవారమున వివాహముహూర్తము నిర్ణయింపబడినది. గనుక నాతో గూడ

సపరివారముగా బయలుదేశిరమ్ము. అని చెప్పి యతనిమంత్రుల నందఱను

వేజిలువేఱుగా బిలిచి యందఱమును గలసియే వెళ్ళుద మని యనుచున్న వీరమార్తాండుని జూచి దేవాంగు డిట్లనియె. మహాభాగ నీ విపుడు వెళ్ళుము. రేపు తెల్లవాటు

జామున బయలుదేతి మేమందఱమును వచ్చెదము. అనగానే యతడు మంచిదే

యని యింటికి బోయి వృత్తాంత మంతయు సూర్యునితో జెప్పెను. తరువాతను సూర్యుడు విశ్వకర్మదగ్గఱకు బోయి "మామా ! మాదేవదత్తకు వివాహము

తటస్థించినది గనుక వేగముగా గల్యాణమంటపము సిద్ధముచేసి యిమ్ము." అని

చెప్పగానే యతడు శుభకరమయిన వివాహమంటపము సిద్ధముచేసి యిచ్చెను. అది

హేమప్రాకారనిలయము పగడముల స్తంభములతో శోభితము. వజ్రపుపలకలతో

గప్పబడినది. మఱియు మంచి పూజలతో బనివాని తనమంతయు జూపి సిద్ధము

చేయబడినది. మఱియు రత్నాలవలభులు, పుష్యరాగముల తలుపులు గలిగి వివిధరత్నములచే స్థిగితమయి యనేక మంచసంకీర్ణమయి బలుద్వారములతో గూడి

యద్వితీయముగా శోభించునట్లు చేయబడినది. ఆమంటపము సుమారుగా

నొకయోజనము వెడల్పుగలుగునట్లుగా నిర్మింపబడినది. దాని మధ్యమున ముత్యాలతో నొకమంటపమును నిర్మించెను. 


 *సశేషం......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat