*17.భాగం*
*ఉపాసన ఖండము*
*మొదటి భాగము*
*మంత్రోపదేశం*
ఆ విధంగా బ్రహ్మదేవునిచే స్తోత్రం చేయబడిన యోగనిద్ర శ్రీమహావిష్ణువు యొక్క కనురెప్పల పైనుండి వైదొలగి అతడిని మేల్కొలిపింది ఈలోగా దుష్టులైన ఆ మధు కైటభులు ఇద్దరు కలసి స్వర్గాదిలో కాలాలన్నింటినీ ఆక్రమించారు వారి దాటికి తట్టుకోలేక దేవతలు తలోదిక్కుకు చెల్లాచెదురైనారు వారిలో కొందరు ఆ భయానికి మూర్చిలారు యోగనిద్ర నుండి మేలుకొన్న శ్రీమహావిష్ణువు అలా ప్రేరేపించబడి ఆ మధు కైటభులు ఇద్దరితోనూ యుద్ధానికి తలపడ్డాడు...
దివ్యమైన తన శంఖచక్రాది ఆయుధాలను చేత ధరించి ఎదపై వైజయంతి మాల శోబిల్లగా నీలమేగం వంటి శరీర కాంతి కలవాడై తన చేతితో శంఖాన్ని తీసుకొని భువన భోంతరాలను దద్దరిల్లేలా పూరించాడు ఆ భయంకర పాంచ జన్య ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి రాక్షసులు గుండెలు భయంతో గుబగుబలాడాయి ఇలాంటి ధ్వని ఇంతకుముందు ఎక్కడ విని ఉండలేదు ఇదేదో రాబోయే ఘోర సంగ్రామానికి సూచనగా కనిపిస్తోంది...
అందుకని విజయమో వీర స్వర్గము తేల్చుకోనిదే వెనుదిరగరాదు ఇలా అనుకోని ధైర్యం తెచ్చుకొని మధు కైటబులు ఇద్దరూ శ్రీమహావిష్ణువును తమతో ఆయుధాలతో కాక ద్వంద యుద్ధానికి దమ్ముంటే రమ్మని సవాలు చేశారు ఆ తరువాత చాలా బీకరమైన పోరు జరిగింది అలా దాదాపు ఐదు వేల ఏళ్ళు ఘోరంగా యుద్ధం చేసిన శ్రీహరి వాళ్ళని ఏమాత్రం వధించలేకపోయాడు అప్పుడు విష్ణువు గానకలలో కోవిదుడైన గంధర్వుడి రూపం దాల్చి అడవిలోకి వెళ్లి ఎంతో శ్రావ్యంగా వీణ గానం చేయసాగాడు ఎంతో మధురమైన ఆ గాన మాధుర్యానికి అరణ్యంలోని సకల జంతుజాలము దేవతాగనములు తన్మయత్వంతో ఒళ్ళు మరచిపోయారు...
కర్ణపేయంగా ఉన్న ఈ గానం కైలాసంలో కొలువున్న శంకరుడి చెవులకు కూడా సోకింది ఆ మాధుర్యానికి చెక్కితుడైన పినాకి నికుంభుడు పుష్పదంతుడూ అన్న పేర్లు గల తన అనుచరులు ఇద్దరినీ ఆ మధుర గానం ఆలపిస్తున్న వారిని నా వద్దకు వెంటనే తీసుకురమ్మని పంపించాడు ఆ ఇద్దరు దూతలు గానాలాపం చేస్తున్న విష్ణుమూర్తి సన్నిధికి ఆఘమేఘాల మీద చేరుకొని ఆయనకు శివుని యొక్క ఆహ్వానాన్ని ఆదేశాన్ని తెలియజేశారు వాళ్లతో కలిసి కైలాస వాసుని సన్నిధికి చేరుకున్నాడు శ్రీమహావిష్ణువు..
అప్పుడు కైలాస శిఖరం పైన భక్తజన సులభుడు భక్తవ శంకరుడు బోలా శంకరుడైన శివుని శ్రీమహావిష్ణువు దర్శించాడు అక్కడి ప్రమదగణాలు కన్నులకు వెలుగై దీనజన మందారుడైన పరమశివుడు తన శిరస్సున చంద్రుని ధరించి చంద్రమౌళీశ్వరుడిగా జడలు కట్టిన దట్టమైన శిరోజాలపైన గంగతో గంగాధరుడిగాను గజ చర్మాన్ని నాగ యజ్ఞోపవీతాన్ని ధరించి పరమ శోభాయమానంగా వెలుగొందుతున్నాడు ఆ సదాశివుడిని చూసి సాష్టాంగంగా నమస్కరించాడు..
అప్పుడు భక్తవత్సలుడైన ఆ పరమేశ్వరుడు ఎంతో ఆధరంగా ఆయనను లేవనెత్తి తగు ఆసనమును చూపి కూర్చుండ చేశాడు అప్పుడు ఆ హరి తన మంజుల గానంతో శివుడిని కూడా సంతృప్తి పరచాడు. ఆ గానంతో సుబ్రహ్మణ్యుడు గణేశుడు పార్వతి మాత కూడా అమిత సంతృప్తులైనారు అపరిమితమైన ఆనందంతో విష్ణువును ఆలింగణం చేసుకొని ఓ శ్రీమహావిష్ణు నీ గానం నన్ను ఎంతగానో అలరించి సమ్మోహన పరిచింది మీ అభీష్టమేమిటో కోరుకుంటే తప్పక నెరవేర్చగలను అన్నాడు...
విష్ణువు మధుకైటబుల గాధను వివరించడం ఆ తరువాతి కథా వృత్తాంతాన్ని భృగు మహర్షి సోమ కాంతుడితో ఇలా కొనసాగించాడు ఓ రాజా విష్ణువు శంకరుడి అభయాన్ని విని తన అభీష్టాన్ని ఇలా చెప్పసాగాడు ఓ శంకర క్షీరసాగరంలో ఆదిశేషునిపై శేషశాయినై నే పవళించి ఉండగా నా చెవిలోని గులిమి నుండి మధు కైటభులు అనే దానవులు ఉద్భవించారు ఆ ఇరువురు లోక కంటకులుగా మారి సృష్టికర్త అయిన బ్రాహ్మణు భక్షించడానికి సన్నద్ధులైనారు అప్పుడు భీతావహుడైన బ్రహ్మ నా నేత్రములను ఆవహించిన యోగనిద్రను ప్రార్థించాడు ఆమె చేసిన ప్రబోధం వల్ల మేల్కొన్న నేను వాళ్ళిద్దరితో చిరకాలం యుద్ధం చేసిన ఏమే ప్రయోజనమేమి లేకపోయింది ఇక నాకు వేరే మార్గాంతరం కనిపించగా నీ అనుగ్రహాన్ని కోరి ఈ రకంగా గంధర్వుడిగా గానం చేశాను....
కనుక నీవు నాయందు దయతో ఆ దుష్ట రాక్షసుల సంహారానికి తగ్గ ఉపాయం ఉపదేశించు ఆ మాటలకు ప్రసన్నతతో కూడిన దరహాసం ముఖంపై కాంతులీనగా భక్తవత్సలుడైన శంకరుడిలా చెప్పాడు ఓ హరి నీవు యుద్ధానికి సన్నద్ధుడివై వెళ్లేటప్పుడు ప్రారంభంలో విజ్ఞహరుడైన ఆ గజాననుని అనుగ్రహానికై ప్రార్థించడం మరిచావు అందువల్లనే నీకు ఇన్ని ఇక్కట్లు విఘ్నాలు సంభవించాయి కనుక ఇప్పటికైనా సకల అభీష్ట ప్రదుడు సకల విజ్ఞానివారకుడైన ఆ గజాననుని పూజించి అతడి అనుగ్రహాన్ని పొంది యుద్ధ సన్నద్ధుడివికా...
అప్పుడు ఆ గజాననుడే వారిని సమ్మోహితుల్ని చేస్తాడు నా అండదండలు ఎటు నీవెంటనే ఉంటాయి అందువల్ల ఇక ఆ దుష్ట రాక్షసుల వధ సులభతరం కాగలదు అభీష్ట సిద్ధిరస్తు అన్న అనుగ్రహ వచనాలను విని రాక్షసాంతకుడైన శ్రీమహావిష్ణువు ఇలా ప్రశ్నించాడు ఓ దయాళూ! భక్తవరదుడైన ఆ గణేశుని ఎలాగ పూజించాలి. నీవు నా యందు కృప వహించి విధి వత్తుగా ఆ విధానం యావత్తు ఉపదేశించ కోరాను...
ఆ మాటలకు అనుగ్రహ దృష్టిని ప్రసరిస్తూ మదనాంతకుడైన శంకరుడిలా బదులిచ్చాడు ఓ శ్రీహరి భక్తానుగ్రహ ప్రదములైన గణేష మంత్రాలు అనేక అనేకములు ఉన్నాయి. వాటన్నిటిలోకి ఏకాక్షర గణపతి మంత్రము అత్యంత ప్రభావయుతమైనది అలాంటిదే షడక్షరా గణపతి మంత్రము కూడా నీకు తగిన మంత్రాన్ని ఇప్పుడే ఉపదేశిస్తాను దానిని అనుష్టించి గణపతిని ఉపాసించి అతని అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని చేకూర్చుకొమ్మని ఉపదేశం చేశాడు అలా శివుడు ఉపదేశించిన గణేష మంత్రాన్ని స్వీకరించి అనుష్టానానికై శ్రీమహావిష్ణువు కైలాసాన్ని వీడి తగు ప్రదేశాన్ని చేరుకున్నాడు..
ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసన ఖండంలోని 'మంత్రోపదేశకధనం' అనే అధ్యాయం సంపూర్ణం..
*సశేషం.......*