🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸ఆయన చూచి జంగమయ్యకు సేవ చేసి మాట్లాడాడు. సంభాషణలో జంగమయ్య తాను దరిద్రుణ్ణనీ కిన్నర బ్రహ్మయ్యగారిని దర్శించి వారి అనుగ్రహంతో శ్రీమంతుడు కావాలనే ఉద్దేశం ఇంత శ్రమపడి వచ్చానని చెప్పాడు.
🌿అది విని కలకౌత బ్రహ్మయ్య చాలా బాధపడ్డాడు.జంగమయ్యా! సంపద కొరకే అయితే కలకౌత బ్రహ్మయ్య గారి వద్దకే పోనక్కరలేదు.
🌸ఇలారా అని పిలిచి ఒక రాళ్ళ గుట్టను తనచేతిలోని కోలతో తాకించాడు. మరుక్షణమే గుట్ట మొత్తం నిధి క్రిందికి మారిపోయింది.
🌿అది చూచి జంగమయ్య ఆనందాశ్రువులు జాలువార్చుతూ బ్రహ్మయ్యకు శరణు చేసి నగరంలోకి పరుగెత్తుకుంటూ పోయాడు.
🌸 నేరుగా బసవన్నను కలిసి జరిగినదంతా చెప్పి ‘కలకౌత బ్రహ్మయ్య నాకిచ్చిన ధనం మోయడానికి నా ఒక్కడివల్ల సాధ్యం కావడంలేదు.
🌿ఎవరినైనా ఒక భటుణ్ణి సాయం పంపు’ అని కోరాడు.అది విని బసవన్న ఆశ్చర్యపడ్డడు.ఇంద్రజాలాన్ని తన
🌸కాయకవృత్తిగా స్వీకరించిన కలకౌత బ్రహ్మయ్య ఇంత నిధిని నీకుఇచ్చాడంటే అది శివభక్తులకు మాత్రమే సాధ్యం.
🌿చింతామణికి కల్పవృక్షానికీ కామధేనువుకూకూడాసాధ్యంకాదుఅవి ఏవో ఒక్కటే ఇవ్వగలుగుతాయి. మేరువు చిన్న బంగారానే్న ఇవ్వగలుగుతుంది.
🌸కాని కలకౌత బ్రహ్మయ్య సర్వార్థసిద్ధి చేయగలడు అని బసవన్న జంగమయ్యకు ఒక సేవకుణ్ణి ఇప్పించి తాను స్వయంగా వెళ్లి కలకౌత బ్రహ్మయ్య పాదాలను శరణు చేశాడు.
🌿ఈ విషయం తెలిసి కిన్నర బ్రహ్మయ్య కూడా వచ్చి కలకౌత బ్రహ్మయ్యను ప్రస్తుతించాడు. కలకౌత బ్రహ్మయ్య వారందరికీ విందు భోజనం పెట్టాడు.
🌸మోళిగ మారయ్య కథకల్యాణ నగరంలో మోళిగ మారయ్య అనే శివభక్తుడు మరొకడు ఉన్నాడు.
🌿ఆయన కట్టెలు కొట్టడం తన కాయకంగా స్వీకరించాడు. అడవి నుండి తెచ్చిన కట్టెల మోపును అంగడిలో విక్రయించి ఆ ధనంతో జంగమార్చన చేస్తూ వుండేవాడు. ఇలా
🌿వుండగా ఒకసారి శివభక్తులు బసవన్న ఇంట భుజిస్తూ వున్న సమయంలో ‘బసవన్నా! మేము లోగడ మోళిగ మారయ్య ఇంట శివపూజ చేశాము.
🌸ఆయన మాకిచ్చింది అంజలి మాత్రమే. అయితేనేమి అది పృథ్విలోని సమస్త మధురాతిమధురమైన పదార్థాలన్నిటికన్నా గొప్పగా వుందయ్యా అని ప్రశంసించారు.
🌿బసవన్నకు ఒకసారి మారయ్య ఆతిథ్యం చూడాలని కోరిక గలిగింది. అందుకని మారువేషం వేసుకొని మోళిగ మారయ్యగారింటికి వెళ్లాడు.
🌸అప్పుడు మారయ్య అడవికి వెళ్లాడు. మారయ్య భార్య ఎవరో జంగమయ్య వచ్చాడని భావించి శరణు చేయడానికి వచ్చింది.
🌿మారయ్య భార్య బసవన్నకు అర్ఘ్యపాద్యాదులిచ్చి ‘అమ్మో! మా లింగయ్య ఆకలితో వున్నాడమ్మ! వడ్డించాలి’ అని ఇంట్లోకివెళ్లింది.
🌸ఆ సమయం చూచి రెండు వేల మాడలను ఒక మూల బసవన్న ఉంచాడు. తర్వాత మారయ్య భార్య చేసిన ఆతిథ్యం స్వీకరించి బసవన్న వెళ్లిపోయాడు.
🌿తర్వాత మారయ్య వచ్చాడు. కట్టెల మోపు దింపి కాళ్ళు చేతులు కడుక్కొని జంగమయ్యలను పిలిచి అర్చించి తాంబూలాలు సమర్పించి గినె్నను చూచేసరికి దాని కింద రెండు వేల మాడలు అతికించబడి వున్నాయి.
🌸మారయ్య ఆశ్చర్యపడి భార్యను పిలిచి ‘ఈ ధనమెక్కడి’దని ప్రశ్నించాడు. ‘ఏమో నేనెరుగను. ఇందాక ఒక జంగమయ్య వచ్చి శివ పూజ చేసి వెళ్లాడు’ అన్నదామె.
🌿మారయ్య తన్మయంతో చేతులు జోడించి ‘‘పిచ్చిదానా! మామూలు జంగమయ్య కాదే ఆ వచ్చింది. బసవేశ్వరుడే మారువేషంలో మనలను పరీక్షించడానికి వచ్చాడు.
🌸పేద భక్తుల వ్యధలు తనవిగానే భావించే బసవన్న మాత్రమే ఇలా రహస్యంగా ఇస్తుంటాడు. బసవా! నీ బిడ్డలమీద ఇన్నాళ్ళకు దయ వచ్చిందా తండ్రీ!
🌿ఈ విధంగానైనా మా ఇంటికి వచ్చి నా యిల్లును పావనం చేశావా? అని పరవశంతో బసవన్నను స్మరిస్తూ వుండిపోయాడు.
🌸ఆవేశం తగ్గాక మారయ్య బసవా! నీవు ధనమిచ్చావు కాని నాకు దానితో మాత్రమే పనిలేదయ్యా! నాకీ కాయకముండగా ఇంకో ధనమెందుకు?
🌿అని ఇద్దరు జంగమయ్యలకు ఆ రెండు వేలూ తాంబూలాలతో అందించాడు.వారా ధనాన్ని తీసుకొన్నాక పోతూ మారయ్య భక్తిని బసవని ముందు ప్రశంసించారు.
🌸కట్టెలు కొట్టుకునే మారయ్య జంగమయ్యలు వస్తే రెండు వేల మాడలిచ్చాడు. ఇంతటి భక్తులెవరుంటారు?’ అన్నారు వారు.
🌿బసవడిది విని పరుగుపరుగున మారయ్య ఇంటికి మళ్లీ వచ్చాడు.బసవన్న రాగానే ఆయన పాదాలపై మారయ్య పడి బసవా భక్త పరాధానా! కరుణించు తండ్రీఅని వేనోళ్ల పొగిడాడు.
🌸బసవన్న కంటి వెంట అశ్రువులు దొర్లాయి. మారయ్యా! నన్ను క్షమించు. నా పాడు బుద్ధితో నీకేదో సంపద లిద్దామని వచ్చాను.
🌿ఇచ్చాననుకున్నాను. కాని నీవు పరధనాన్ని స్వీకరింపని భక్త శిఖామణివనీ, నేనిచ్చిన ధనం అప్పుడే జంగమయ్యల కిచ్చావనీ తెలిసి నివ్వెరపోయాను.
🌸మారయ్యా! నీ గొప్ప గుణం నేనెట్లా తెలుసుకోగలను? నీవు కనకాద్రివి- నేను కాకిని; నీవు పరుసవేదివి, నేను ఇనుమును; నీవు గుణనిధివి, నేను దుర్గుణడను.
🌿నాలో చిన్న మంచి గుణం కూడా లేదు మారయ్య తండ్రీ! వెలివాడలో వేదఘోష విన్పడదు. ఆవములో రాగిచెంబులుండవు. నిప్పుల కుంపటిలో తామర దుంపలు మొలవవు...సశేషం...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸