👉 శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం
💠 కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది.
ఆ కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు!
ఆ స్వామి మహత్యమూ సామాన్యమైనది కాదు!
💠 ప్రతి దేవాలయంలోని గర్భగుడిలోని స్వామివారి లేదా అమ్మవారి విగ్రహాలు రాతితో చేయబడిన విగ్రహాలను మనం చూస్తాం.
కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారి విగ్రహం ఇసుకతో చేయబడి ఇప్పటికి అదే విగ్రహం పూజలనందుకొనుచున్నది అని ప్రతీతి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది?
ఆ ఆలయానికి సంబంచిన పురాణం ఏం చెబుతుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
💠 కృష్ణాజిల్లా, మొవ్వమండలం. విజయవాడకు సుమారు 56 కి||మీ దూరాన మొవ్వ అను చిరుపట్టణం కలదు.
🪔 స్థలపురాణం 🪔
💠 ఒకప్పుడు ఈ ప్రాంతం అంత అరణ్యంగా ఉండేది. ఆ అరణ్యంలో మౌద్గల్య మహాముని అనే గొప్ప రుషి ఉండేవారు.
ఆయన మొవ్వకి సమీపంలో ఉన్న కృష్ణానదీ తీరంలో ఘోర తపస్సు చేసుకోసాగారు.
అతడు తపస్సు చేసుకొనుటకు అక్కడ ఉన్న ఇసుకతో ఒక వేణుగోపాలస్వామి విగ్రహాన్ని సృజించి అచట ప్రతిష్టించి ఆరాధించుచుండేవాడు.
క్రమేపీ మౌద్గల్య మహర్షి కొలిచిన ఆ విగ్రహం చుట్టూ ఒక ఆలయం రూపొందింది.
💠 ఆ కారణంగా 2000 సంవత్సరంలో స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్టంచారు. అయినా ఇప్పటికీ పాత విగ్రహాన్ని మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు.
🪔 మహాకవి క్షేత్రయ్య 🪔
💠 మువ్వ పేరు వినగానే వేణుగోపాలస్వామి ఆలయమే కాదు, ఆ స్వామి మహత్తుతో అద్భుతమైన పదాలు రాసిన క్షేత్రయ్య కూడా గుర్తకువస్తాడు.
క్షేత్రయ్య పెద్ద పండితుడేమీ కాదు.
ఆ మాటకు వస్తే అతను అక్షరాలు కూడా రాని ఒక గోవుల కాపరి.
ఆ కాలంలో ఆలయానికి దగ్గరలో ఒక బ్రాహ్మణా పల్లె ఉండేది.
ఆ పల్లెలో 17వ శతాబ్దము నాటి వరదయ్య అనే బ్రాహ్మణా బాలకుడు ఒకడుండేవాడు.
💠 ఇతడు అన్నమాచార్యుల తరువాత కాలంవాడు. వరదయ్య యవ్వనకాలం వరకు అల్లరిచిల్లరగా ఉండేవాడు.
ఆ ఊరిలోవారు అందరు కూడా వరదయ్యని తేలికగా చూసేవారు.
ఒకరోజున మౌద్గల్య మహాముని వరదయ్యని చూసి అతడిలో అంతర్లీనంగా గొప్ప తేజస్సు ఉందని గ్రహించి అతనికి ఒక మంత్రం ఉపదేశించాడు.
ఆ రోజునుండి వరదయ్యలో ఒక గొప్ప మార్పు వచ్చినది.
వరదయ్య కొద్దీ కాలంలోనే గొప్ప వాగ్గేయకారుడయ్యాడు.
మువ్వ గోపాలుని మీద అనేక శృంగార పదకవితలు వ్రాసి, స్వామికి అంకితం చేసాడు. అయన తనని తాను గోపికగా భావిస్తూ రసభక్తితో పదాలు సృష్టించాడు.
ఆ పదాలు పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగేవాడు.
అలా ఆయనకు "మహాకవి క్షేత్రయ్య" అన్న పేరు స్థిరపడిపోయింది.
💠 వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు.
స్వామి వెనుక వున్న మకరతోరణం పై దశావతారాలు ఉన్నాయి.
స్వామి ప్రక్కన రుక్మిణీ సత్యభామలు కూడా దర్శనమిస్తారు.
చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి.
ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నది.
💠 నూతన ఆలయంనకు ముఖమండపం, గర్భాలయం ఉంటుంది. గర్భాలయంనందు శ్రీ మువ్వ వేణుగోపాలస్వామి కొలువై వుండగా, గర్భాలయంనకు ఇరువైపుల శ్రీ రాజ్యలక్ష్మిదేవి, గోదాదేవి సన్నిధులున్నాయి. వాయువ్యంవైపున శ్రీ ఖడ్గాంజనేయస్వామి సన్నిధి కలదు.
💠 ప్రధానాలయంనకు వెనుకభాగాన ఒక మండపం కలదు.
నిరంతర భక్తుల దర్శనార్ధమై శ్రీ ఖడ్గాంజనేయస్వామి, శ్రీరాజ్యలక్ష్మి, శ్రీమువ్వ వేణుగోపాలస్వామి, శ్రీ విఖనస మహర్షి, శ్రీ భక్తాంజనేయ మూర్తులను ఉంచారు.
💠 ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామివారి ఉపాలయం కూడా ఉంది.
స్వామివారి కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో సంజీవని ఉంటాయి.
ఒకపక్క కోరుకున్న వరాలను అందిస్తూనే, మరోపక్క దుష్టులను శిక్షిస్తాడనేందుకు సూచనగా స్వామివారి చేతులలో ఖడ్గమూ, సంజీవనీ రెండూ కనిపిస్తాయి.
💠 మాఘమాసంనందు మూడురోజులుపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
శుద్ధ త్రయోదశి నాడు క్షేత్రయ్య ఆరాధనోత్సవాలుతో ప్రారంభమవుతాయి.
💠 మొవ్వ వేణుగోపాలుడిని దర్శిస్తే ఎవరి జీవితమైనా తరించిపోతుంది అని చెప్పేందుకు క్షత్రయ్య జీవితమే ఒక ఉదాహరణ
💠 ఇంతటి విశేషం గల ఈ ఆలయానికి చుట్టూ పక్కల గ్రామాల నుండి, దూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు తరలి వచ్చి ఆ మువ్వ వేణుగోపాలస్వామిని దర్శించుకొని తరిస్తారు..