తమిళనాడు కడలూరు జిల్లాలోని పిన్నలూరు రామలింగేశ్వరుని అయోధ్యా రాముడు రామేశ్వరం వెళ్ళిన సమయంలో పిన్నలూరులో ఇసుకతో శివలింగం చేసి పూజించినట్లు ఇతిహాసం.
యుగాలు గడిచి ఈ కలియుగంలో కుళోత్తుంగచోళుడు పరిపాలిస్తున్న కాలంలో
ఆ ఊరిలోని రైతు ఒకడు తన భూమిని దున్నుతుండగా భూమిలో పూడుకుపోయిన శివలింగం ఒకటి బయటపడింది.
దానిని జాగ్తత్తగా బయటకు తీసిన వెంటనే
ఈ సంగతిని మహారాజుకి విన్నవించాడు.
అక్కడ కి స్వయంగా వచ్చి చూసిన మహారాజు ఆ శివలింగం శ్రీ రాముడు పూజించిన లింగంగా తెలుసుకుని ఆనందంతో రామలింగేశ్వరుడనే పేరుతో ఒక ఆలయం నిర్మించి ప్రతిష్టించాడని కర్ణాకర్ణి గాధ.
అరుళ్ ప్రకాశ వళ్ళళార్ స్వామి గొప్ప శివ భక్తుడు , సిధ్ధపురుషుడు. ఆయన తండ్రి రామయ్య చాలాకాలం వరకు సంతానం లేని రామయ్య నిత్యమూ వడలూరు నుండి
చిదంబరం వెళ్ళి నటరాజస్వామిని దర్శించడం నియమంగా పెట్టుకున్నవాడు.
ఆయన ఈ పిన్నలూరు రామలింగేశ్వరస్వామి
ఆలయానికి వెళ్ళి తనకు పుత్రభాగ్యం కలిగించమని వేడుకొన్నారని, అందుకు ఫలితంగా తనకు కలిగిన పుత్రునికి యీ స్వామి పేరునే పెట్టారు. ఆ కుమారుడే భవిష్యత్తు లో గొప్ప జ్ఞానియై అరుళ్ ప్రకాశ వళ్ళలార్ గా ప్రసిధ్ధి పొందాడు.
తూర్పు ముఖంగా వుండే రామలింగేశ్వర స్వామి ఆలయం ఎదురుగా
చదరంగా వుండే మెట్లతో నిర్మించిన పుష్కరిణి వున్నది. ముందు మండపం పైన మధ్యగా వృషభవాహనుడైన పరమశివుడు పార్వతీ దేవి రెండు ప్రక్కలా, వళ్ళీ దేవయాని సమేత
సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుడు, హనుమంతుడు, సీతారాములు, నంది
ప్రతిష్టించబడి వున్నవి.
మహామండపంలో దక్షిణముఖంగా
పర్వతవర్ధని అమ్మవారు, అర్ధమండపంలో
ఉత్సవమూర్తి దర్శనమిస్తాయి.
గర్భగుడిలో గుండ్రని పీఠంపై తూర్పు ముఖంగా శివలింగ రూపంలో రామలింగేశ్వరస్వామి అనుగ్రహిస్తాడు.
స్వామిని దర్శించి ఆవరణలోనికి రాగానే వినాయకుడు, దక్షిణా మూర్తి , లింగోద్భవుడు, బ్రహ్మదేవుడు,
దుర్గాదేవి మొదలైన దేవతల దర్శనం కలుగుతుంది.
మూలమూర్తికి బిల్వదళాలు, పుష్పమాలలు సమర్పించి ప్రార్ధించిన ఎలాటి గ్రహ దోషాలున్నా అవి తొలగి పోయి శుభాలు కలుగుతాయి. వివాహాది శుభకార్యాలు
ఏవిధమైన ఆటంకాలు లేకుండా జరుగుతాయి.
పదకొండు ప్రదోషకాల పూజలు చేసి ప్రార్ధించిన పుత్రభాగ్యం కలుగుతుందని భక్తులు ధృఢంగా విశ్వసిస్తారు.
👉🙏కడలూరు జిల్లా వడలూరు నుండి 8 కి.మీ దూరంలో సేత్తియాతోప్పు కి వెళ్ళే మార్గంలో వున్న పిన్నలూరులో యీ ఆలయం వున్నది.
🙏🌹🙏🌹🙏🌹