🌺 *శ్రీహరి శ్వేతవరాహ రూపము ధరించిన వృత్తాంతము* 🌺
🍃🌹పూర్వకాలమందు ఒకానొకనాడు సనకసనందనాదులు వైకుంఠానికి బయలుదేరారు. శ్రీమహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనమునకై వారు వెడలసాగిరి. సనకసనందనాదులు మహాభక్తులు నిరంతరము విష్ణుకదా శ్రవణాసక్తులు భగవత్, దైవాను రాగాను రక్తులు.
🍃🌹ఆ మునులు బాలుర వేషములో వెడలినారు. ద్వారపాలకులు వారు లోనికి వెడలుటకు అభ్యంతరము తెలిపిరి. వారు ‘‘మేము చాలా ముఖ్యులము, లోనికి వెడలి తీరవలసినదే’’ అనిరి. ‘‘ససేమిరా లోపలికి వెడలుటకు వీలు లేనేలేదన్నారు.’’
🍃🌹ఆ ఇరువు ద్వారపాలకులూను.మునులు కోపము శాపమునకు దారి తీయును గదా! వారిద్దరూ ద్వారపాలులవైపు తీవ్రముగా చూచి మీకింత కండ కావరమా! మమ్ములను శ్రీమహావిష్ణువును దర్శించకుండ చేతురా? చూచుకొనుడు మా శక్తి! మీరిద్దరూ రాక్షసులై పోయెదురుగాక అని శాపమిచ్చినారు. ద్వారపాలకులు కంపించినారు. ఇదేమి శాపమని విలపించి తమ్ము క్షమించవలసినది వారిని కోరారు.
🍃🌹అంతట మునులు కొంత అనుగ్రహించి మూడు జన్మలందు మీరు రాక్షసులుగ నుండి శ్రీమహావిష్ణువునకు శత్రవులుగ వ్యవహరించిన పిదప మరల మీ పూర్వస్థానములను పొంది శ్రీమహావిష్ణువును కొలువగలరు అనగా ఆ ద్వారపాలక భక్తులు అందుకు అంగీకరించిరి. తరువాత వారు తొలిజన్మగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించిరి.
🍃🌹హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు. అడ్డూ అదుపూ లేక అతడు చెడు పనులు చేసేవాడు, ఒకసారి భూమండలము యావత్తు చాపగా చుట్టేసి దానిని రసాతల లోకానికి తీసుకునిపోయి దాచేశాడు. దేవతలు ఈ విపత్తును చూచి వెంటనే శ్రీమహావిష్ణువు వద్దకు వెడలి ప్రార్థించారు.
🍃🌹అభయమిచ్చాడు నారాయణుడు, తాను శ్వేతవరాహ రూపము ధరించాడు. హిరణ్యాక్షుని సంహరించాడు. బ్రహ్మ మున్నగువారు శ్వేత వరాహమును మనసారా స్తుతించారు. భూమండలాన్ని రక్షించిన నీవు భూలోకములోనే వుండవలసినదిగా కోరుతున్నామన్నారు.
🍃🌹శ్వేతవరాహస్వామి సరేనని తనకు నివాసస్థలముగా శేషాచలాన్ని ఎన్నుకొని అక్కడ ఉండసాగాడు. వరాహ స్వామికి చాలమంది భక్తులేర్పడిరి. అందులో వకుళాదేవి ముఖ్యురాలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏