జై భజరంగ భళీ

P Madhav Kumar

జై భజరంగ భళీ

రంగ భళీ భజరంగ భళీ

భజరంగ భళీ భజరంగ భళీ..

నమో నమో హనుమంత

మహిత గుణవంత మహా బలవంత

స్వామి నీ ముందు మేమెంత

నీ భక్తి భళీ భుజ శక్తి భళీ

రఘురామ భక్త భజరంగ భళీ

రంగ భళీ భజరంగ భళీ

భజరంగ భళీ భజరంగ భళీ..

lనమోl


సూర్యుని మించును నీ తేజం

పవనుని మించును నీ వేగం

అగ్నిని మించును నీ రౌద్రం

అమృతమయం నీ హృదయం

ఓ సుజనమందార ఓ దనుజసంహార

నీ దివ్యచరణం పాపహరణం

స్వామి శరణం మమ్ము కరుణించవయ్యా

రంగ భళీ భజరంగ భళీ

భజరంగ భళీ భజరంగ భళీ..

lనమోl


శ్రీరామ కార్యం చేపట్టినావు

సీతమ్మ జాడ కనిపెట్టినావు

లంకిణిని దెబ్బకు పడగొట్టినావు

లంకాపురిని తగుల బెట్టినావు

ఒంటి తలల రావణులు ఊరూరా వున్నారు

కంట కనిపెట్టి తోకచుట్టి విసిరికొట్టి

మమ్ము కాపాడవయ్యా

lనమో


🙏🙏🐒🙏🙏🪷🙏🙏🐒🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat