🔰 *శ్రీ గణేశ పురాణం🔰* 18 వ భాగం

P Madhav Kumar


 *18.భాగం* 

*ఉపాసనా ఖండము*

*మొదటి భాగము*


ఎంతో ఆసక్తిగా పై కథను వింటున్న సోమకాంత మహారాజు ఆ కథను రసవత్తరంగా అనుగ్రహపూర్వకంగా వినిపిస్తున్న భృగు మహర్షితో ఇలా ప్రార్ధించాడు ఓ మహర్షి సప్తమా కైలాసంలో గణేశుని మంత్రోపదేశాన్ని శంకరుడి వద్ద అనుగ్రహంగా సంప్రాప్తించుకున్న శ్రీమహావిష్ణువు తన మంత్ర అనుష్టానానికై ఏ ప్రదేశానికి వెళ్ళాడు ఆ మంత్రాన్ని ఎక్కడ అనుష్టించి సిద్ధిని పొందాడు ఏ ప్రకారంగా ఆ మంత్రసిద్ధి కలిగింది ఆ విశేషాలన్నీ తమరు నాకు దయతో తెలియజేసి అనుగ్రహించండి..



ఈ ప్రార్థనకు భృగువిలా జవాబు ఇచ్చాడు ఓ రాజా భూమండలం పైన సిద్ధక్షేత్ర మనే పుణ్యభూమి ఉన్నది ఆ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే అక్కడ తపస్సు వల్ల సకలాభీష్టములు సిద్ధిస్తాయి అటువంటి మహా మహిమాన్విత సిద్ధ క్షేత్రాన్ని చేరుకొని శ్రీమహావిష్ణువు ఎంతో కాలం సుదీర్ఘ తపస్సును ఆచరించాడు..



శివుడి చేత ఉపదేశించబడిన ఆ షడక్షరా గణేష మంత్రాన్ని గణేశమూర్తిని తన యావత్ శరీరంలోని అంగాలపైన వ్యాసంతో ఆవాహన చేసుకుని అంతర్మాతృకా,బహిర్మాతృకా వ్యాసములో, మూలమంత్ర పురస్కారమైన ప్రాణాయామంతో గజాననున్ని తన హృదయంలో ధ్యానిస్తూ మానసికోపచార పూజను అర్పిస్తూ ఆ గజాననుని పరమ మంత్రాన్ని నూరు సంవత్సరాల కాలం జపించాడు..



అలా చిరకాల మాచరించిన తపస్సుకు అతని భక్తి శ్రద్దల చేత సంతుష్టుడైన గజాననుడు ఒక్కసారిగా కోటి సూర్యులకు సమానమైన వెలుగుతో ఎదుట సాక్షాత్కరించి నీ మనోభీష్టములన్ని అనుగ్రహించగలను వరాన్ని కోరుకొమ్మని అనుగ్రహించాడు అప్పుడు కార్యార్ధియై తపస్సు ఆచరించిన విష్ణువు అంజలి ఘటించి గణేశుని ఇలా స్తుతించాడు సకల దేవతా గనములచే వందనీయుడైన ఓ దేవా దేవా బ్రహ్మ రుద్రేంద్రాదురకు సైతం తమ శక్తితో నిన్ను దర్శించుట అసాధ్యం కాగా ఇక సామాన్యులకు తరమా!



నీవు అనేక రూపాలలో భక్తుల పాలిట కల్పతరువువై వారిని అనుగ్రహించి అభీష్ట సిద్ధులను ప్రసాదించే ఉదయం మూర్తి నీవు వ్యక్త వ్యక్తరూపుడవు అణువు కన్నా అత్యంత సూక్ష్ముడవు మహత్తు కన్నా గొప్ప మహిమోపేతుడవు.త్రిమూర్త్యాత్మకుడవై మా ద్వారా సృష్టి స్థితి లయ ములను ఆచరించేది నీవే అంతర్యామిగా జీవకోటిలో వారి ఆత్మవై వెలుగొండేది నీవే తావరా జంగమాత్మకమైన జగత్తు అంతా వ్యాపించిన వాడవు సర్వశక్తిమంతుడవు ఈ జగత్తు అంతా నీలోనుంచి ఉద్భవించిన కారణాన జగత్పత్తితవు రక్షకుడు పోషకుడవు కూడా నీవే...



ఓ దేవా చతుర్యాసుడైన ఆ బ్రహ్మ ప్రార్థన మేరకు దుష్టాత్ములైన మధు కైటభులను సంహరించబూని అనేక వేల సంవత్సరాలు ఘోరయుద్ధం చేసిన వారిని ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో మిమ్ము శరణు వేడాను నాయందు దయతో ఆ రాక్షస వధకు తగిన శక్తియుక్తులను ప్రసాదించు జయమును కీర్తిని నీయందు ఏకాంత భక్తిని అనుగ్రహించు అంటూ స్తుతించిన శ్రీహరితో ఓ వాసుదేవ నీ అభీష్టం మేరకు సకలము సిద్ధించగలరు దుష్ట దానవ సంహారం నీ వల్లనే నిరాటంకంగా జరగ గలదు నీకు యశస్సు బలము ధైర్యము తేజస్సు కలుగుతాయి శుభమగు గాక అని ఆశీర్వచనాపూర్వకంగా అనుగ్రహించి ఆ భక్తజన పాలకుడైన గజాననుడు అంతర్ధానం చెందాడు...



గజాననుని అనుగ్రహానికి ఎంతగానో సంతోషం పొందిన ఆ మహావిష్ణువు ఇక గెలుపు నిశ్చయమన్న దృడవిశ్వాసంతో గణేషుడు వరాన్నిచ్చిన ఆ ప్రదేశంలో పటికమైన దేవాలయాన్ని ఒకదాన్ని నిర్మించాడు బంగారు గోపురం తో ప్రకాశిస్తున్న ఆ మందిరంలో గండకీ సంబంధ మైన సాలగ్రామంతో గణేశుని మూర్తిని చెక్కించి అక్కడ సా మంత్రకంగా ప్రతిష్టించాడు ఆ ప్రదేశంలో శ్రీమహావిష్ణువు యొక్క సకల అభిష్టాలు సిద్ధించడం వల్ల దీనికి సిద్ధ క్షేత్రం అన్న పేరు వచ్చింది...



ఆ తరువాత శ్రీమహావిష్ణువు దుష్టులైన ఆ మధుకైటభులను యుద్ధానికి పిలిచి కవ్వించి వారితో ఘోరమైన యుద్ధం చేయ సాగాడు ఇలా చాలా కాలం యుద్ధం చేశాక వాళ్లకు మీరు కోరిన వరాలను ఇస్తాను కోరుకొమ్మని అన్నాడు అప్పుడు వాళ్లు పరిహాసంగా ఇలా అన్నారు ఓ హరి నీవే మా నుంచి ఏదైనా వరాన్ని కోరుకో మేమే నీకు ఓ వరాన్ని అనుగ్రహిస్తాము వారు భగవతీమాయకు లోనైనారని లోలోపలే సంతోషించి పైకి మాత్రం వినయంగా అట్లయితే నా చేతిలో మీరు ఇరువురు వధింపబడే వరాన్ని ప్రసాదించండి అన్నాడు...



అప్పుడు వారిద్దరూ నిశ్చేష్టులై క్షణకాలం యోచించి మమ్మల్ని జలం లేని ప్రదేశంలో వధించు మేము ఆడిన మాట తప్పని వారం కనుక అలాంటి ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడ అని అభీష్టం నెరవేర్చుకో అన్నారు ఓ సోమాకాంత మహారాజా ఈ విధంగా యోగమాయకు వశ్యులైన ఆ మధు కైటభులను దానవాంతకుడైన ఆ హరి గణేష అనుగ్రహం చేత తన తొడ పై ఉంచుకొని చక్రాయుధంతో వారి కుత్తుకలుత్తరించాడు. ఈ ప్రకారం గణేశా అనుగ్రహం ప్రసాదించింది ఈ రాక్షసుల సంహారానికి దేవదుందుభులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది...



ఈ యావద్వ్తత్తాంతాన్ని విష్ణువు అప్పుడు తన కుమారుడైన బ్రహ్మ దేవునికి వివరించాడు తమకు చేసిన ఆ మహోపకారానికై సకల దేవతలు గజాననుని స్తుతించారు మహా ప్రభావయుతమైన ఈ సిద్ధ క్షేత్ర మహత్యమును ఎవరైతే వింటారో వాళ్లు తమ సకల పాపాములన్నింటి నుండి దుష్కర్మల నుండి విముక్తులై భయాన్ని పోగొట్టుకున్న వారై అన్ని మనోభీష్టాలను అతనికి అభిష్ట కార్య సిద్ధిని నిస్సందేహంగా పొందగలరు అంటూ సోమకాంతునికి భృగు మహర్షి వివరించాడు...



ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని 

సిద్ధ క్షేత్ర మహత్యం అనే  అధ్యాయం సంపూర్ణం.


 *సశేషం.......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat