శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 20 - యశోద కోరిక

P Madhav Kumar


🌻 *యశోద కోరిక* 🌻

🍃🌹యశోద శ్రీకృష్ణుని కంటికి రెప్పగా చూచుకొని పెంచినది. తన ప్రాణమే కృష్ణుడుగ ఆమె భావించుచుండెను. ముద్దుల శ్రీకృష్ణుని యెడల ఆమె మధురానురాగము మరి ఎవ్వరునూ చూపి యుండలేదు. 


🍃🌹శ్రీకృష్ణునకున్నూ యశోద అంటే అనుపమానమయిన ప్రేమ, శ్రీకృష్ణుడు అవతారము చాలించునున్నాడనే విషయము యశోదకి కూడా తెలిసింది. 


🍃🌹ఆమె శ్రీకృష్ణుని పిలచి ‘‘నాయనా! కృష్ణా! నీ వలన నాకు యెన్నో విధముల ఆనందము చేకూరినది. కానీ నాకు ఒక్కలోటు మాత్రము యింకనూ వున్నది. నీకు జరిగిన వివాహములలో ఒకదానిని కూడ చూడడం నాకు వీలుపడలేదు. 


🍃🌹నీ వివాహం చూడాలనే కోరిక నాలో వుండిపోయింది’’ అని యన్నది, శ్రీకృష్ణుడు ‘‘అమ్మా! నీ కోరిక కలియుగములో తీరగలదు. శ్రీవేంకటేశ్వర అవతారమును కలియుగమున దాల్చెదను.


🍃🌹నీవిక యీ శరీరమును వీడి వకుళ మాలికవై శేషాచలమునకు వెళ్ళి వరాహస్వామిని అర్చిస్తూవుండు అన్నాడు. ఆమె అట్లే యన్నది. ఆ యశోద శరీరమును వీడి వకుళాదేవిగా మారింది. శేషాచలము చెంతనుండే వరాహస్వామిని అర్చించసాగింది. యామె మనస్సు వెన్న మహాభక్తురాలు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat