🔱 శబరిమల వనయాత్ర - 72 ⚜️ కుంభదళత్తోడు (కుంభళంతోడు) ⚜️

P Madhav Kumar

⚜️ కుంభదళత్తోడు (కుంభళంతోడు) ⚜️

ధనుర్మాసము (మలయాళం) ముప్పైయవ తేదీన మకర సంక్రమణ దినమున పదునెనిమిది మెట్ల వద్ద చేరు సకల అయ్యప్ప భక్తులు మరుసటి దినము ప్రభాత సమయమున స్నానము కొరకై

కుంభదళ తోడునకు యాత్ర గావించెదరు. వారు అచ్చట చేరి *'ఉరుళ కుయి'* అను పేరుగల గుంతలో స్నానము చేసి అచ్చట గూడా పంబలో జరుపునట్లు సద్యయు (సలిది). దానధర్మాదులు చేయుదురు. 'స్వామి వారి యొక్క ఉరళ కుయి తీర్థమే శరణ మయ్యప్పా అని శరణు ఘోష పలికి ఆ ఉరళ కుయి యందు స్నానము చేసినచో కలుగు ఫలితము అవర్ణనీయము. శబరిగిరి క్షేత్రము నుండి సుమారు ఒకమైలు దూరమున ఉత్తరముగా తూర్పు ముఖమున ఈ కుంభళత్తోడు ఉరళ కుయి తీర్థము గలదు. సన్నిధానమందు శ్రీ అయ్యప్ప స్వామికి ఈ తీర్థమునే అభిషేకము చేయుదురు. ఉరళ కుయి యొక్క పై భాగమున ఆనకట్ట ఏర్పరచి పైపుల ద్వారా నీరు సన్నిధానమునకు చేరునట్లు ఏర్పాటుచేసియున్నారు. మాళికాపురత్తమ్మ సన్నిధి నుండి నేరుగా ఉత్తరము వైపు వెళ్ళినచో పై చెప్పబడిన కుంభళతోడు చేరుకొనవచ్చును. ఈ ఉరళ కుయి యొక్క ప్రధాన మహత్యము ఏమనగా ఇందులో మునిగి స్నానము చేయుటకు ఈ నీరు సరిపోవునా ? అంత నీరు లేదే అను సంశయము కలుగును. కాని అందులో సుఖముగా దిగి , మునిగి స్నానము చేయవచ్చును. శుభ్రముగా నీరు మునుగుటకు సరిపోవును. ఎట్టి కష్టమూ యుండదు. అట్లే సులభముగా పైకి రావచ్చును. పైకి చేరుకున్న పిదప మరల ఆ గుంతను చూచినచో ఇందులో దిగి ఎట్లు స్నానము చేశామన్న సందేహము కలుగును. ఇట్లు పైన చూచి భయపడెడి కొందరు కుంభళముతోడు నందు (ఉరళ కుయి నుండి ప్రవహించు చున్న నీటిధారలో) మునిగి మరలిపోయెదరు. ఇక ఇక్కడితో శబరిగిరి మకర సంక్రమణ యాత్రా విశేషము ముగిసినట్టే. ఇక మిగిలిన రెండు దర్శనముల గురించి (విషు దర్శనం, మండల పూజ గురించి క్లుప్తముగా చూచి , శబరిగిరి కోవెలలోని పూజా విషయములు (మామూలు వేళల్లో) కాస్త తెలుసుకొని కొండదిగి వచ్చెదము.


🙏🌷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat