అమృత బిందువులు - 28 - ధార్మిక తత్వం

P Madhav Kumar


*ధార్మిక తత్వం 

కోటిభోగములు , ఇంద్రపదవి కూడ , భగవంతుని నామస్మరణకన్న మిన్నకాదు 


మనస్సులోని మాటను అరమరికలు లేకుండా చెప్పుకునేవారు ఆత్మీయులు


దైవప్రీతి , లోకనీతి , పాపభీతి అను మూడు సుగుణములను మనుజుడు అభ్యసించవలెను. 


ఇంద్రియాలను జయించకుండా కాషాయ బట్టలు ధరించేవాడు సన్యాసికాడు. మనస్సు సన్యసించాలే కానీ మనిషి సన్యసించకూడదు.


త్రివేణి సంగమంలా అందరూ ఏకమైతే విశ్వమంతా పులకిస్తుంది. శాంతిమయమవుతుంది.


ఆధ్యాత్మికతకు , వార్ధక్యానికి వాయిదా వేసేవారు మూర్ఖులు.


నీ సాంగత్యంలోనివారికి భక్తి కలుగకపోతే నీ భక్తిలో బలం లేదని తెలుసుకో.


బ్రతుకంటే ఆశ , చావంటే భీతి ఎవరికి లేదో వారే మహాత్ములు.


సహనం మనిషికి ప్రధానము. తన శాంతమే తనకు రక్ష.


క్షమా గుణమునకు మించిన సద్గుణం మరొకటి లేదు.


సాధన , పట్టుదల , కార్యదీక్ష , క్రమశిక్షణ , విశ్వాసం , నీతి , నిజాయితీ మానవ విజయానికి సంకేతాలు.


మదము ఎంత నీచస్థాయికైనా దిగజార్చి , మలినం చేయగలదు. మంచిని కూల్చ గలదు.


రెమ్మలో కలకలలాడుతున్నంత వరకే ఆకుకు ఆనందము. రాలిన తరువాత మరణమే. మనిషి జీవితము కూడా ఆకులాంటిదే.


ఆత్మశుద్ధి పొందిన వాడే అంతరాత్మను చూడగలడు.


దేనినైనా నిర్ణయించి తీర్పు నిచ్చేది కాలమే. దానికి ప్రతి ఒక్కరు తలఒగ్గ వలసిందే.


మట్టి అవుతుందని అసహ్యించుకోకు. నీవు కలిసిపోయేది ఏ నాటికైనా మట్టిలోనే అని ఆలోచించుకో.


నిరాశ నిలువునా క్షీణింప చేయగలదు. ఆశ మోడు వారిన వృక్షాన్ని చిగురింపజేసినట్లు జీవితాలను చిగురింప చేయగలదు. 


దయ పెరిగితే దాన గుణము అలవడుతుంది. దాన గుణము అలవడిన జీవితాలు ముక్తిని పొంద గలవు.


క్రమ శిక్షణ జీవితాలను క్రమము చేయడమే కాకుండా , ఆత్మలను శుభ్రపరచగలదు. వెలుగుబాటలను చూపగలదు.


మానవుల ప్రేమ పొందలేదని , అభాగ్యులమని బాధపడకండి. భక్తితో భగవంతుని ప్రేమే పొందండి. దానికి మించినది ఏదియు ఈ విశ్వములో లేదు.


పరిశుభ్రం లేని ఆత్మ పనికిరాని ఫలం లాంటిది. 


మహనీయుల బోధనలు విని , మంచి మార్గంలో నడుచుకొనే వారు మర్యాదను పెంపొందించుకొని మహాశయులు కాగలరు.


జ్ఞానులను చూచి ఈర్ష్య పడకు. వారు చెప్పిన పరమ సత్యాన్ని గ్రహించి , పరిపూర్ణుడుగా మారినప్పుడే జీవితానికి సార్థకత లభించగలదు.


దైవము దుష్టులను దూరం చేసినట్లు , పాపభీతి పాపాలను దూరము చేయగలదు.


నిస్వార్థ జీవులు నిండుకుండ వలె నిర్భయంగా ఉండగలరు.


పాదములు తాకి నమస్కారము పెడితే , పెట్టించుకున్నవారి శక్తులు పోతాయి. కనుక దాన్ని కృష్ణార్పణం చేసేయాలి.


ఉదయం తూర్పునకు తిరిగి పని ప్రారంభించవలయును.


సాయంత్రం ఉత్తరమునకు తిరిగి పని ప్రారంభింపవలయును.


బ్రహ్మజ్ఞానము కలవారి యందు భక్తి , దైవపూజబీ, దానశీలత , సజ్జన సాంగత్యము ఉండాలి.


తనను తాను క్షమించుకొనే వ్యక్తి ఇతరులపై ఆరోపణలు చేస్తాడు.


అన్ని పనులు తనకిష్టంగా మరల్చుకొనేవాడు తెలివైన వాడు.


విధి నిర్వహణకు మించిన మంచి పని లేదు. నా దగ్గర వున్న సమాచారం మేరకు పరిపూర్ణం సమాప్తం,🙏స్వామియే శరణం అయ్యప్ప 🌸🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat