🔰 *దేవాంగ పురాణము* 🔰 4వ భాగం

P Madhav Kumar

 

 *4.భాగం* 


తరువాత నా దేవలుడతి సంతోషముగా నామోదపట్టణమునకు బోవుటకు బయలుదేటి మార్గమధ్యమున ఆనేకదేశములను దుర్గమములగు ఆడవులను

కొండలను పుణ్యములగు నదులను దాటి  కొన్నాళ్ళకామోదపట్టణము ప్రవేశించెను.మహాత్ముడగు దేవలునిరాక తెలిసికొని శివునియాజ్ఞప్రకార మచ్చటికి సంతోషముగా నందఱును సమాగతులయిరి. రాజులు మంత్రిపుత్రులు,మహాబలులగు భటులును వణిజులును గాయకులు నర్తకులు గొప్పవాద్య ఘోషములతో నాదేవలుని

పురోహితపురస్కారముగా నెదుర్కొనిరి. వారందరు నెదుర్కొని గౌరవించుటచే

దేవులుడు మిక్కిలి సంతోషించెను. దేవారా ! యీపట్టణము తమది.

మమ్ములనందఱను యథా న్యాయముగా పరిపాలింపుము మేమందఱమును

నీవారము. ఇంక సంతోషముగా పట్టణములో బ్రవేశించి యేలుకొనుము.

దేవదేవుడగు శివునియాజ్ఞ యిట్టిది. ఇల్లందఱును విన్నవించినతోడనే దేవలుడు

సంతోషపూర్వకముగా బట్టణములో బ్రవేశించుట కంగీకరించెను. అప్పుడు

శంఖములు మొదలగు వాద్యములు మ్రోగించిరి. ఆచప్పుడు దశదిశలను

వ్యాపించినది. అత దౌమోదదాయకమగు నాయామోదపట్టణములో బ్రవేశించెను.ఆపట్టణమునకు బంగారు ప్రాకారము కలదు. బంగారు గోపురములతోనలంకరింప

బడినది. కందకములు పాతాళలోకమువఱకును వ్యాపించియున్నవి. మఱియు

నాపురిలోని జెండా లాకాశమునంటుచున్నవి. నదులలో బంగారుపద్మములు

విరాజిల్లుచున్నవి. నానావిధములయిన యుద్యానవనములతో నలరారుచు నాకాశమున సంచరించు సూర్యచంద్రాదులకు విశ్రాంతిని గలిగింపజాలు మేడలతో

నొప్పుచున్నది. అందలి యుద్యానములు నందనవనముతో స్పర్ధచేయుచున్న

నున్నజాలదా యింకవాని రామణీయకమేమని వర్ణింపనగును. అచ్చటి వేశ్యల

లావణ్యమునకు బరాజితలై యిప్పటికిని భూమియందచ్చరలు దిరుగమానిరి.

ఆపట్టణముసొంపు చూచి దేవగంధర్వాదులు స్వర్గమును విడిచి సర్వభోగములతో

గూడియున్న యాపట్టణముననే వాసముచేయుచుందురు. ఏవీధినిజూచినను రథములే, ఎక్కడ జూచినను గుఱ్ఱములే. ఏతోటలో జూచినను కొండలవంటియేనుగు

గున్నలే. ఇట్లు సర్వాంగసుందరమైన యాపట్టణములో ప్రవేశింపగానే దేవలునకు

బ్రాహ్మణ స్త్రీలు నీరాజనముపట్టిరి. మంగళకరమయిన పాటలు పాడిరి, ఆయా మేడలయందు నిలువబడి పూవులు పేలాలు చల్లిరి. నేత్రహస్తులై పరిచారకులు

ముందునడుచుచున్నారు. బ్రాహ్మణలందఱును స్వస్తిపాఠములతో వెంట నడువ మొదలిడిరి. ఇట్లు పురస్త్రీల నేత్రోత్పలములచే బూజింపబడుచు దేవలుడంతః

పురములో బ్రవేశించెను. తరువాతను మంత్రులు మొదలగువారు పుణ్యతీర్థముల

జలము దెప్పించి మంగళవా ద్యఘోషములతో మంచిదినమున మంచి ముహూర్తమును ఆ అమ్మాయి ఆభిషేకించిరి. తరువాత నిట్ల ఆభిషిక్తుడైన యాదేవలుడు మంత్రులు మొదలగు

పౌరులతో గూడి సంతోషించుచు దేవతలతో గూడిన దేవేంద్రునివలె నలరారుచుండెను. మంత్రులు రాజపుత్రులు మొదలగువారు దేవలుని రాజునుగా నభిషిక్తునిజేసి

సంతోషపూర్వకముగా నమస్కరించి రాజముద్రిక యాతని చేతికిచ్చిరి. ఆఱుకోట్ల

సువర్ణములరాబడి యున్నదని తెలిపిరి. ఆదేశపు మర్యాద లన్నియు విన్నపించిరి.

ఆయుత్సవ సందర్భమున నూఱగ్రహారములు శివభక్తుల కిచ్చెను. ఉత్సవార్ధము

వచ్చిన బ్రాహ్మణులు మొదలగు వారికి ధనము కొట్లుపగులగొట్టి పంచి పెట్టించెను.జాత్యంధులు మొదలగువారిని బెక్కురీతుల సంతోషపటిపించెను. తరువాతను పరిచారకులను రాజకీయపురుషులను బిలిపించి వారివారిని దగురీతిని గౌరవించి

యిండ్లకు బంపెను. ఆదేవలునకు నలుగురు మంత్రులుండిరి. సుబుద్ధి, కార్య

దక్షుడు, నీతిమంతుడు, దీర్ఘ దర్శనుడునని వారి పేళ్ళు, వారు న్యాయమార్గప్రవర్తకు

లయి రాజ్యభారమును సమముగా నవలంభించి రాజన కెంతయు సంతనమును

గలిగించుచుండిరి.

నార - తండ్రి ! పితామహా ! పూర్వ మాయామోదపట్టణములో భద్రబాహుని కుమారుడు సునాభుడనువాడు తేజస్వియు బరాక్రమశాలియు నుండెడువాడుగదా !

అతని చరిత్రయెట్టిది ? వాని ప్రభావమెట్టిది ? ఆరాజకుమారుడు దేవలమునికి

రాజ్యమిచ్చుటకుగల కారణమేమి ? అతని రాజ్యమును దేవలునకు శివుడేల యిప్పించెను ? ఇదియంతయు నాయందు దయయుంచి విస్తరించి చెప్పుము.బ్రహ్మ నారదా ! నీయడిగినయట్లే యామోదరాజయిన సునాభునికథచెప్పెదను వినుము. అట్లు పట్టాభిషేకము కాగానే సునాభుడు దేవలునియొద్దకు

వచ్చియిట్లనియె స్వామీ ! దేవలభూపాలా ! ఇంకమేము సెలవు పుచ్చుకొనియెదము.

మాకనుజ్ఞనీయవలయును అను నతనిపలుకు విని దేవలుడిట్లనియె రాజా ! ఏచ్చటికి బోయెదవు ? ఇదియేమి యిట్లు చెప్పుచున్నావు ? మనమందరమును గలిపి

యిచ్చటనే యుందము, అనుదేవలునిమాటలు విని సునాభుడిట్లనియె. ఇక

నిటుపయి నిటనుండదగదు. మనస్సు త్వర పెట్టుచున్నది. నీదయవలనదు

స్తరమయిన శాప సముద్రమును దాటితిని. నీయనుజ్ఞను బొందిపోయెదను. ఇట్లు

చెప్పగా నాశ్చర్యపడి యతనిచరిత్ర నిట్లడిగెను. రాజా ! నేను జాలనాశ్చర్యపడు చున్నాను. నిన్నెవ్వరు శపించిరి. అదియెట్టిది ? యథార్థము వినిపింపుము. అనియడుగగా సునాభుడు దనపూర్వవృత్తమును జెప్పనారంభించెను. దేవలరాజేంద్రా !

నీయడిగిన సంగతి వినుము. నేను రుక్మరథుడను గంధర్వ రాజకుమారుడను,

మాతండ్రి వీర్యవంతుడు సత్యవాది తపోనిధి యని లోకములయందు

బ్రసిద్ధిబొందెను. అతడు మయూరియను నా మెయందెనిమిదవవసువుచే

బుట్టింపబడినవాడు. ఆతనిపట్టణము మహేంద్రగిరి కందరమున నుండెడిది.

సర్వభోగాఢ్యమైన యాపట్టణములో నుండి గంధర్వులను పాలించుచుండెను.

ఆతనికి పద్మకోమలయను భార్య గలదు. ఆమె పారిజాతాద్రినాథుడగు

హేమమాలికూతురు, తండ్రిని జయించి మాతండ్రి యామెను దెచ్చుకొనెను.నేనామెకును నతనికిని నేరసుడనగు కుమారుడను. అని చెప్పిన సునాబునిమాటలు

విని యతని తండ్రి చరిత్రమును వినదలంచినవాడై యిట్లనియె. రాజా ! నీతండ్రి

పరాక్రమాదికము వినిపింపుము. నేనెంతయు గుతూహలముతో వినగోరుచున్నాను.

అతడు మయూరియనునామెయందెట్లు వసువుచేగలిగెను ? అని యిట్లు దేవలుడడునుగగా సంతోషించి తనతండ్రివృత్తాంతమునిట్లని యాసునాభుడు చెప్ప మొదలిడెను. దేవల మహారాజా ! నీయడిగినయట్లు మాతండ్రియగు రుక్మరథుని

సంగతి యంతయు జెప్పెదను సావధానచిత్తుడవై వినుము. అని సునాభుడిట్లు చెప్పదొడంగెను.


 *సశేషం......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat