🔱 శబరిమల వనయాత్ర - 50 ⚜️ భస్మకుళము నందు స్నానమ ⚜️

P Madhav Kumar


⚜️ భస్మకుళము నందు స్నానమ ⚜️


భస్మకుళము నందు స్నానము పాపహరమగును. ఇది ఒక పుణ్యతీర్థమని సకల అయ్యప్ప భక్తులు విశ్వసించెదరు. దీనిని భస్మతీర్థ మనియూ చెప్పెదరు. ఈ తీర్థము నందు స్నానమాడి పాపపరిహారు లైయే భూతేశుడైన అయ్యప్పను ఆరాధించవలయునని కొందరు అభిప్రాయపడుదురు. ఆ అభిప్రాయమును పాటించి అట్లే ఆ భస్మకుళమునందు స్నానము చేసియే స్వామిని దర్శించువారు కూడా కలరు. ప్రజలు ఈ పుష్కరిణిలో దిగి , అసహ్యకరమైన ప్రవర్తనలు చేయడము వలన అందులోని జలము

మిక్కిలి మలినముగా ఉండును. అయిననూ , ఇందులో స్నానము చేయువారికి ఎట్టి రోగములూ రావు. ప్రతి అయ్యప్ప భక్తుడు ఈ జలము పుణ్యతీర్థమే మలినము చేయక యుండునట్లు చూసినచో ఆహా !  అది పుణ్యతీర్థమే. ప్రియస్వాము లారా ! అయ్యప్ప భక్తులారా !సహృదయులారా ! మనము స్వయముగా శ్రద్ధ తీసికొని దానిని మలినము చేయకూడదని ప్రతిజ్ఞ చేయవలెను. మిగిలిన వారికి కూడా

మలినము చేయకూడదని నచ్చచెప్పుటకు ప్రయత్నము చేయవలెను.


🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌺🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat