🔱 శబరిమల వనయాత్ర - 51 ⚜️ స్వామివారికి ఆరాధనలు ⚜️

P Madhav Kumar


⚜️ స్వామివారికి ఆరాధనలు ⚜️


ఒక్కొక్కరి ఆచారము ననుసరించియూ , ఒక్కొక్కరి ప్రార్థనా విధానము ననుసరించియూ , ఆర్థిక పరిస్థితి ననుసరించియూ ఆరాధనలు స్వామికి జరుపవచ్చును. కాని ఏ ఆరాధన చేసిననూ భక్తితోనూ , మనోవాక్కాయ కర్మలా శుద్ధ సంకల్పులై చేయవలయును. భక్తాభీష్ట వరప్రసాదుడైన ఆ భగవంతుడు మన శ్రద్ధను , భక్తిని కొలత వేయునే కాని స్వల్ప , అధిక పూజా విధానమును లెక్కగొనడు. ఏనుగును పెట్టి స్వామిని

ఊరేగించుచూ పూజించు వానిని , నిర్థనుడై పుష్పము నొక్కదానిని స్వామి శిరముపై ఉంచి నమస్కరించు వానిని స్వామి ఒక్కటిగానే ఎంచును.


ఎవరి ఆర్థిక శక్తికి తగినట్లు వారు భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధించి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలయును. నెయ్యాభిషేకము , నెయ్యి దీపము , కర్పూర ఆరాధన , పుష్పాంజలి , చందనములతో అలంకరించుట , పన్నీటితో అభిషేకము ఇవన్నియూ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఆరాధనలు. పుష్ప హారములను స్వామిపై అలంకరించుట , అడుగడుగు దండముల ప్రదక్షిణము చేయుట , టపాకాయలను ప్రేల్పింప చేయుట (వెడివయిప్పాడు) ఇవన్నియునూ కూడా స్వామి వారికి ఇష్టమైన సేవలే. ముందే నుడివిడినట్లు ఇక వారి వారి శక్తి భక్తిను.


🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌻🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat