🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸చెన్నైతాంబరం నుండి సుమారు 12 కి.మీ దూరంలో గూడువాంచేరి వుంది. ఒకానొకకాలంలోనందీశ్వరుడుపరమశివునిపూజించినస్ధలంయిది. అందువలన ఈ స్థలానికినందికేశ్వరం అనే పేరు కూడా వున్నది.
🌿ప్రాచీనకాలంలో ఈ ప్రాంతమంతా
పువ్వుల తోటలతో నిండివుండేది.
ఇక్కడినుండి పువ్వులను సేకరించి మాలలు అల్లి అనేక దేవాలయాలకి పంపేవారు . అందువలన
పూయిడువాంచేరి అనే పేరు కూడా యీ ఊరుకు వున్నది.
🌸గుడువాంజేరి రైల్వే స్టేషన్ దగ్గిర ఒక మామిడిచెట్టు క్రింద వినాయకుడు వెలసియున్నాడు.ఈ ఊరిలో పొగిచిన శనగలు అమ్ముకుంటూ ఒక వృధ్ధురాలు జీవిస్తూ వుండేది.
🌿ఒకనాడు ఆ ముసలామెకు తన శనగలు ఏవీ అమ్ముడుపోలేదు. తిరిగి తిరిగి అలసిపోయి రైల్వేస్టేషన్ వద్ద వున్న మామిడి చెట్టు క్రింద వినాయకుని ప్రార్ధిస్తూ కూర్చున్నది.
🌸కొద్ది సేపటికి జనాలు ఒక్కొక్కరుగా వచ్చి పొగిచిన శనగలు కొనుక్కుని వెళ్ళేరు. తెచ్చిన సరుకంతా అమ్ముడుపోయింది. మరునాటి
నుండి దేవుని దయతో ఆ వృధ్ధురాలి శనగలన్నీ అమ్ముడు పోయేలా వ్యాపారం సాగింది.
🌿వృధ్ధురాలికి ఆ మామిడి చెట్టు కి ఏదో మహిమ వున్నదని అనిపించింది.
ఆనాటి అమ్మకం పూర్తవగానే ఆ మామిడి చెట్టుని నిశీతంగా గమనించినది.
🌸మామిడిచెట్టుకి అడుగున వున్న వ్రేళ్ళు అన్నీ ముడిపడి వినాయకుని రూపంలో కనిపించాయి. వృధ్ధురాలు భక్తి తోపులకించి పోయింది.
గణనాధుని మనసారా ప్రార్ధించినది.
🌿ఆమెద్వారా చుట్టు ప్రక్కలవారికి ఈ విషయం వ్యాపించి ప్రజలంతా ఆ
వినాయకుని దర్శనానికి రావడం మొదలెట్టారు. క్రమేపి అక్కడ ఒక ఆలయం వెలసినది.
🌸ఈ ఆలయంలో ఈశ్వరుడు, లలితాంబిక,దక్షిణామూర్తికొలువుదీరారు. నారు.ఈ ఆలయంలో గణేశుడు దక్షిణ ముఖంగాదర్శనమిస్తున్నాడు.
ఈ భంగిమను అఘోర గణనాధ స్వరూపమనిఅంటారు.
🌿ఈ ఆలయంలో చతుర్ధినాడు
అఘోరగణనాధ మూర్తి మూల మంత్రాన్ని జపిస్తూ ఒక హోమం
ఘనంగా జరుపుతారు. ఈ హోమంలో పాల్గొన్నవారికి కలిగే జీవితంలో సుఖసంతోషాలు, ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
🌸శతృవుల బాధలు , దీర్ఘకాల వ్యాధులు తొలగి పోతాయని నమ్ముతారు.. చతుర్ధినాడు
వినాయకునికి జరిగే చందన పూత అలంకారం చాలా విశేషంగా చేస్తారు.
🌿విఘ్నేశ్వరునికి పూత పెట్టిన చందనం సకల వ్యాధులను గుణపరిచే
గొప్ప ఔషధమని ఐహీకం...స్వస్తి..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿