🔱 శబరిమల వనయాత్ర - 67 ⚜️ గణపతి హోమం ⚜️

P Madhav Kumar

⚜️ గణపతి హోమం ⚜️

శబరిమలలో సన్నిధానం తెరచియున్న దినములన్నియు ఉదయం 5.00 గంటలకు గణపతి హోమం జరుగును. స్వామి సన్నిధి ముంగిట వంటశాలకు ప్రక్కన యుండే ముఖ మండపమున శబరిమల ప్రదాన తంత్రివర్యులు ఈ గణపతి హోమమును నిర్వహిస్తారు. ఉదయం స్వామివారి సన్నిధానం తెరచి దీపారాధన చేసాక ఈ గణపతి హోమం జరిగిన పిమ్మటే శ్రీస్వామివారికి అభిషేక ఆరాధనలు జరుగును. శబరిమల గణపతి హోమం తాంత్రరీత్యా జరుగును. అది చూసి తీరవలసిన

సన్నివేశమగును. ఆ వేళలో సన్నిదానములో యుండు సర్వులు ఈ గణపతి హోమమును తిలకించవచ్చును. కాని ముందురోజే ఎవరైతే వందరూపాయలు చెల్లించి

టిక్కెట్టు కొంటున్నారో వారికి గణపతి హోమములో కూర్చునే అవకాశము లభించును. వారికి గణపతి హోమము అయ్యాక స్వామివారి రక్ష , అటుకులు బెల్లములు పుష్పములు ప్రసాదంగా చిన్నఆకులో మడచి ఇస్తారు.


🙏🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat