⚜️ పుష్పాభిషేకం ⚜️
శబరిమలపై అందరు చేయించుకో గల్గిన ఏకైక పూజ ఈ పుష్పాభిషేకం. సన్నిధి తెరచియుండే అన్నిదినములు సాయం కాలము దీపారాధన అయిన పిమ్మట పడిపూజకు ముందు శ్రీ స్వామి మూలవిరాట్టుకు ఈ పుష్పాభిషేకం జరిపింతురు. ముందు కాలములో రూ.1000 లు దేవస్వంబోర్డుకు చెల్లించి పూలు మనమే తీసుకెళ్తే ఐదుగురిని సన్నిధి ముంగిటకు పంపి మనము తెచ్చిన పూలతో శ్రీస్వామివారికి పుష్పాభిషేకము చేసెదరు. కాని ప్రస్తుత కాలము రకరకాలైన పూలను స్వామి వారిపై వేయడంతో వాటిలో కొన్ని పూలు పాడైపోయి శ్రీ స్వామివారి విగ్రహములో అతుక్కుపోయి విగ్రహమును పాడుచేసే దుస్థితి ఏర్పడుచున్నది గనుక దేవస్వం బోర్డు వారు ఈ విషయంలో అటురానివ్వక శ్రద్ధవహించి తామర , తులసి , బిల్వము , రోజా , మరువము , దవనం , వంటివి మాత్రం అభిషేకానికి అర్హతగా ఎంచి వాటిని కూడా అందరూ తెచ్చేదాన్ని వినియోగించక బోర్డువారే పూలను కూడా నిర్దేశించి ఇచ్చునట్లు వాటినే అభిషేకం చేయాలను తీర్మానము చేసిరి. పైగా భక్తులు
తెచ్చే పూలలో భద్రత తక్కువగా యున్నందున ప్రతివారు తెచ్చిన పూలను పరిశీలించి సన్నిధిలోపలికి పంపడానికి కాలాతీతము అగుతుంది గనుక పై నిర్ణయం తీసుకొన్నట్లు ఉన్నతాధికారులు తెలిపిరి. ప్రస్తుతం పూలాభిషేకానికి రూ.10,001 లు చెల్లిస్తే ఐదుగురు గృహస్తులను సన్నిధి ముంగిట ప్రవేశపెట్టి దేవస్వం బోర్డు వారు పూలతో మేల్ శాంతి వర్యులు శ్రీ స్వామివారికి పూలాభిషేకము చేసెదరు.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏