భారతదేశం లోని తెలంగాణా రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం త్రిలింగ క్షేత్రాల్లో విశిష్టమైన ఒకే పానువట్టం పై కాళేశ్వర, ముక్తీశ్వర నామాలతో కొలువైఉన్న రెండు లింగ స్వరూపాలతో దర్శనమాత్రం లొనే ముక్తిని అందించే క్షేత్రం గా విశిష్టత కలిగిన శ్రీకాళేశ్వర శ్రీముక్తీశ్వర స్వామివారి దర్శనం🙏☘️
కాశీ క్షేత్రంలో మరణం తో ముక్తి కానీ ఈ క్షేత్ర దర్శనం తోనే ముక్తి అందించే దివ్యక్షేత్రం...
ఒకే పానువట్టం పై రెండు లింగ స్వరూపాలు, నాలుగు
ముఖద్వారాలు, నాలుగు నందీశ్వరులు
*త్రివేణీ_సంగమం*
గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి నదుల సంగమ స్థానం, ఇలా ఎన్నో విశిష్ఠతల సమాహారం... ఈ పుణ్య క్షేత్రం
*త్రిలింగ క్షేత్రం*
త్రిలింగమనే మూడు సుప్రసిద్ధమైన శైవక్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటి.
త్రిలింగాల నడుమన ఉండే ప్రాంతం కనుకే త్రిలింగమనే పదం నుంచి తెలుగు అనే పదం పుట్టిందని కొందరు పండితుల భావన.
*శివయ్యతో_యముడు_లింగస్వరూపంగా*
ఈ దేవాలయంలో ఒకే పానపట్టంపై శివుడు యముడు వెలిశారు. సుప్రసిద్ధశైవక్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాళేశ్వరం.
ఇది కరీంనగర్ జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది.
గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరో వైపు మహారాష్ట్ర ఉన్నాయి.
కరీంనగర్ జిల్లాలోని మహాదేవపూర్ మండలానికి 16 కి.మీ దూరాన, మహారాష్ట్ర సరిహద్దున సిరోంచ తాలూకాకు 4 కి.మీ దూరాన కాళేశ్వరం ఉంది.
*త్రివేణీ_సంగమ_స్థానం*
అతిప్రాచీనచరిత్ర గల కాళేశ్వరక్షేత్రానికి అనేకప్రత్యేకతలున్నాయి.
మన రాష్ట్రంలోని శైవక్షేత్రాలలో శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయాలు ప్రసిద్ధిగాంచినవి.
ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీనది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.
*ఇది దక్షిణ కాశీ గా పేరు గాంచినది