⚜️ మండల పూజ ⚜️
కార్తీక మాసము 1 వ తేదీ మొదలుపెట్టి 41 దినముల వరకూ గల కాలమును 'మండల' కాలమందురు. అనగా 41వ దినము మార్గ శిరమాసము 11 వ తేదీ అగును. ఆ దినమున శబరిగిరిపై 'మండలపూజ' అతి వైభవముగా జరుపబడును. ఆ దినము సాయంత్రము ఆ క్షేత్రము చుట్టూ *'లక్షదీపాలు వెలిగించి 'మండల దీప పూజ'* చేయుదురు. దీనికి ఖచ్చితముగా కార్తీక మాసము 1వ దినము మాల ధరించినవారు మాత్రమే వెడలుటకు అర్హులగుదురు. రెండవ దినము మాల ధరించిన వారు కూడా అనర్హులే అన్నచో ఇంకా ఆలస్యముగా మాల ధరించిన వారి సంగతి ప్రత్యేకంగా అనర్హులని చెప్పవలసింది లేదుకదా !
🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏