శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 28 - వకుళాదేవి శ్రీహరి చరిత్రను వినుట

P Madhav Kumar


🌻 *వకుళాదేవి శ్రీహరి చరిత్రను వినుట* 🌻

🍃🌹శ్రీహరి ఒక పర్ణశాలను నిర్మించుకొన్నాడు. దానిలో తానున్నూ వకుళాదేవియు నివసింపసాగిరి. ఒకనాడు వకుళ, ‘నాయనా! అసలు నీ వృత్తాంతమేమిటి?’ అని ప్రశ్నించగా, నారాయణుడు తనకు – నా – అనువారెవరూ లేరు అనియునూ, తల పై గాయము విషయమున్నూ చెప్పినాడు. వకుళ తన విషయమూ చెప్పినది.



🌻 *శ్రీహరి శ్రీనివాసుడగుట* 🌻

🍃🌹వకుళ వనమూలికలూ అవీ తెచ్చి నారాయణుని తల పై గల గాయము పై మందువేసినది. పళ్ళూ అవీ తెచ్చి ఆహారము యిచ్చినది. వకుళ నారాయణుని శ్రీనివాసాయని పిలచి పరమానంద మొందేది. నారాయణుడు అంతటి నుండి శ్రీనివాసుడుగ వ్యవహరింపబడేవాడు.



🌻 *ఆకాశరాజు వృత్తాంతము* 🌻

🍃🌹పూర్వకాలములో సుధర్ముడనే చంద్రవంశపురాజు వుండేవాడు. ఆ రాజునారాయణపురము రాజధానిగా రాజ్యమేలుతుండేవాడు. ఆయనకు యిద్దరు కొడుకులు పెద్దకొడుకు ఆకాశరాజు, చిన్నకొడుకు తొండమానుడు, సుధర్ముడు ఆకాశరాజుకు పట్టాభిషేకము చేసి తపస్సునకు వెళ్ళిపోయాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి, వారికి అన్నీ వున్నా సంతాన లోపముండెను. సర్వవిధ పుణ్యకార్యములు వారు చేసిరి.


🍃🌹ఒకరోజున ఆకాశరాజు తన కులగురువయిన శుకమహర్షిని ఆహ్వానించి వారిని వుచిత రీతిని పూజించాడు. తరువాత సంతానము లేకపోవుటను, ఆ దిగులుచే తాను తన భార్య కృశించుటయు తెలియజేశాడు. 


🍃🌹అంతా శ్రద్ధగా విని శుకముని ‘రాజా! పూర్వము దశరధుడు చేసిన విధముగా నీవున్నూ పుత్రకామేష్టి యజ్ఞము చేయుము. నీ కోరిక నెరవేరుతుందన్నాడు. యజ్ఞానికి ముహూర్తమును కూడా నిర్ణయించాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat