🌻 *శ్రీనివాసుని వేట* 🌻
🍃🌹ఒకనాడు శ్రీనివాసునకు ఒక కోరిక పుట్టినది. అదేమిటంటే అడవిలోనికి వెళ్ళి వేటాడలని తన మనోభిష్టాన్ని తెలిపినాడు. శ్రీనివాసుని కోరికకు తెల్లబోయింది. వకుళాదేవి ‘నాయనా! సుకుమారమైన శరీరము కలవాడవు. నీవు వేటాడతావా? వరాహవ్యాళ, శార్దూల, ఖడ్జ, మత్తేభాది క్రూరమృగాలు తిరుగాడే అడవులందు వాటితో చెలగాటము మనకు వలదు నాయనా!’’ అన్నది ఆమె.
🍃🌹శ్రీనివాసుడు ‘‘అమ్మా! అనవసరంగా భయపడకమ్మా, ఎన్ని క్రూరమృగాలున్నననూ నన్నేమీ చేయజాలవు. నీ పుత్రుడంటే భీరువు కాదమ్మా. నేను జాగ్రత్తగా వేటాడి వచ్చేస్తాను కదా’’ అన్నాడు సరే జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా!’’ అనీ ఆశీర్వదించి పంపినది వకుళ.
🍃🌹శ్రీనివాసుడు వేటకు సంసిద్దమయ్యాడు. వేటకు వెళ్ళేటప్పుడు కట్టుకొనే బట్టలు కట్టుకున్నాడు. ముత్యాల సమరించిన కుచ్చులు తీర్చిన దట్టిని మొలకు కట్టుకున్నాడు సంపంగినూనె రాసుకొని చక్కగా దువ్వుకున్నాడు. సరిగంచు వల్లెవాటు వేసికొన్నాడు.అనేకరకాల ఆభరణాలు పెట్టుకున్నాడు.
🍃🌹పరిమళం వెదజల్లే గంధాలు శరీరానికి రాసుకున్నాడు. కస్తూరీ తిలకము నుదుట పెట్టుకున్నాడు. కర్పూర మిళిత తాంబూలము వేసుకున్నాడు. విల్లంబులు ధరియించి వేటకు యింక వెళ్ళిపోదామనుకుంటుంటే, బ్రహ్మదేవుడు యీ విషయము గ్రహించి ఒక గుఱ్ఱాన్ని స్పష్టంచి శ్రీనివాసుడుండే చోటికి పంపాడు.
🍃🌹దానిపై యెక్కి శ్రీనివాసుడు వేటకు బయలుదేరాడు. అరణ్యము సమీపించి ధనుష్టంకారము అడవిలో గల సింహం, శార్దూల, చామరీ, సారంగ, భల్లూకాది జంతువులు భయపడి చెల్లాచెదురై తమ చోట్లు వదిలి వూరకే తిరగసాగాయి. వేటాడటానికి అదే సమయమనుకున్నాడు శ్రీనివాసుడు.
🍃🌹విజృంభింజాడు, పదునుతో మిసమిసలాడే బాణాలు వేసి సింహాల్ని చెండాడసాగాడు. పులుల తలలు నరకసాగాడు. ఏనుగుల్ని నేలమట్టము చేశాడు. లేళ్ళను చాలా చంపినాడు. అడవిపందుల్ని హతమార్చినాడు. ఇక్కడనుండి అక్కడకు, అక్కడనుండి మరొకచోటికి తన గుఱ్ఱముపై విహరిస్తూ శౌర్యోత్సాహాలతో వేటాడసాగాడు.
🍃🌹అంతలో ఒక పెద్ద ఏనుగు మహా ఘీంకారము చేసుకొంటూనే ఎటో వెళ్ళిపోయినది. ఆ ధ్వనిని బట్టి వెడలి శ్రీనివాసుడు దానిని తరుమసాగాడు, అది కూడా చాలా వేగముగా వెళ్ళడము ప్రారంభించింది. శ్రీనివాసుడున్నూ మఱింత వేగముతో వెంబడించాడు. కాని ఫలితము లేకపోయినది. అది చివరకు అయిపూ మచ్చా లేకుండా పారిపోయినది.
🍃🌹శ్రీనివాసుడు ఆ మహాగజము కారణముగా చాలా అలసట పడినాడు. దాహము కూడా వేసింది. నీటిని గూర్చి చెంతనున్న ఉద్యానవనముకి వెళ్ళినాడు. ఆ వనము పేరు శృంగారవనము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏