*రోహిణి మున్నగు ఇరువదేడు నక్షత్రకన్యలను దక్షుడు చంద్రునికిచ్చి* 🌸
*ధ్రువ వంశం-దక్ష సంతతి*
రోహిణి మున్నగు ఇరువదేడు నక్షత్రకన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితికడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులూ, సింహికయను కూతురూ పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్రాద, ప్రద, ప్రహ్లాద, సంప్రద నామకులైన పుత్రులు జనించి 'ప్లోడు' లుగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు, సంప్రోనికి ఆయుష్మాన్, శిబి, వాపులులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాదపుత్రుడు ,విరోచని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి నూర్గురు కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు.
🌺హిరణ్యాక్ష పుత్రుడైన ఉత్కురుడు, శమని, భూత సంతాపనుడు, మహానాథుడు, మహాబాహు, కాలనాభులు మహా బలశాలులు.దనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంబర, ఏక చక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాతవీరులు.స్వర్భానుని కన్య సుప్రభ, వృష పర్వుని కూతురు శర్మిష్ఠ అతని కింకా ఉపదానవి. హయశిర అను మరో ఇద్దరు శ్రేష్ఠకన్యలున్నారు.
🌺పులోమా, కాలకా వైశ్వానరకన్యలు. ఈ పరమ సౌభాగ్య శాలినుల వివాహం మరీచి పుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి అరవై వేల మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములనీ కాలకంజులనీ వ్యవహరించాడు.విప్రచిత్తి, సింహికలకు వ్యంశ, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, ఖస్రుమాన్, అంజక, నరక కాలనాభులు పుట్టారు.
🌺ప్రహ్లాదుని వంశంలో నివాతకవచ నామధారులైన దైత్యులు రెండు వందలమంది. ఉదయించారు. తామ్రాకు సత్త్వ గుణ సంపన్నులైన ఆరుగురు కన్యలు పుట్టారు. వారి పేర్లు :శుకి, శ్యేని, భాసి, సుగ్రీవి, శుచి, గృధిక. వీరికి క్రమంగా చిలుకలు, గుడ్లగూబలు, కాకాదులు శ్యేనాలు భాసాలు అశ్వాలు, ఒంటెలు నీటి పక్షులు , గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రవంశమన్నారు.