R.S.S. - ఆర్ఎస్ఎస్ ఎలా పుట్టింది.. ? ఒక జాతీయ శక్తిగా ఎలా అవతరించింది... ?

P Madhav Kumar

*ఆర్ఎస్ఎస్ సైన్యాన్ని వెనుకుండి ముందుకు నడిపించిన నాయకుడు డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ ఎవరు..?*

*ఆర్ఎస్ఎస్ స్థాపించాలనే లక్ష్యం వెనుకున్న కారణం ఏంటి.. ?*

 *దేశాన్ని పరిరక్షించాలంటే దేశ సంస్కృతిని కాపాడాలని నమ్మిన వ్యక్తి ఆయన. సమాజహితం గురించి ఆలోచించే వ్యక్తులు చిన్న చిన్న గ్రామాల నుంచి దేశమొత్తం తయారుకావాలని ఆకాంక్షించారు. ఇదే లక్ష్యంతో మహా యజ్ఞం మొదలుపెట్టి... ధర్మం కోసం, దేశం కోసం పాటుపడే లక్షలాది మంది స్వయం సేవకులను తయారు చేశారు. ఆయనే డాక్టర్ హెడ్గేవార్. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ ఆయన్ను స్మరించుకుందాం.*🚩🙏


*ఆర్ఎస్ఎస్- ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంధ సంస్థ...*

ఆర్ఎస్ఎస్ .. నలబై లక్షల మంది సేవకులతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంధ సంస్థగా గుర్తింపు పొందింది. ఇదో మత సంస్థ అంటూ కొన్ని రాజకీయ పార్టీలు తరచూ విమర్శలు చేస్తున్నా... వాటన్నింటినీ పక్కన పెట్టి... గొప్ప మానవతా సంస్థగా లక్షలాది మంది మన్ననలు పొందుతోంది ఆరెస్సెస్. హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగిన ఆర్ఎస్ఎస్.. భారతీయ సంస్కృతి, పౌర సమాజ విలువలను సమర్థించే ఆదర్శాలను పోత్సహిస్తూ సాగుతోంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆ సంస్థ అందించిన సేవలు అనన్య సామాన్యం. 1962లో చైనా-భారత్ యుద్ధ సమయంలో వారి సేవలను ఆనాటి ప్రధాని నెహ్రూ సైతం ప్రశంసించారు. అంతే కాదు 1963 రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనాల్సిందిగా ఆర్ఎస్ఎస్‌ను ఆహ్వానించారు. ఆనాటి నుంచి ఈ నాటి వరకు అఖుంటిత సేవా నిరతితో, ధర్మ పరిరక్షణ ధ్యేయంగా సాగిపోతోంది.


ఆ లక్ష్యంలోంచి పుట్టుకొచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్​సంఘ్‌‌..

మనదంతా ఒకే జాతి అన్న భావన ఆర్ఎస్ఎస్‌ మూల సిద్ధాంతాల్లో ఒకటి. ఆర్ఎస్ఎస్ హైందవాన్ని ఒక మతంగా కాకుండా జీవన విధానంగా భావిస్తుంది. అలాంటి ఆలోచనను కలిగించిన యుగద్రష్ట డాక్టర్ జీ. ఆయనే డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్.. ఆరెస్ఎస్ వ్యవస్థాపకులు. 1925లో ఈ సంస్థ పురుడుపోసుకుంది. హిందూ సంస్కృతి హిందుస్తాన్ గుండె చప్పుడు. అందుకే హిందుస్తాన్‌ను పరిరక్షించుకోవాలంటే, హిందూ సంస్కృతిని రక్షించాలి అని భావించారు హెడ్గేవార్. సంఘటితం కావడం వల్లనే శక్తి వస్తుందనీ... హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన ప్రతి ప్రయత్నం చేయడం హిందువుల విధి అని బలంగా నమ్మారు. తాను నమ్మిన సిద్ధాంతాల ఆచరణలో పెట్టేందుకు 1925లో విజయదశమి రోజున నాగ్‌‌పూర్‌‌లో రాష్ట్రీయ స్వయం సేవక్​సంఘ్‌‌ను స్థాపించారు. సామాజిక వ్యవస్థ నిర్మాణానికే ఆయన ఆర్ఎస్ఎస్​ను ప్రారంభించారు. హిందూ సమాజం అనేక కారణాలతో చెల్లాచెదురైందని, హిందూ సమాజ సంఘటన ద్వారా దేశాన్ని శక్తిమంతంగా నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు.


కందకుర్తి గ్రామంతో హెడ్గేవార్ కుటుంబానికి ఉన్న అనుబంధం..

తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న కందకుర్తి గ్రామానికి చెందిన హెడ్గేవార్ కుటుంబం నాగ్‌పూర్‌లో స్థిరపడింది. 1889, ఏప్రిల్ 1న హెడ్గేవార్ నాగ్‌పూర్‌లో జన్మించారు. ఆయనకు 13 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు ప్లేగు వ్యాధితో మరణించారు. దాంతో ఆయన సంరక్షణ బాధ్యతలను సోదరులే తీసుకున్నారు. పూణేలో చదువుకునేప్పుడు బ్రిటిష్ వారి ఆదేశాలను ఉల్లంఘించి వందేమాతరం పాడారు. దాంతో ఆయన్ను పాఠశాల నుంచి బహిష్కరించారు. చిన్నప్పటి నుంచే హెడ్గేవార్‌లో దేశభక్తి ప్రస్ఫుటంగా కనిపించేది. అది  1897 జూన్ 22. విక్టోరియా రాణి 60వ పట్టాభిషేక వార్షికోత్సవం. కానీ ఒక ఎనిమిదేళ్ల బాలుడు మాత్రం చాలా దుఃఖంతో ఉన్నాడు. పాఠశాలలో జరిగిన వేడుకలలో పాల్గొనకుండా ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ బాలుణ్ని చూసి సోదరుడు, ''నీకు మిఠాయిలు ఇవ్వలేదా?'' అని ప్రశ్నిస్తే..మన సంప్రదాయాలను నాశనం చేసిన ఈ బ్రిటీష్ వాళ్ల వేడుకలను మనమెలా జరుపుకోగలం?' అంటూ ఆ బాలుడు ఎదురు ప్రశ్నించాడు. అతడు ఎవరో కాదు హెడ్గేవార్. బీవీ దేశ్ పాండే, ఎస్ఆర్ రామస్వామి రచించిన 'డాక్టర్ హెడ్గేవార్, ద ఎపక్ మేకర్' అన్న పుస్తకంలో ఈ విషయం రాసి ఉంది. ఈ ఘటనతో ఆయనలో హిందూ జాతీయవాదం ఎంత గొప్పగా ఉందో స్పష్టమవుతోంది.

స్వాతంత్య్ర సాధనే లక్ష్యంగా..

మెట్రిక్యులేషన్ అనంతరం వైద్య విద్య కోసం హెడ్గేవార్ కలకత్తాకు వెళ్లారు. 1915లో వైద్య విద్య పూర్తి చేసుకుని నాగ్‌పూర్‌కు తిరిగి వచ్చారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనో, ఆస్పత్రి ప్రారంభించి డబ్బు సంపాదించుకోవాలనో అనుకోలేదు. భారత దేశానికి స్వాతంత్య్రం సాధించడమే ఆయన లక్ష్యం. అయితే ఆయనకు విప్లవకారుల కార్యకలాపాలపై సదభిప్రాయం లేదు. కేవలం కొందరు బ్రిటిష్‌ అధికారులను చంపినంత మాత్రాన బ్రిటీష్ పాలకులు దేశాన్ని వీడిపోరని భావించారు. అందుకే స్వాతంత్ర ఉద్యమకాంక్షను ప్రజల్లో రగిల్చాలనుకున్నారు. 


ఆ తర్వాత మూడేళ్లకే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు..

1916లో లోకమాన్య తిలక్‌కు బ్రిటిష్ ప్రభుత్వం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. స్వాతంత్యం నా జన్మహక్కు అంటూ తిలక్ చేసిన నినాదం ప్రజల్లో ఉత్తేజాన్ని రేకెత్తించింది. ఇదే స్ఫూర్తితో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెడ్గేవార్ తీవ్రమైన ప్రసంగాలను చేయడం ప్రారంభించారు. దాంతో ఆనాటి పాలకులు ఆయన్ను ఏడాది పాటు జైల్లో పెట్టారు. 1922, జూలై 12న జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకే ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. 1936లో సంఘ్ మహిళా విభాగం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రసంగిస్తూ, ప్రజల మద్దతు కూడట్టడం ప్రారంభించారు హెడ్గేవార్. సంఘ్ శాఖలను ప్రాంభించడం కోసం కాశీ, లక్నో తదితర ప్రాంతాలకు తన అనుచరులను పంపారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగానూ హెడ్గేవార్ జైలుకు వెళ్లారు.


ముస్లింల దండయాత్రలతో హిందుస్థాన్‌‌లోకి ఇస్లాం ప్రవేశం..

ఆర్‌ఎస్‌ఎస్ స్థావన వెనుక ఆనాటి సామాజిక పరిస్థితుల ప్రభావం ఉంది. ముస్లింల దండయాత్రలతో ఈ దేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. ముస్లిం రాజులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటూనే పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడ్డారు. తర్వాతి కాలంలో బ్రిటీష్ వారి ప్రవేశంతో భారత దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1920 సంవత్సరంలో ప్రారంభమైన కమ్యూనిజం ద్వారా నక్సలిజం పుట్టుకొచ్చింది. విభజించి పాలించు సూత్రాన్ని అందిపుచ్చుకున్న బ్రిటీష్ వారు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. దేశం మీద మొదట ఆర్యులు దండయాత్ర చేశారని, ఆ తర్వాత దాడులు పరంపర కొనసాగిందని ప్రచారం చేశారు. భారత్ ఒక ఉపఖండం అనీ, ఇది ఒక దేశం కాదు, జాతి కాదనే సిద్ధాంతాన్ని ప్రబలంగా ప్రజల్లో నాటేందుకు ప్రయత్నించారు. ఈ సిద్ధాంతాల ప్రభావానికి లోనై ఉదారవాద మేధావి వర్గం పుట్టుకొచ్చి.. దేశ సమగ్రతకు సవాల్ విసిరింది. వీటన్నింటినీ అధిగమించేందుకు హిందూ సమాజ సంఘటితానికి హెడ్గేవార్ పూనుకున్నారు.


హెడ్గేవార్‌ గొప్పతనం‌ గురించి ప్రణబ్ ముఖర్జి ఏమన్నారంటే.. 

దేశం అంతటా దేశ హితం కోసం ఆలోచించే వ్యవస్థ నిర్మాణం కావాలన్నది హెడ్గేవార్ ఆకాంక్ష.  ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక పునర్ జీవనం వేగంగా జరుగుతోంది. దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు సాగుతున్నాయి. 2018లో ఆర్‌‌ఎస్‌‌ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ... హెడ్గేవార్ నివాసాన్ని ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee in RSS meeting) సందర్శించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో ‘‘భరతమాత మహోన్నత పుత్రుడు డాక్టర్ కేబీ హెడ్గేవార్‌‌కు నివాళులు అర్పించడానికి వచ్చాను’’ అని రాశారు. ఈ ఒక్క మాట చాలు హెడ్గేవార్ మహోన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు.✍️


 🚩 *జైశ్రీరామ్... భారత్ మాతాకీ జై 🇮🇳🙏*

           -Forwarded message.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat