*మహాభారతే* : -
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
≈ శ్రద్ధయా సాధ్యతేధర్మః | మహద్భిర్నార్ధరాశిభిః |
నిష్కించనాస్తుమునయః | శ్రద్ధావంతో దివంగతాః ।
ధర్మార్ధకామమోక్షాణాం| శ్రద్ధాపరమకారణం
పుంసామశ్రద్దధానానాం। నధర్మోనాపి తత్ఫలం | ≈
*ఇతి శ్రద్ధావివేచనం*
≈ *తాత్పర్యం* ≈
*ధర్మము శ్రద్ధచేతనే సాధ్యపడుతుంది*. గొప్ప ధనరాశులవల్ల
సాధింపబడదు. ధన సంపద లేవీలేని మహర్షులు శ్రద్ద గలవారై స్వర్గలోకాన్ని పొందారు. *ధర్మార్ధ కామమోక్షాలనే పురుషార్ధ చతుష్టయ సాధనకు శ్రద్ధయే ముఖ్యకారణము. శ్రద్ధలేని పురుషులకు ధర్మమూ లేదు ధర్మఫలమూలేదు*.
అని మహాభారతవచనం.