🌸పౌరాణిక యుగాలనాటి పుణ్యక్షేత్రం కుంభకోణం సమీపమున వున్న సాక్కోటై. ఇక్కడఅమృతవల్లీ సమేత అమృతకలశనాధుడు అనుగ్రహిస్తున్న పురాతన ఆలయం వున్నది.
ఒకానొక యుగంలో మహా జల ప్రళయం ఏర్పడి విశ్వమంతా అందులో మునిగి పోతుంది అని తన దివ్యదృష్టితో కనిపెట్టిన బ్రహ్మదేవుడు
తన సృష్టిని తిరిగి కొనసాగించడానికి అనుమతిని కోరుతూపరమేశ్వరుని వేడుకున్నాడు.
🌸అప్పుడు పరమేశ్వరుడు భూలోకంలోని వివిధ పవిత్ర స్ధలాల మట్టినీ తెప్పించి దానిని ఒక కలశంగా మార్చి దానిలో దేవామృతాన్ని నింపి ఒక దివ్యా అమృత కలశాన్ని
సృష్టించాడు. ఆ అమృత కలశంలో శృతి శాస్త్ర పురాణాలను సకల జీవరాశుల ప్రాణ విత్తనాలను భద్రపరిచాడు. ఆ కలశాన్ని మామిడాకులను ధర్భలతో కప్పిపెట్టి దానిని కొబ్బరికాయ , జంధ్యం, పూలమాలలతో అలంకరించి మేరుపర్వతం మీదకు తీసుకుని వెళ్ళి పూజించమని పరమేశ్వరుడు
బ్రహ్మదేవుని ఆదేశించాడు.
🌸బ్రహ్మదేవుడు ఆవిధంగానే చేశాడు. తర్వాత ఏర్పడిన జల ప్రళయంలో అమృతకలశం మేరు పర్వతం పైనుండి దక్షిణ దిశకి కొట్టుకునిపోయి ఒకచోట ఒడ్డుకు చేరుకుంది. ఆ సమయంలో పరమశివుడు కిరాతకుని రూపంలో వచ్చి తన బాణంతో ఆఅమృతకలశాన్ని పగులగొట్టాడు.ఆ కలశం మూడు భాగాలుగా పగిలింది.
🌸కలశంలోని మధ్యభాగం పగిలి పడి ఒక లింగమైన ప్రాంతంకుంభకోణం. దానికి సమీపమున వున్న సాక్కోట్టై
అని పిలువబడే తిరుక్కలయనల్లూరు లోఅమృతవల్లీసమేతఅమృతకలశనాధుని ఆలయం వున్నది.
కలశమును కప్పివుంచిన మామిడి ఆకులు, ధర్భలు ఈ ఆలయంలోని స్ధల వృక్షమైన జమ్మిచెట్టుగా మారినవి.
కలశం పై భాగం కుంభకోణం సమీపమున వున్న కుడవాసల్ కోణేశ్వరర్ ఆలయం .
🌸కలశం అడుగు భాగం భగవంతుడు చేసిన లింగంగా కుంభకోణంలో పూజలు అందుకుంటున్నది. అదే ఆదికుంభేశ్వరుని ఆలయంలో.
సాక్కోట్టై ఈశ్వరునిబ్రహ్మదేవాది దేవతలు అర్చించి అనుగ్రహంపొందారు.
ఈ స్థలంలోనే పార్వతీదేవి అమృతవల్లీ దేవి రూపంలో ఈశ్వరుని కోసం కఠోర తపస్సు చేసి ఈశ్వరుని వివాహం చేసుకున్నదని ఐహీకం.