శ్రీ వేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే
వేగ వేగ మేలుకొను వెలిఛాయ లమరే!
సురలు గంధర్వ కిన్నెరులెల్ల గూడి
తంబురు శృతులను జేర్చి సరవిగాను
అరుణోదయము దెలిసి హరిహరి యనుచు
నరహరి నిన్ను దలచెదరు హంసస్వరూప!
అల చిలుక పలుకులకు నధరబింబము బోలె
తెలివి దిక్కుల మిగుల తేటబారే
అలరు కుచగిరుల నుదయాస్త్రాదిపై వెలిగె
మలినములు తొలగ నిదొ మంచు తెరవిచ్చే!
తళుకొత్త నిందిరా తాటంకర విరుచుల
వెలిగన్ను తామరలు వికసింపగాను
అలర్మేల్ మంగ శ్రీ వేంకటాచలరమణ
చెలువు మీరగను ముఖకళలు గనవచ్చె!🙏