ముద్దుగారేయశోదముంగిటిముత్యము వీఁడు - శ్రీ అన్నమాచార్య సంకీర్తన

P Madhav Kumar



ముద్దుగారేయశోదముంగిటిముత్యము వీఁడు
తిద్దరానిమహిమలదేవకిసుతుఁడు                   // పల్లవి //

అంత నింత గొల్లెతలఅరచేతిమాణిక్యము
పంతమాడేకంసునిపాలివజ్రము
కాంతుల మూఁడులో కాలగరుడపచ్చఁబూస
చెంతల మాలోనున్న చిన్నికృష్ణుఁడు              // ముద్దు //

రతికేలి రుక్మిణికి రంగుమోవిపగడము
మితి గోవర్థనపుగో మేధికము
సతమైన శంఖుచక్రాలసందుల వైఢూర్యము
గతియై మమ్ముఁగాచేకమలాక్షుఁడు              // ముద్దు //

కాళింగునితలలపైఁ గప్పినపుష్యరాగము
యేలేటిశ్రీవేంకటాద్రియింద్రనీలము
పాలజలనిధిలోనఁ బాయనిదివ్యరత్నము
బాలునివలెఁ దిరిగీఁ బద్మనాభుఁడు             // ముద్దు //

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat