*🌹మంగళగౌరీ వ్రతము విధానము చరిత్ర🌹*

P Madhav Kumar

శ్రావణమాసమంలో మంగళవారం ఈ వ్రతము చేసి మంగళగౌరిని పూజించవలెను. ఈ వ్రతము వివాహానంతరము స్త్రీలు ఐదు సంవత్సరములు ఈ వ్రతమును చేయవలెను. వివాహమైన మొదటి సంవత్సరము పుట్టినింటియందును, తదుపరి నాలుగు సంవత్సరములు భర్త యింటిలో ఈ వ్రతమును చేసుకోవాలి.


ఈ వ్రతము కాశీనగరమందు విశేషముగ జరుగును. ఐదుసంవత్సరములు ఈవ్రతమపూర్తియైన తరువాత ఉద్యాపనచేసుకొనవలెను. లేనిచో ఈ వ్రతము నిశ్ఫలమగును. పదిసంవత్సరములో ఒక మంగళవారము ఉద్యాపన తీర్చుకొన వలెను.


🌿🌼🌺 #విధానము 🌺🌼🌿


ఆచార్యునితో సర్వతోభద్ర మండలమును నిర్మింపజేసి అందులో కలశమును స్థాపించవలెను. కలశముపై మంగళగౌరి స్వర్ణ ప్రతిమను స్థాపించవలెను. గణేశాది దేవతలను పూజించి పదహారువత్తుల దీపముతో హారతి నీయవలెను. మంగళగౌరికి సమస్త సౌభాగ్య ద్రవ్యములను సమర్పించవలెను.


మరుసటి దినము యజ్ఞముచేయించి పదహారుమంది బ్రాహ్మణ దంపతులకు భోజనము పెట్టి నూతన వస్త్రములను సౌభాగ్యద్రవ్యములను దక్షిణలతోసహా దానమీయవలెను. అత్తగారి పాదములకు నమస్కారముచేసి ఆమెకు వెండిపళ్ళెములో పదహారు లడ్డూలను నగలను వస్త్రములను సమర్పించవలెను.


అందరికి భోజనములు పెట్టి తాము భుజించవలెను. ఈవిధముగ వ్రతము చేసిన వైధవ్యము గలుగదు. సౌభాగ్యవతులైయుందురు.


నిత్యకర్మలు ముగించి తర్వాత ప్రాతఃకాలమందే స్నానముచేసి నూతన వస్త్రములు ధరించి(లేకున్నశుద్దమైన వస్త్రముగాని) కుంకుమతిలకము పెట్టుకొని పూర్వాభి ముఖముతోగాని (తూర్పు) ఉత్తరాభిముఖముతోగాని ఆసనమున ఆసీనులైసంకల్పము చేసుకొనవలెను.


"మమ పుత్రపౌత్ర సౌభాగ్యవృద్ధయే శ్రీ మంగలా గౌరీ ప్రీత్యర్థం

పంచవర్ష పర్యన్తం మంగలాగౌరీ వ్రతమహం కరిష్యే"


అని ఈ విధముగ సంకల్పముచేసి అమ్మవారిని ప్రతిష్టించవలెను. పదహారు(16) ముఖములుగల ప్రమిదను చేసి, పదహారు వత్తులను వేసి నేతితో దీపములను వెలిగించవలెను. తర్వాత పవిత్రీకరణ స్వస్తివాచన గణేశపూజాదులు చేసి, కలశస్థాపనపూజ నవగ్రహపూజ షోడశమాతృకాపూజలు కూడ విధిగా ఆచరించ వలెను.


తర్వాత శ్రీమంగళాగౌర్యై నమః అను మంత్రముతో మంగళగౌరికి షోడశోపచారపూజ చేయవలెను. పూజకు పదహారు రకముల పుష్పములు, పదహారుమాలలు పదహారువృక్షముల (రకముల) ఆకులు (పత్రి) పదహారుదూర్వాదళములు పదహారుదతూర పత్రములు, పదహారురకముల ధాన్యము, పదహారుతమల పాకులు వక్కలు యాలుకలు జీరా ధనియాలు (లేకకొత్తిమీర) కూడ సమర్పించవలెను.


నమస్కారముచేసి అర్ఘ్యము సమర్పించవలెను. వ్రతము చేసే స్త్రీ రాగిపళ్ళెములో జలము గంధము అక్షతలు, పుష్పములు, ఫలములు దక్షిణ నారీఫలమును ఉంచి రాగిపాత్రను కుడిచేతితో పట్టుకొని అర్ఘ్యము సమర్పించవలెను.


తర్వాత సౌభాగ్య ద్రవ్యములుగల రాగిపాత్రలో లడూలు ఫలములు, వస్త్రమునుంచి బ్రాహ్మణునకు వాయన దానము నీయవలెను. ఆ తరువాత వ్రతము చేసిన స్త్రీ తన అత్తగారి పాదములకు నమస్కారముచేసి ఆమెకు పదహారులడూలను వాయన మీయవలెను.


మంగళగౌరికి పదహారుముఖములుగల దీపములతో హారతినీయవలెను. ఆరోజరాత్రి జాగరణచేసి ప్రాతఃకాలమందే గౌరిని చెరువునందుగాని నదియందుగాని విసర్జించవలెను.


🌸🌺🌸 ఈ వ్రత కథ: 🌸🌺🌸


కుండిన నగరమందు ధర్మపాలుడను ఒక ధనవంతుడుండెను. ఇతని భార్య సాధ్వి పతివ్రత. వీరికి పుత్రులులేరు. అన్నిసంపదలు కలిగి యున్నను ఈ దంపతులు సంతానము కొరకు బాధపడుతూ ఉన్నారు. ప్రతిరోజు రుద్రాక్షమాలాధారుడైన ఒక భిక్షువు వస్తుండెవాడు.


ఆ ధనవంతుని ఇట్లాలోచించుకొనెను. ఈ భిక్షువునకు కొంత ధనము దానఇస్తే ఆ ఫలముతో సంతానము కలుగునేమోయని తలచి అనుమతితో వానిజోలియందు బంగారమును వేసెను. భిక్షువు అపరిగ్రహవ్రతధారుడగుటచే, తన వ్రతమునకు భంగము వాటిల్లినదని గ్రహించి, వారికి "సంతానము కలుగకుండుగాక యని శపించెను".


ఆ దంపతులు అతిప్రాధేయపడి ప్రార్జించగా అల్పాయువు గల నొకపుత్రుడు కలుగునని, అతనిని పదునారవ సంవత్సరములో సర్పము కాటు వేయగా మరణించునని శపించెను.


ఐనా ఆ బాలుని వివాహము చేసుకొను బాలిక తల్లి మంగళగౌరీవ్రతము చేసినదైయున్న ఆ వ్రతప్రభావమున కలిగిన కన్య విధవ కాదు. అప్పడా బాలునకు శతాయువు గలుగును. ఇలా కాకుంటే అతడు పదునారవ సంవత్సరములో సర్పము కాటుతో మరణించును అనిచెప్పెను. వారు ఆ భిక్షువు చెప్పినట్లే చేసారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat