Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఆకలి అన్నింటి కంటే భయంకరమైనది


🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*_ఆదౌ రూప వినాశని కృశ కరీ కామాంకురచ్ఛేదనీ_*|

*_పుత్రామిత్ర కలత్ర భేదనకరీ గర్వాంకుర చ్చేదినీ_*||

*_కామం మందకరీ తప: క్షయకరి ధర్మస్య నిర్మూలనీ_*|

*_సా మాం సంప్రతి సర్వరోగ జననీ ప్రాణాపహంత్రీ క్షుధా_*||


𝕝𝕝 *భావం* 𝕝𝕝


ఆకలి అనేది మనిషి అందాన్ని కృశింప చేస్తుంది, సన్నగా కళా హీనంగా చేస్తుంది, లైంగిక కోరికను తగ్గిస్తుంది , పుత్రుణ్ణి కూడా శత్రువుగా చేస్తుంది,మిత్రులను దూరం చేస్తుంది మరియు  భార్యతో విభేదాలు సృష్టిస్తుంది... మరియు కుటుంబ సభ్యులను విచ్ఛిన్నం చేస్తుంది, సహనాన్ని తగ్గిస్తుంది  మరియు ధర్మమార్గం ను దగ్గరకు రాకుండా చేస్తుంది .... అన్ని రకాల అనారోగ్యాలకు మూలకారణంగా మారుతుంది ఇది చివరికి  వ్యక్తి మరణానికి దారి తీస్తుంది... 

_*ఆకలి అన్నింటి కంటే భయంకరమైనది*....._

📢 Follow