తిరుమలని వ్యాగడం అని పిలిచేవారు.

P Madhav Kumar

 తమిళ గ్రంథమైన తుల్కభ్యం ప్రకారం తిరుమలని వ్యాగడం అని పిలిచేవారు. అంటే తమిళ దేశానికి ఉత్తర సరిహద్దు అని అర్ధం. అలా వేంగడం అనేది వెంకటంగా మారిందని చెబుతారు. ఈ గ్రంథం 2200 సంవత్సరాల క్రితం నాటిది.


1944 ఏప్రిల్‌ 10న బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో తిరుమల కొండకు మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైంది. ఆ రోడ్ కి రూపకల్పన చేసింది ప్రముఖ భారతీయ ఇంజనీరు #మోక్షగుండం_విశ్వేశ్వరయ్య గారు.


తిరుమల శ్రీవారి ఆనంద నిలయానికి సుమారు 12 వందల ఏళ్ళకుపైగా చరిత్ర ఉంది. అయితే క్రీ.శ 839 లో పల్లవ రాజైన విజయదంతి విక్రమ వర్మ ఈ గోపురానికి పూత వేయించాడు. ఈ బంగారు పూత వేసే ప్రక్రియ దాదాపుగా 430 సంవత్సరాలు పట్టిందని చెబుతారు.


బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో 1801 నుండి 1843 వరకు దాదాపుగా 43 ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన అనేది కొనసాగింది.


TTD పాలనకు ఈస్టిండియా కంపెనీ దిట్టం,కైంకర్యపట్టీ, బ్రూస్ కోడ్,సవాల్- ఇ-జవాబు,పైమేయిషి ఖాతా అను ఐదు మార్గదర్శకాలు రూపొందించారు.


అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించింది.తిరుమలలో ముందు తీపి ప్రసాదమైన బూందీని విక్రయించగా అదియే 1940 లో తిరుపతి లడ్డుగా స్థిరపడింది.


1821 జూలై 25న శ్రీవారి హుండీ ఏర్పాటైంది.

ప్రస్తుతం శ్రీవారి ఒకరోజు సగటు ఆదాయం 

కోటిన్నరకు పైగా ఉంది.


తిరుమల శ్రీవారి విగ్రహం పైన 11 శతాబ్దంలో శంకు, చక్రాలు లేవని ఆ విగ్రహం శివుడు,పార్వతీదేవి, కుమారస్వామి విగ్రహం కావచ్చనే భిన్నవాదాలు వినిపించాయి.ఆ సమయంలో #రామానుజాచార్యులు వారు తిరుమల మూలవిరాట్టు #శ్రీమహావిష్ణుదే అని నిరూపించారు.


దాదాపు శ్రీవారి ఆలయంలో 100 సంవత్సరాల నుండి పిల్లి ఉంటుందట.ఉదయం 3 గంటల సమయంలో అర్చకులు బంగారు వాకిలి తలుపు తెరవగా వారితో పాటు రోజు పిల్లి కూడా బంగారు వాకిలిలోకి వెళుతుందట.ఆశ్చర్యంగా ఈ పిల్లి ఆయుర్దాయం 

తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి 

శ్రీ వారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉంటుందట.


తిరుమలలో 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాసంప్రోక్ష సందర్భంగా వైదిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతారు.మహా సంప్రోక్షణలో ముఖ్యమైనవి రెండు. మొదటిది స్వామివారి ప్రాణశక్తిని ద్విగుణీకృతం చేయడం,రెండవది గర్భగుడిలో మరమత్తులు నిర్వహించడం.


వేంకటేశ్వరస్వామి తన రెండవ అడుగుని తిరుమలలో ఉన్న శిలాతోరణం వద్ద వేసాడని పురాణం. అయితే శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఇవి 250 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సహజ శిలాతోరణం ఏర్పడింది. ప్రపంచం మొత్తంలో సహజసిద్ధంగా ఏర్పడిన మూడు శిలాతోరణాలలో తిరుపతి శిలాతోరణం ఒకటి.


ఆశ్చర్యంగా ఈ శిలాతోరణం పైన శంఖం, చక్రం, పాదాలు, గరుడ పక్షి వంటివి చాలా స్పష్టంగా కనబడతాయి. వీటిని ఎవరు చెక్కలేదు.


#గోవిందాహరిగోవిందా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat