నాలుగో శతాబ్దంలోని దేవాలయం ఇడగుంజి గణపతి క్షేత్రం...!!

P Madhav Kumar

విద్యా కారకుడు, విఘ్నహర్త్ర, విఘ్నకర్త ఐన గణపతి క్షేత్రము లెన్నెన్నో ....

🍃🍀🙂🌹🍃🍀🍃🙂💚🍀🍃🌹💚🌹🍃🍃🙂

కుంజవన అనే ఇడగుంజి గణపతి క్షేత్రం అష్టవినాయక క్షేత్రాలలో ఒకటి. ఇడగుంజి గణపతి కలియుగ కల్పతరువు. ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర సమీపంలోని ఇడగుంజిలోని వినాయకుడు అత్యంత శక్తివంతమైన దేవుడిగా భక్తుల భావిస్తారు. 🌹🙂🍃🍀


పురాణ ప్రసిద్ధి చెందిన ఈ విగ్రహానికి నాలుగో శతాబ్దంలో దేవాలయం నిర్మించారు. మన దేశంలో వెలసిన గణపతి ఆలయాలలో ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ప్రముఖమైనది. ఈ గ్రామం ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపం లోనే ఉంది. శరావతి నది అరేబియా సముద్రంలో కలిసేచోట ఈ ఆలయం ఉంది.🍀🌹🙂🍃


ఈ ఆలయంలోని గణపతిని ద్విభుజాలు కలిగి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి.

వినాయకుడు బ్రహ్మచారి. కానీ 

ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. 

అందుకే కొందరు భక్తులు కర్నాటక లోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు.🍀🌹🍃


కర్నాటకలోని బంధి అనే జాతివారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చు కోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాలవారు ఈ ఆలయానికి చేరుకుంటారు.అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి  వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు🙂🌹🍀🍃


ఈ విధమైన ఆచారాలు కలగలిసిన 

ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు.

ఇడగుంజి భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఆరు వినాయకుడు ఆలయాలో ఒకటి. అవి కాసర్గోడ్, మంగుళూరు, అనెగుడ్డే, కుండపుర, ఇడగుంజి మరియు గోకర్ణ 🙂🌹🍀


ఈ ఆలయంలో మూల విరాట్టైన వినాయకుడు చూడముచ్చటగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. 🙂🌹🍀

ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం. ఇష్టార్థములను తీర్చే వరప్రదాయకుడు.


*ఇక్కడి ప్రత్యేకత*🍃🙂🌹


ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలోని గణపతికి ఇక్కడ రెండు దంతాలు ఉంటాయి. అంతే కాదు అన్ని చోట్ల గణపతి కడుపుకు నాగుపాము చుట్టుకుని ఉంటుంది.🍀🙂🌹

కానీ, ఇక్కడ ఉండదు. అలాగే నాగ యజ్ఞోపవీతం ధరించి ఉండటం పలు విగ్రహాలకు గమనించి ఉంటాము. అలాగే ఇట గణపతి ద్వి భజాలతో ఉంటారు. రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కన బడుతాడు. ప్రపంచంలోనే ద్విభుజ గణపతి దేవుడు ఇక్కడే.🍀🙂🌹


*పురాణ కథనం ప్రకారం*🍀🙂🌹🙏


పురాణ కథనం ప్రకారం మహా భారత రచనకు గణపతి ఆగని గంటం కోసం తన దంతాన్నే ఉపయోగించారని ప్రతీతి. అంటే ఇక్కడి గణపతి అంతకు పూర్వమే ఉన్నారన్నమాట. ఈ ఆలయం కూడా సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది.

ద్విభుజ గణపతి స్వామి ఆలయం శరావతి నది ఒడ్డున ఉన్నది. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని తెలియుచున్నది. ఈ ఆలయంలోని నల్ల చలవరాతి గణేష విగ్రం నిలబడిన ఆకారంలో ఉంటుంది

దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట చేసినట్లుగా మరియు అదేవిధంగా, ఈ ఆలయ అతి ప్రాచీనమైన నిర్మాణ శైలికి కూడా భక్తులు మరియు యాత్రికులు యొక్క ప్రగాఢ విశ్వాసం.🙂🌹🙏


 ప్రతి సంవత్సరం 10 లక్షల మంది భక్తులు స్వామిని దర్శిస్తారని అంచనా. ఇక్కడ స్వామిని గరికతో అర్చిస్తారు🙂🌹🙏.


మురుడేశ్వర (19km), అప్సరకొండ (12km), గోకర్ణ (68km), హొన్నావర (15km) and బత్కల్ (30km) వంటి మరికొన్ని బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలు కూడా ఇడగుంజి చుట్టుప్రకల చూడదగ్గ ప్రదేశాలున్నాయి.🙂🌹🙏


ఆలయ సమయాలు ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ..🌹🙂🍀🙏


వాహనాలు వచ్చే వారికి ఇబ్బంది ఉండదు..బస్ లో వచ్చేవారికి ఈ ఆలయం నుండీ ఆత్మలింగలలో Shri Gunavanteshwar Temple ఆలయం చాలా దగ్గర కేవలం 4 km మీరు బస్ లు కోసం వేచిఉండకుండా ఇడుగంజి cross నుండి ఆటో తీసుకోండి ..200 తీసుకుంటారు..కానీ అక్కడ ఆలయాలు time తో చాలా సమస్య🍀🙂🌹🙏


మీరు ఉదయం 8 నుంచి 12 వరకూ మధ్యాహ్నం 5 నుండి 8 వరకు ఇవి ఆత్మ లింగాల దర్శన సమయాలు...

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat