*🌿🌼🙏 శ్రీ దేవసేనా దేవిని సుబ్రహ్మణ్యుడు వివాహమాడిన క్షేత్రం తిరుపరన్‌కున్రమ్ లో కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యుడు, దేవసేనా దేవి నిజరూప దర్శనం🙏🌼🌿*
🌿🌼🙏సుబ్రహ్మణ్యుని ఆరు దివ్య క్షేత్రాలు🙏🌼🌿
తిరుత్తణి, పళముదిర్‌చోళై, తిరుపరన్‌కున్రమ్
🌿🌼🙏సుబ్రహ్మణ్యుని ఆరు దివ్య క్షేత్రాలు🙏🌼🌿 ఆరుపడైవీడు🙏🌼🌿తిరుచందూర్, స్వామిమలై, పళని, తిరుత్తణి, పళముదిర్‌చోళై, తిరుపరన్‌కున్రమ్🙏🌼🌿
🌿🌼🙏శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రమణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యముంది. తండ్రికే జ్ఞానభోద చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలలో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే ఆలయాలు అధికంగా ఉండడం విశేషం. 🙏🌼🌿
🌿🌼🙏ఆంధ్రప్రదేశ్‌లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖ స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.🙏🌼🌿
🌿🌼🙏తిరుచందూర్ 🙏🌼🌿
🌿🌼🙏సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్‌లో ఉంది. సరన్ అనే రాక్షసరాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్‌లో కొలువై నిలిచారట. తిరుచందూర్‌లోని సుబ్రమణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం. 🙏🌼🌿
🌿🌼🙏స్వామిమలై🙏🌼🌿
స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశం చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.🙏🌼🌿
🌿🌼🙏పళని 🙏🌼🌿
🌿🌼🙏ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి ఉందో తమిళనాడులో పళని క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళనిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 🙏🌼
🌿🌼🙏తిరుత్తణి 🙏🌼🌿
🌿🌼🙏తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.🙏🌼🌿
🌿🌼🙏పళముదిర్‌చోళై 🙏🌼🌿
🌿🌼🙏దట్టమైన అడవి ప్రాతంలో వెళసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. 🙏🌼🌿
🌿🌼🙏తిరుపరన్‌కున్రమ్ 🙏🌼🌿
🌿🌼🙏తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్‌కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరు భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్‌కున్రమ్🙏🌼🌿
🙏🌼🌿ఓం శం శరవణభవ
🌺 _వల్లీసమేతుడు - తిరుత్తణి_ 🌺
కవిమలై, కల్లారగిరి, తణికాచలం, నీలాద్రి, 'నీలోత్పలగిరి' అనే పేర్లతో కూడా తిరుత్తణిని పిలుస్తుంటారు. తిరుత్తణి సమీపంలోని వల్లిమలై అనే కొండమీద “శ్రీవల్లి” అనే ఆమె సుబ్రహ్మణ్యస్వామి తన భర్త కావాలని కోరి తపస్సు చేసింది. వారి వివాహం ఇక్కడే జరిగింది.
తిరుత్తణి క్షేత్రంలో ఆలయం 360 మెట్లున్న కొండమీద ఉంది. ఘాట్ రోడ్ ఉంది. మూడు ప్రాకారాలు, విశాలమైన మండపాలు కలిగిన ఆలయంలోని ప్రధానగార్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు ద్విభుజాలను కలిగి, జ్ఞానదండం, కటిహస్తములతో భక్తులపై కరుణాకటాక్షాలను ప్రసరింపజేస్తూ దర్శనమిస్తారు. స్వామివారికి ఇరువైపులా వున్న ప్రత్యేక గర్భాలయాల్లో దేవేరులైన శ్రీవల్లీ, దేవసేనలు వున్నారు. మూలవిరాట్టును నిశితంగా పరిశీలిస్తే స్వామివారి వక్షస్థలంపై గుండ్రటి ప్రదేశంపైన చందనం అద్దబడి వుంటుంది. తారకాసురుడు దొంగిలించిన విష్ణుమూర్తి శంఖు, చక్రాలను సుబ్రహ్మణ్యస్వామి తిరిగి తీసుకువచ్చాడు.
🌺 _కుమార తపోభూమి - పఝముదిల్ సోలై_ 🌺
పళముదిల్ శులై, అఝగర్ కోయిల్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. పూర్వం 'అవ్వయ్యార్' అనే శ్రీసుబ్రహ్మణ్యస్వామి భక్తురాలికి సుబ్రహ్మణ్యస్వామి పళ్ళను, జ్ఞానాన్ని ప్రసాదించిన క్షేత్రమిది. కుమారస్వామి ఇక్కడి వైఫై నదీతీరంలో తపస్సు చేసుకుంటూ తన దేవేరులిద్దరితో ఇక్కడే నివాసమున్నాడని స్థలపురాణం చెబుతోంది. అటవీ ప్రాంతంలో ఆలయం వుంది. చిన్న ఆలయం. ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అందమైన రూపంతో చతుర్భుజుడుగా ఇరు దేవేరులతో కొలువుదీరి వున్నాడు. స్థానికులు స్వామి వారిని కల్వఘర్ అని పిలుస్తారు. స్వామివారు ధరించిన ఆయుధం పాషాణం తో చేసివుండడం విశేషం. ఈ స్వామి వారిని దర్శించి పూజించడం వల్ల విద్య విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి.
_*ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహీ తన్నో షణ్ముఖ: ప్రచోదయాత్*_