నల్ల నల్లని బాలుడు
గోపాలుడు గోవిందుడు
బృందావన దేవుడు
అందరికీ ఆరాధ్యుడు ::: న:::
ఆపదలు ఆపే వాడయా
ఆపద్బా0ధవుడే నయా
బృందావన ధామంలో
కొలువై వున్న వాడయా ::: న:::
చందన గంధపు ఛాయలా
మెరిసే దైవము తానయా చం.
అందరి కన్నుల పండుగై
శ్రీ కృష్ణుడు ఇల వెలిశాడయా ::: న:::
దేవకి నోముల పంటగా
నందుని యింటికి పండుగై .దేవ.
దేవత లందరి దేవుడై
బృందావనమున వెలిశాడు ::: న:::
రేపల్లెకు తను బాలుడై
ఆ పల్లెలో గోపాలుడై. రే.
యమునా విహారి దైవమై
బృందావనమున వెలిశాడు ::: న:::
బృందావన సంచారుడై
రాధా మానస చోరుడై బృ0
వేణువు నూదీ నాదమై
బృందావనమున వెలిశాడు
నల్ల నల్లని బాలుడు
గోపాలుడు గోవిందుడు
బృందావన దేవుడూ
అందరికీ ఆరాధ్యుడు
అందరికీ ఆరాధ్యుడు
అందరికీ ఆరాధ్యుడు.
లిరిక్స్ పంపిన వారు:
పేరు: కమలమ్మ
ప్రాంతం: మార్కాపురం
Cell: +91 6281 952 997
విడియో లింక్: