⚜️ దీపారాధన - ఆభరణ దర్శనం ⚜️
మకర సంక్రాంతి దినమున దర్శనము అనునది తిరువాభరణము అలంకరించిన పిదప జరుగును. ఇది మిక్కిలి ఆనందప్రదము. ఐశ్వర్యప్రదము అయిన దర్శనము. కనుక అందరూ తిరువాభరణము అలంకరించిన పిదప సన్నిధానమున స్వామివారిని తిరువాభరణ సేవలో దర్శించవలెనని తొక్కిసలాడుచూ వేచియుందురు. లక్షలాది సంఖ్యలోనున్న భక్తాదుల శరణఘోషలు , లెక్కలేనన్ని ఘంటానాదములు , క్షణమైననూ
వ్యవధిలేక మ్రోగు టపాకాయల ఘోషలన్నియూ కలసి అచ్చట గూడియున్న వారికి భక్తి పారవశ్యముతో గూడిన రోమాంచనము కలుగును. దీపారాధన ఉత్సవము ఒక గంటసేపు జరుగును. అంతవరకు అచ్చటకూడియున్న భక్తాదుల హృదయము మధురానందముచే అద్వితీయానుభూతితో ఓలలాడుచుండునన్నది అనుభవైక వేద్యమే కాని , వర్ణించి వ్రాయుటకు అందనిది , వీలు కానిదీను.
🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏