🌷ఈ మందిరం ఛత్తీస్ ఘడ్ లోని రతన్ పూర్ లో ఉంది.
🌸ఇందుకు సంబంధించిన విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ అరుదైన ఆలయం గురించి
హనుమంతున్ని స్త్రీ రూపంలో పూజించే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో రతన్ పూర్ జిల్లాలో గిర్జబంద్ లోని ఈ ఆలయంలో హనుమంతున్ని దేవత రూపంలో పూజిస్తున్నారు.
🌸ఇక్కడ పూజలు నిర్వహించే భక్తులకు ఈ ఆలయంపై అపారమైన నమ్మకం ఉంది. ఈ ఆలయంలో దేవత రూపంలో ఉన్న హనుమంతున్ని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని విశ్వసిస్తారు.
ఇక్కడ రాముడు, సీతాదేవిలను తన భుజాలపై మోస్తున్నట్లు ఉండే ఆంజనేయుని విగ్రహాన్ని కూడా చూడవచ్చు.
🌷ఈ విగ్రహం ప్రతిష్టాపన వెనుక ఉన్న కథ
🌸ఈ దేవాలయంలో హనుమంతుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండటం వెనుక పురాణ కథనం ఉంది. ఇక్కడ ఒకానొక కాలంలో పృథ్వీ దేవరాజ్ అనే రాజు ఉండేవాడు. అతను హనుమంతుడికి మిక్కిలి భక్తుడు. ఇదిలా ఉండగా ఆ రాజు కుష్టు రోగం బారిన పడుతాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే రోజు రాత్రి హనుమంతుడు రాజు కలలో కనబడి తనకు మందిరం నిర్మించాలని చెబుతాడు.
🌸దీంతో రాజు తన ఆలోచనను విరమించుకుని హనుమంతుడికి దేవాలయం నిర్మించాలని, అందుకు ఒక శిల్పం చెక్కమని ఒక శిల్పికి చెబుతాడు.
కానీ విగ్రహ ప్రతిష్టాపన ముందు రోజు రాత్రి రాజుకు మరల హనుమంతుడు స్వప్న దర్శనం ఇచ్చి నా విగ్రహం ఇక్కడికి దగ్గర్లో ఉన్న మహామాయ అనే కొలనులో ఉందని దానిని తీసి ప్రతిష్టించాలని రాజును ఆదేశిస్తాడు. దీంతో రాజు ఆ సరస్సు వద్దకు వెళ్లి సేవకులతో విగ్రహాన్ని వెలికితీయిస్తాడు. అయితే ఆ విగ్రహానికి ముక్కుపుడక ఉండటమే కాకుండా చూడటానికి స్త్రీ మూర్తి వలే ఉంటుంది. అయినా హనుమంతుడి ఆదేశాను సారం ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి దేవాలయంలో ప్రతిష్టింపజేస్తారు.
🌷దక్షిణ ముఖంగా ఇక్కడ హనుమంతుడు
🪷 ఈ ఆలయంలో హనుమంతుడు దక్షిణ ముఖంగా ఉంటాడు. ఆయన కుడి వైపు శ్రీ రాముడు, ఎడమ వైపు లక్ష్మణుడు ఉంటాడు. హనుమంతుడి కాలి కింద ఇద్దరు రాక్షసులు ఉంటారు. ఇక ఈ విగ్రహం ప్రతిష్టించిన తర్వాత రాజు కుష్టు రోగం పూర్తిగా సమిసి పోయింది. అంతే కాకుండా తనను దర్శించుకున్న వారికి చర్మరోగాలు పూర్తిగా నయమవుతాయని కూడా హనుమంతుడు రాజుకు తెలిపినట్లు ఇక్కడి వారు చెబుతారు. అంతే కాకుండా ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. స్త్రీ రూపంలో ఉండే ఈ హనుమంతుడు వివాహ సమస్యలను పరిష్కరించి, సంతనం కోరే వారికి సంతానం ప్రసాదిస్తాడు.
🌸ఇలా ఎందరో భక్తులకు అనుభవపూర్వకంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ దేవాలయానికి దగ్గర్లోనే కాలభైరవ మందిరం ఉంది. ఈ దేవాలయంలో కాలభైరవ విగ్రహం 9 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంతే కాకుండా అతి పురాతన లక్ష్మి దేవి మందిరం కూడా ఇక్కడకు దగ్గర్లోనే ఉంది.