🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌸తిరుమల శ్రీనివాసుని వడ్డికాసులవాడు అని, చేసిన పాపాలను వడ్డీతో సహా స్వీకరిస్తాడని, శ్రీవారు హుండీ ధనాన్ని మొత్తం ఇంకా వడ్డీ రూపంలోనే జమచేస్తున్నాడనీ,
🌿ఇంకనూ వడ్డీకూడా తీర్చలేకపోతున్నాడని, కలియుగాంతానికి అసలు వడ్డీతో కలిపి కుబేరునికి ఋణాన్ని తీరుస్తాడనీ మనందరికీ తెలిసిన విషయమే!
🌸అసలు శ్రీనివాసుడు కుబేరుని వద్ద తీసుకున్న అపు ఎంత? ఎప్పుడు ? ఎందుకు తీసుకున్నాడు?ఎలా తీరుస్తానన్నాడు?
ఇందుకు సాక్ష్యం ఏమైనా ఉందా ?
🌿దీని గురించి భవిష్యోత్తరపురాణం 11 వ అధ్యాయం లో వివరించబడింది.
🌷ఋణ గ్రాహీ శ్రీనివాసో ధనదాయీ ధనేశ్వర:
🌸ఆత్మకార్య నిమిత్తం తు కళ్యాణార్ధం కలౌయుగే ౹ వైశాఖే శుక్లసప్తమ్యాం విలంబే చైవ వత్సరే ౹౹
🌿నిష్కాణాం రామముద్రాణం లక్షాణి చ చతుర్దశ ౹ ద్రవ్యం దత్తం ధనేశేన వృద్ధి గ్రహణ కారణాత్ ౹౹
🌸సవృధ్ధి దిత్సతామూలం స్వీకృతం చక్రపాణి నా ౹ వివాహ వర్షమారభ్య సహస్రాంతే పునః౹౹
🌿దాతవ్యం యక్షరాజాయ శ్రీనివాసేన శార్ఞిణా ౹ ఏకసాక్షీ చతుర్వక్త్రో ద్వితీయస్తు త్రిలోచన:౹౹
🌸తృతీయో౽శ్వత్థరాజాస్తు వేత్తి సర్వమిదం ధృఢం౹ ఇత్యేతదృణపత్రస్తు శ్రీనివాసో౽ లిఖిత్స్వయం౹౹
🌹భవిష్యోత్తర పురాణం 11 వ అధ్యాయం...🌹
🌷ప్రతిపదార్ధం:-🌷
🌸ఋణగ్రాహీ = అప్పుతీసుకొనువాడు
🌿శ్రీనివాసో = శ్రీనివాసుడ
🌸ధనదాయీ= అప్పు ఇచ్చువాడు
🌿ధనేశ్వరః = కుబేరుడు
🌸ఆత్మకార్యం = సొంతపని అయిన
🌿కళ్యాణార్ధం నిమిత్తంతు = వివాహం కొరకు
🌸కలౌయుగే = కలియుగం నందలి
🌿విలంబే చైవ వత్సరే = విలంబి నామ సంవత్సరం
🌸వైశాఖే శుక్ల సప్తమ్యాం = వైశాఖమాస శుక్లపక్ష సప్తమి రోజున
🌿చతురదశ లక్షాణి = 14 లక్షల
🌸రామమూద్రాణాం నిష్కాణాం = రామముద్ర కలిగిన నిష్కములను
🌿వృధ్ధిగ్రహణకారణాత్ = యుగధర్మానుసారం వడ్డీ తో కలిపి
🌸ద్రవ్యం దత్తం = తీసుకున్న ఋణాన్ని ఇవ్వగలవాడను.
🌿సవృధ్ధి దిత్సతామూలంస్వీకృతం = ఆ చక్రవడ్డీ సహిత తీసుకున్న మొత్తం ఋణాన్ని
🌸వివాహవర్షమారభ్య = వివాహం జరిగిన సంవత్సరం మొదలుకొని
సహస్రాంతే = 1000సంవత్సరాల లోపు
🌿చక్రపాణినా = చక్రపాణి అను నేను
🌸ధనం పునః = పూర్తి ద్రవ్యం ను ఇవ్వగలవాడను.
🌿దాతవ్యం యక్షరాజాయ = ఇచ్చినవాడు యక్షరాజైన కుబేరుడు.
🌸శ్రీనివాసేన శార్ఞిణా = తీసుకున్నవాడు శ్రీనివాసుడు.
🌿ఏకః సాక్షీ చతుర్వక్త్రో = మొదటి సాక్షి చతుర్ముఖ బ్రహ్మ
🌸ద్వితీయస్తు త్రిలోచనః = రెండవ సాక్షి శివుడు
🌿తృతీయో౽శ్వత్థరాజాస్తు = మూడవ సాక్ష్యం రావిచెట్టు
🌸వేత్తి సర్వమిదం ధృఢం = ఈ సమాచారం అంతా ధృఢమైనది యదార్థమైనది.
🌿ఇత్యేతదృణపత్రస్తు =ఈ ఋణపత్రం
🌸శ్రీనివాసో౽లిఖిత్స్వయం = శ్రీనివాసుడనే నాచేత రాయబడినది.
🌷భావము:-🌷
🌸శ్రీ చాంద్రమాన విళంబి నామ సంవత్సర, వైశాఖ శుద్ధ సప్తమీ సోమవారము నాడు, ధనాధిపతి, ఉత్తర దిశా పాలకుడు అయిన కుబేరుని వద్ద,
🌿శ్రీ వేంకటాచ రమణుడైన శ్రీనివాసుడను పేరు గల నేను, నా కళ్యాణము నిమిత్తము, పదునాలుగు (14)లక్షల సంఖ్య గల శ్రీరామ ముద్ర నిష్కములను,
🌸వృద్ధికి(వడ్డీకి) తీసుకొనుచున్నాను.
వివాహ వర్షము మొదలు వెయ్యి సంవత్సరముల లోపున ఋణము తీర్చే నిర్ణయము.
🌿ఇందులకు సాక్షులు--- చతుర్ముఖ బ్రహ్మ--- ( అని పత్రాన్ని శివుని చేతికిస్తాడు ) శివుడు --- రెండవ సాక్షి , కైలాస పతి శివుడు ( అని పత్రంపై సంతకం చేసి, ఆ పత్రాన్ని, శ్రీనివాసునికి ఇస్తాడు )
🌸శ్రీనివాస --- ఓ అశ్వత్థ వృక్షమా ! మూడవ సాక్షి నీవు
( అని దగ్గరున్న రావి చెట్టుతో అంటాడు)
🌿(ఆ తరువాత దానిపై తన సంతకం చేసి, శ్రీనివాసుడు , కుబేరునికి ఇస్తాడు )
🌹విశేషార్థములు:-🌹
🌷ధనేశ్వరః :-🌷
🌸లక్షీదేవిని ఐశ్వర్య దేవత గా కొలిచినప్పటికినీ ఇక్కడ ఐశ్వర్యం అంటే ధనం తోపాటు సుఃఖ సంతోషాలు, పాడిపంటలు, పనులయందు విజయం కలిగించునది గా చెప్తారు.
🌿అందుకే ధాన్యలక్షీ, ధైర్యలక్షీ, విజయలక్ష్మీ అని పిలుస్తారు. ఇక బంగారాది నవ నిధులకు అధిపతి గా కుబేరుడిని చెప్తారు.
🌷వృధ్ధిగ్రహణకారణాత్ :🌷
🌸అంటే యుగధర్మం ను అనుసరించి అధికమాసాలు , శూన్యమాసాలు కూడా పరిగణ లోకి తీసుకొని సంవత్సరానికి అయిన వడ్డీ ని తరువాతి సంవత్సరం లో అసలుకు కలుపుట దీనినే చక్ర వడ్డీ అంటారు.
🌿ఈవిధం గా మాసానికి రోజులలో కలుగు హెచ్చు తగ్గులను కూడా పరిగణ లోనికి తీసుకొనుట.
🌷రామముద్ర నిష్కాణాం :-🌷
🌸ఆ రోజులలో బంగారు నాణెముల కొలమానం. అంటే మనకు డబ్బుకు రూపాయలు ఎలాగో వారికి నిష్కములు అన్నమాట. అయితే ఒక నిష్క అంటే మన కొలమానం లో ఎంతో వివరంగా తెలియదు.
🌷సహస్త్రాంతే :-🌷
🌸అనగా 1000 సంవత్సరాలుగా చెప్పిననూ అవి 1000 దైవ సంవత్సరాలు గా పరిగణించాలి. మానవులకు 360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం గా పరిగణిస్తారు.
🌿అనగా 3,60,000 మానవ సంవత్సరాలు. ఇది కలియుగం వయసు 4,32,000 అనే యదార్థం కు బలాన్నిస్తుంది.
🌷చక్రపాణి :-🌷
🌸పాణి(చేయి) నందు చక్రం (సుదర్శన చక్రం) ధరించినవాడు. అనగా శ్రీ మహావిష్ణువే శ్రీనివాసుని అవతారం లో వెలిశాడు.
🌷అశ్వత్థరాజం:-🌷
🌸వృక్షాలలో రాజు వంటిది. (రావిచెట్టు) దీనిని త్రిమూర్తుల అవతారం గా చెప్తారు....సేకరణ...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸