ఇంట్లో రోజూ దీపం వెలిగిస్తున్నారా, ఈ దిశగా పెడితే అన్నీ అపశకునాలే!

P Madhav Kumar

 దీపారాధన..హిందువులకు చాలా ముఖ్యమైన విషయం. శుభకార్యం అయినా వేడుక అయినా జ్యోతి ప్రజ్వలనం చేయకుండా ఏ కార్యక్రమమూ మొదలవదు.


దీపారాధన..హిందువులకు చాలా ముఖ్యమైన విషయం. శుభకార్యం అయినా వేడుక అయినా జ్యోతి ప్రజ్వలనం చేయకుండా ఏ కార్యక్రమమూ మొదలవదు. అయితే ఇంట్లో నిత్యం దీపం పెట్టేవారున్నారు. నిత్యదీపారాధన చేసే ఇంట్లో వాస్తు దోషాల నుంచి ఎలాంటి దోషాలు ప్రభావం చూపించవని జ్యోతిష్య శాస్ర పండితులు చెబుతారు. శ్రద్ధ, భక్తి ఎంత ప్రధానమో…విధానం కూడా అంతే ప్రధానం. అందులో ఒకటి దీపారాధన. దేవుడి దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఏ దిశగా పెట్టాలనే సందేహం వస్తుంటంది..అలాంటి వారికోసమే మై సిటీ హైదరాబాద్ కథనం..

షోడశోపచారాల్లో ప్రధానమైనది దీపం. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా ధూపం- దీపం- నైవేద్యం తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉపచారాలు.

“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”

దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. దేవుడిని ఆరాధించటాని ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తున్నామని అర్థం.

దీపారాధన నియమాలు

దీపారాధన కొందరు బంగారు కుందిలో చేస్తారు, మరికొందరు వెండి కుందిలో, ఇంకొందరు ఇత్తడి, స్టీలు, మట్టి ప్రమిదలు వినియోగిస్తారు. అయితే మట్టిప్రమిదలో దీపం వెలిగించినా పర్వాలేదు కానీ స్టీలు కుందుల్లో దీపం వెలిగించరాదని చెబుతారు పండితులు .కొందరు నేరుగా అగ్గిపుల్లతో దీపం వెలిగించేస్తారు కానీ…అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగించకూడదు.. ఏక హారతితో కానీ, అగరుబత్తితో కానీ దీపం వెలిగించాలి
ఎప్పుడూ ఒక్క వత్తితో దీపం పెట్టకూడదు.

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”

“మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని అర్థం. ఇక మూడు వత్తులు (త్రివర్తి) ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఏకవత్తి కేవలం శవం వద్ద వెలిగిస్తాం. అందుకే ఈ శ్లోకం ప్రకారం కూడా మూడు వత్తులతో దీపం వెలిగిస్తారు కానీ ఒక వత్తిని వినియోగించరు.

దీపం ఏ దిశగా పెట్టాలి

దేవుడికి ఎదురుగా ఎప్పడూ దీపాన్ని పెట్టకూడదు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగి సుఖ సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోయి, శనిబాధల నుంచి విముక్తి కలుగుతుంది ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం సిద్ధిస్తాయి.
దక్షిణంవైపు దీపారాధన ఎప్పుడూ చేయకూడదు..ఎందుకంటే దక్షిణం యముడి స్థానం..ఈ దిశగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి.

దీపారాధనకు ఏ నూనె వాడుతున్నారు

  • దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలనే విషయంపై చాలామంది అయోమయానికి గురవుతుంటారు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు.
  • దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే.
  • దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది.
  • విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
  • నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభం అని పండితులు చెబుతారు.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ అందించాం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat