తిరుమల చరిత్ర గురించి ఆసాంతం తెలిసిన వారికి తిరుమల నంబి పేరు సుపరిచితమే కానీ.. తెలియని వారు మాత్రం ఆ మహోన్నత వ్యక్తి కోసం తప్పక తెలుసుకోవాలి..
ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన వ్యక్తి .. తిరుమల నంబి
Thirumalanambi : తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రే కాదు.. ఆ ప్రాంతం గురించి, అక్కడ నివసించిన వాళ్ల గురించి ఇలా ఎన్నో ఆసక్తిని రేకెత్తించే ఎన్నో విషయాలు, విశేషాలు మిగిలే ఉంటాయి. అలా చెప్పుకోవాల్సిన ముఖ్య వ్యక్తుల్లో తిరుమల నంబి (Thirumalanambi) ఒకరు. తిరుమల చరిత్ర గురించి ఆసాంతం తెలిసిన వారికి ఈ పేరు సుపరిచితమే కానీ.. తెలియని వారు మాత్రం ఆ మహోన్నత వ్యక్తి కోసం తప్పక తెలుసుకోవాలంటారు తిరుమల వాసులు.
తిరుమల నంబి ఎవరు?
కొనేళ్ల క్రితం తిరుమలలో(Thirumala) ఎవరూ నివాసం ఉండేవాళ్లు కాదట. ఎంత డెవలప్ చేసినా.. ఇప్పటికీ ఎత్తయిన కొండల మధ్య తిరుమల గిరులు దాటి బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వెయ్యేళ్ల క్రితం తిరుమల అంటే.. భయంకరమైన క్రూర జంతువులు( Terrible wild animals) నిండి ఉన్న కీకారణ్యంగా ఉండేది. ఈ రోజుల్లోనే అప్పుడప్పుడు చిరుత పులులు సంచరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటువంటిది అప్పట్లో ఎంత భయంకరంగా అడవి మృగాల సంచారం ఉండేదో ఊహించుకోవచ్చు. దీనికి తోడు విపరీతమైన చలి, భయంకరమైన దోమలు తిరుమలను వణికించేసేవట. అందుకే ఉదయం 10 గంటల నుంచి.. సాయంత్రం 4 గంటల వరకే జనాలు తిరిగేవారట. తర్వాత తిరుమల అంతా బోసిపోయేదట. అక్కడక్కడా మిణుకుమిణుకు మంటున్న దీపాల వెలుగు తప్ప .. ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఉండేది కాదట.
తిరుమలలో అప్పట్లో కనీసం ఎవరూ ఉండటానికి కూడా సాహసించేవారు కాదట. వెంకన్న కొలువున్న ప్రాంతంగా ఉండబట్టే అక్కడక్కడా జనాలు ఉండేవారు. అటువంటిది మొదటిసారిగా ప్రాణాలకు తెగించి స్వామి వారికి నిత్య కైంకర్యాల కోసం మొదటిసారిగా తిరుమలలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్న వ్యక్తి తిరుమలనంబి (Thirumalanambi) అట. అందుకే ఆయనను ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుమల అని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆయన కైంకర్య సేవలకు మెచ్చిన వెంకటేశ్వరస్వామి ఆయనకు స్వయంగా బోయవాని రూపంలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర కారులు చెబుతారు. అంతేకాదు ఆయన కోసం ఆకాశగంగ తీర్థాన్ని ఏర్పరచిన సన్నివేశం అద్భుతమని చెప్పే ఎన్నో విశేషాలు తిరుమల గ్రంధాలలో ఉంటాయి.
తిరుమలనంబినే శ్రీశైలపూర్ణులు అని కూడా పిలిచేవారు. ఈయన రామానుజాచార్యుల (Ramanujacharya) వారికి స్వయానా మేనమామ అట. రామానుజాచార్యుల తల్లిదండ్రులకు చాలా కాలం బిడ్డలు లేకపోతే… తిరుమలనంబి వారి చేత చెన్నై ట్రిప్లికేన్ పార్థసారథి స్వామి దేవాలయంలో.. పుత్రకామేష్టి యాగం (Putrakameshti Yagam) చేయించారట. ఆ తరువాత రామానుజాచార్యుల జననం జరిగిందట.
బ్రహ్మోత్సవాలలో తిరుమల నంబి స్థానం..
తిరుమల నంబి దక్షిణ మాడవీధిలో చిన్న కుటీరం ఏర్పరచుకుని తిరుమల వెంకన్నకు నిత్య కైంకర్యాలు (Nitya kainkaryas for Tirumala Venkanna) జరిపేవారట. అయిన పరమదించాక.. తిరుమలనంబి నివశించిన ప్రాంతంలోనే గుర్తుగా ఆయనకు గుడి కట్టారు ఆలయ అధికారులు, స్థానికులు. సుపధం మార్గానికి కుడి ప్రక్కగా దక్షిణ మాఢవీధిలో ఈ మహానుభావుడి గుడి ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో (Srivari Brahmotsavam) కానీ స్వామివారి విశేష పండుగ ఊరేగింపులలో.. స్వామివారు ఈ గుడికి ఎదురుగా రాగానే నైవేద్యంతో పాటు హారతి సమర్పించే ఆచారం నేటికీ ఉంది. అయితే ఓసారి బ్రహ్మోత్సవాల్లో వేదపండితులు ఈ విషయం మర్చిపోయారట. దీంతో స్వామివారి రధం ముందుకు కదలలేదట.. తరువాత విషయం గ్రహించిన పండితులు, టీటీడీ అధికారులు.. తిరుమల నంబికి హారతి ఇస్తే.. అప్పుడు రథం ముందుకు కదిలిందట. ఇలా స్వామి వారి కృపకు కారణమైన తిరుమల నంబి నేటికీ వెంకన్న కృపాపాత్రుడిగానే ఉన్నారని చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటారు వేద పండితులు.